Bigg Boss Telugu 9 Grand Finale: షాకింగ్ ట్విస్ట్.. బిగ్‌బాస్ టైటిల్ రేసు నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్..

Bigg Boss Telugu 9 Grand Finale: గత మూడు నెలలుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య ట్విస్టులు, హై వోల్టేజ్ టాస్కులు, భావోద్వేగ ఘట్టాలతో సాగిన ఈ సీజన్‌కు మరో ఒక్క రోజులో ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం, డిసెంబర్ 21న జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం మేకర్స్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలా రసవత్తరంగా సాగుతోన్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఎవరు ఊహించిన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత్ీ టాప్ 5 ఫేస్ లో ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ట్రోఫీ కోసం ఐదుగురు కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్‌, సంజన గల్రానీ, తనూజ .. ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. పేరుకు ఐదుగురు ఉన్నప్పటికీ, ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే టైటిల్ రేసు మాత్రం ప్రధానంగా తనూజ, కళ్యాణ్ మధ్యనే నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా బజ్, అన్ అఫీషియల్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయి. ఇక గ్రాండ్ ఫినాలే వేదికపై చివరి క్షణంలో ఏ ట్విస్ట్ జరుగుతుందో చూడాల్సిందే.

Bigg Boss Telugu 9 Grand Finale Sanjana Galrani Eliminated from Top 5 in Shocking Twist

ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వచ్చి, సందడి చేశారు.ఈ తరుణంలో ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టైటిల్ రేసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించబడిన డ్రామా క్వీన్ సంజన గల్రానీ (Sanjana Galrani)ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. టాప్ 5 దశలోనూ గట్టిపోటీ ఇస్తుందని భావించిన సంజన ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది.

బిగ్ బాస్ సీజన్ 9కు ప్రారంభమైన రోజుల్లో పెద్దగా బజ్ లేకపోయిన సమయంలో షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీనే అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. గప్‌చుప్‌గా గుడ్డు దొంగతనం చేసి హౌస్ మొత్తం గొడవపడేలా చేయడం, ఒక్కొక్కరి నిజస్వరూపం బయటపడేలా చేయడం ఆమె ఆటలో కీలక మలుపులు. అప్పటివరకు సాఫ్ట్‌గా సాగిన షో ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. అదే సమయంలో 'సీజన్ 9కి కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ సంజనే' అనే మాట వినిపించడం మొదలైంది.

సంజన ఆట ప్రత్యేకత ఏమిటంటే..ఎక్కడున్నా ఏదో ఒకటి జరగబోతోందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడం. టాస్క్‌లో పోటీపడ్డా, సంచాలక్‌గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్‌రూమ్‌లో కబుర్లు చెప్పినా ఆమె చుట్టూ కంటెంట్ తప్పనిసరిగా ఉండేది. 'సంజనా సైలెన్సర్', 'సంజూ బాబా', 'మమ్మీ'అంటూ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రతి నిమిషం వినోదాన్ని అందించే ప్రయత్నం చేసింది. అందుకే ఆమెను 'ఎవరికీ అర్థం కాని గేమర్'గా పలువురు అభివర్ణించారు.

అయితే అదే దూకుడు మనస్తత్వం, కత్తుల్లాంటి మాటలు ఆమెను కొన్నిసార్లు చిక్కుల్లో పడేశాయి. అభిప్రాయభేదాలు, భావోద్వేగ ఘర్షణలు ఆమె కన్నీళ్లకు కారణమయ్యాయి. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయని మొండిధైర్యం ఆమె సొంతం. ఎవరి మీద ఆధారపడి ఆడకుండా, తన ఆత్మవిశ్వాసంతోనే ఇంత దూరం వచ్చానన్న భావన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇంత బలమైన ప్రస్థానం సాగించిన సంజన చివరి దశలో ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్ అనే చెప్పాలి. ఆమె టాప్ 5 నుంచి గేమ్ నుంచి బయటకు వచ్చినా, ఈ సీజన్‌కు ఆమె అందించిన కంటెంట్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతాయనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X