Bigg Boss 9 Telugu Grand Finale: నాగార్జునతో కంటెస్టెంట్స్ సందడి.. ఫినాలేకి ఆ ఒక్కరూ దూరం..
Bigg Boss 9 Telugu Grand Finale: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు 105 రోజుల పాటు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ తెలుగు సీజన్ (Bigg Boss Telugu 9) గ్రాండ్ ఫినాలే ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో హోస్ట్ నాగార్జున తో కలిసి కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు. అయితే, ఫినాలే వేళ ఒక అనూహ్య విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పరిణామం ఏంటీ?
బిగ్ బాస్ సీజన్‌లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన అందరూ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యారు. అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మాత్రం ఫినాలేకు డుమ్మా కొట్టింది. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, వారిలో శ్రష్టి ఒక్కరే ఫినాలే వేడుకకు దూరంగా ఉండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. శ్రష్టి గైర్హాజరుకు గల కారణాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షూటింగ్ కమిట్‌మెంట్స్ ఉన్నాయా? వ్యక్తిగత కారణాలా? లేక బిగ్ బాస్ టీమ్‌తో ఏమైనా విభేదాలా? అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక ఫినాలే ప్రోమోలో మరో సంచలన విషయం కూడా బయటపడింది. ఎడిటింగ్‌లో జరిగిన చిన్న పొరపాటు కారణంగా టాప్-5 ఎలిమినేషన్ అఫీషియల్‌గా లీక్ అయిందనే టాక్ వినిపిస్తోంది. హౌస్‌లో ఉండాల్సిన సంజన గ్యాలరీలో కనిపించడంతో, అప్పటికే ఆమె ఎలిమినేట్ అయిందన్న విషయం క్లియర్ అయిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇక ఫినాలేకు ముందు ఇమ్మానుయేల్ ఎలిమినేషన్ కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇమ్మానుయేల్ అని అభిమానులు భావిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, టాస్కులు, హౌస్‌లో ఎనర్జీ... అన్నింటినీ భుజాలపై మోసిన ఇమ్మూ టాప్-4లోనే ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను బాధించింది. కనీసం టాప్-3 అయినా ఉంటాడని చాలా మంది ఆశించారు.
సంజన, ఇమ్మానుయేల్ ఎలిమినేట్ కావడంతో టాప్-3లో కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్ మిగిలారు. వీరిలో డీమాన్ పవన్ సూట్‌కేస్ ఆఫర్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలా జరిగితే కళ్యాణ్ - తనూజల మధ్య విన్నర్ పోటీ నెక్ టు నెక్‌గా మారనుందని సమాచారం. మొత్తానికి గ్రాండ్ ఫినాలే వేళ శ్రష్టి వర్మ గైర్హాజరు ఒకవైపు, లీకైన ఎలిమినేషన్లు మరోవైపు బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలే మరింత హాట్ టాపిక్‌గా మారింది. మరి చివరికి ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











