Bigg Boss Telugu 9 Grand Finale: మరో షాకింగ్ ఎలిమినేషన్.. టైటిల్ రేసు నుంచి టాప్ 3 కంటెస్టెంట్ ఔట్..
Bigg Boss Telugu 9 Grand Finale: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) మరికొద్ది గంటల్లో ముగియనున్నది. ఈ తరుణంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా బిగ్ బాస్ గురించే చర్చ. ఈ సీజన్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుంది? అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రతి అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది.ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలేలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడని, టైటిల్ కోసం పోటీపడతాడని అభిమానులు భావించిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారంట. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? అసలేం జరిగిందంటే?
ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్.. బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ కా బాప్ ఇమ్మూ ఎలిమినేషన్ వార్త అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఫైనల్ ఓటింగ్‌లో ఊహించని విధంగా అతను నాలుగో స్థానంతో బయటకు వచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇమ్మాన్యూయేల్ తన మాట, ఆట తీరుతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. బిగ్ బాస్ లో ఇమ్మూ ప్రయాణం చాలా ప్రత్యేకంగా.. ఎలాగంటే.. బిగ్ బాస్ చరిత్రలో కొన్ని ప్రయాణాలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన జర్నీల్లో ఇమ్మాన్యుయేల్ (ఇమ్మూ) ప్రయాణం నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహాం లేదు.

ఇమ్మాన్యుయేల్ నవ్వులు పంచుతూ, భావోద్వేగాలను నిజాయితీగా బయటపెడుతూ, ఆటలో తనదైన ముద్ర వేసిన కంటెస్టెంట్‌గా ఇమ్మూ ఈ సీజన్‌కు గుర్తుగా మారాడు. జబర్దస్త్ వేదికపై తన టైమింగ్ కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్, బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. కేవలం నవ్వులు పంచడమే కాదు, టాస్క్‌ల్లోనూ పోటీపడి తన సత్తా చాటాడు. దీంతో 'కామెడీ మాత్రమే కాదు.. ఆటలోనూ ఇమ్మూ స్ట్రాంగ్' అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది.
బిగ్‌బాస్ హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్లు ఒకే కోణంలో కనిపిస్తారు. కానీ ఇమ్మూ మాత్రం ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటినీ సమపాళ్లలో చూపించాడు. తన జీవితంలోని కష్టాలను, అమ్మ కలను, కెరీర్ కోసం పడ్డ పోరాటాన్ని ఓపెన్‌గా చెప్పాడు. అదే సమయంలో కష్టమైన వాతావరణాన్ని కూడా తన కామెడీతో లైట్ చేశాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ అతనికి మంచి కనెక్షన్ ఏర్పడింది.
ఈ సీజన్‌లో ఇమ్మూ ప్రయాణానికి మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా మధ్యలో ఎలిమినేషన్ భయంతో చాలా మంది కంటెస్టెంట్లు ఒత్తిడికి లోనవుతారు. కానీ ఇమ్మాన్యుయేల్ మాత్రం ఎలిమినేషన్‌ను పెద్దగా ఎదుర్కోకుండా టాప్ 5 వరకు చేరాడు. ఇది అతనికి దక్కిన ప్రజాదరణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడన్న అంచనాలు కూడా అదే కారణంగా ఏర్పడ్డాయి. సాధారణంగా ఫైనల్‌లో సూట్‌కేస్ ఆఫర్‌తో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో ఇమ్మాన్యుయేల్‌కు సూట్‌కేస్ కూడా లేకుండానే ఎలిమినేట్ అయ్యాడన్న టాక్ మరింత సంచలనంగా మారింది. టాప్ 3లో ఉంటాడన్న అంచనాల మధ్య ఇలా జరగడం ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేసింది. సోషల్ మీడియాలో 'ఇమ్ముకు అన్యాయం జరిగింది' అంటూ పోస్టులు వెల్లువెత్తాయి.
రెమ్యునరేషన్ ఎంతంటే?
15 వారాలు హౌస్‌లో కొనసాగిన ఇమ్మాన్యుయేల్‌కు రోజుకు రూ.35 వేల రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని సమాచారం. వారానికి సుమారు రూ.2.25 లక్షలు, మొత్తం కలిపి దాదాపు రూ.33 లక్షల 75 వేలు అందుకున్నట్టు తెలుస్తోంది. టైటిల్ దక్కకపోయినా, తన ఆటతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కోట్లాది ప్రేక్షకుల మనసు గెలిచిన ఇమ్మాన్యుయేల్ ప్రయాణం మాత్రం బిగ్‌బాస్ చరిత్రలో ప్రత్యేకం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. గ్రాండ్ ఫినాలేలో ఈ షాకింగ్ ఎలిమినేషన్‌తో బిగ్ బాగ్ మరింత చర్చనీయాంశంగా మారింది. టైటిల్ ఎవరి చేతికి వెళ్లినా, ఇమ్మాన్యుయేల్ మాత్రం ఈ సీజన్‌కు గుర్తుండిపోయే ఎంటర్‌టైనర్‌గా నిలిచారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications











