Bigg Boss 9 Telugu: గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్​‌గా పాన్ ఇండియా హీరో.. ఇక టీఆర్పీ రికార్డులు బద్దలు కావాల్సిందే

Bigg Boss Telugu 9 Grand Finale Chief Guest: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఇప్పుడు ఈ రియాలిటీ గేమ్ షో గ్రాండ్ ఫినాలే దశకు చేరువైంది. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరగనున్న ఈ గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు పోటీపడుతుండగా, రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రతిష్టాత్మక ట్రోఫీ ఎవరి సొంతం కానుందన్న ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ టైటిల్ విన్నర్ ఎవరు అన్నదే కాదు.. గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు? అన్న అంశంపై కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠగా సాగుతోంది. ఎప్పుడు చూడని టాస్కులు, ట్విస్టులతో రసవత్తరంగా సాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోందనే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టైటిల్ విన్నర్ ఎవరు? అనే చర్చతో పాటు గ్రాండ్ ఫినాలే ఛీప్ గెస్ట్ ఎవరు? అనేది కూడా చర్చనీయంగా మారింది. గత సీజన్లను పరిశీలిస్తే.. బిగ్ బాస్ ఫినాలేకు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా వచ్చి షోకు మరింత గ్లామర్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, శివ బాలాజీకి ఆయనే ట్రోఫీ అందజేశారు. రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా ఉండగా, వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై కౌశల్‌కు ట్రోఫీ అందించారు.

Bigg Boss Telugu 9 Grand Finale Pan-India Star Chief Guest Chiranjeevi or Prabhas Buzz

ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ బాధ్యతలు చేపట్టగా, మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఫినాలేకు గెస్ట్‌గా వచ్చి విజేతలను ప్రకటించారు. సీజన్ 8లో అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ నిఖిల్‌కు ట్రోఫీ అందించారు. ఈ నేపథ్యంలో సీజన్ 9 ఫినాలేకు కూడా మరోసారి చిరంజీవి వస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు కారణంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ వేదికపై చిరంజీవి సందడి చేసే అవకాశం ఉందని టాక్. ఇది నిజమైతే, చిరంజీవి మూడోసారి బిగ్ బాస్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు.

అయితే మరోవైపు.. ఫినాలే గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్'సినిమా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ బిగ్ బాస్ వేదికపై కనిపిస్తే, షో క్రేజ్ మరింత పెరిగే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ ఇప్పటివరకు బిగ్ బాస్ వేదికపై కనిపించలేదు. అందుకే ఆయన రాక షోకు కొత్తదనాన్ని తీసుకురావచ్చని చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే.. టైటిల్ రేస్ కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సోషల్ మీడియా ట్రెండ్స్, పోల్స్ ప్రకారం కల్యాణ్, తనూజ, డీమన్ పవన్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. మొదట తనూజ- కల్యాణ్ మధ్యే పోటీ ఉంటుందని భావించినా, ఫైనల్ వీక్‌లో డీమన్ పవన్ కూడా అనూహ్యంగా బలమైన పోటీదారుగా మారాడు. అయినప్పటికీ, ఎక్కువ మంది నెటిజన్లు, ఫ్యాన్ పోల్స్ మాత్రం కల్యాణ్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. మొత్తానికి అన్ని సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెంట్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్‌తో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి వస్తారా? లేక ప్రభాస్ వేదికపై సందడి చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. డిసెంబర్ 21 వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X