Bigg Boss Telugu 9 Grand Finale: బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్.. ముగిసిన సామాన్యుడి ప్రయాణం.. విన్నర్ ఎవరంటే?

Bigg Boss Telugu 9 Grand Finale: తెలుగు బుల్లితెరపై 105 రోజుల పాటు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9) చివరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ యుద్ధం నేడు (డిసెంబర్ 22, ఆదివారం) గ్రాండ్ ఫినాలేతో ముగింపు పడనున్నది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్‌లో చివరికి ఐదుగురు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించగా, ఫినాలేకు ముందు బిగ్ బాస్ మేకర్స్ ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. టాప్ 3 స్థానంలో ఊహించిన ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరంటే?

ప్రస్తుతం హౌస్‌లో టైటిల్ కోసం కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన గల్రానీ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరంతా తమదైన శైలిలో ఆట తీరుతో, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించి ఇక్కడి దాకా కొనసాగారు. అయితే, ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్, అనధికారిక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే, టైటిల్ పోరు ప్రధానంగా కళ్యాణ్ పడాల, తనూజ మధ్యే సాగుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే.. డిమాన్ పవన్ కూడా వారికి పోటీ ఇవ్వబోతున్నారని అందరూ భావించారు. కానీ తాజా లీక్స్ ప్రకారం... డిమాన్ పవన్ టాప్ 3లో స్థానంలో ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఈ పరిణామం పవన్ అభిమానులకు తీవ్ర నిరాశకు లోనుచేస్తుంది. సోషల్ మీడియాలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss Telugu 9 Grand Finale Twist Demon Pavan Shockingly Eliminated at Top 3 Stage

సామాన్యుడి నుంచి యోధుడిగా... డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు చాలామంది అతన్ని లైట్‌గా తీసుకున్నారు. అగ్నిపరీక్ష టాస్క్‌లో కనిపించిన తీరు చూసి, ఎక్కువ దూరం వెళ్లడు అనుకున్నవారు కూడా ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఒక్కొక్క వారం తన ఆటతీరుతో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. కండబలం మాత్రమే కాదు... బుద్ధిబలం ఉపయోగించి ఆడుతూ, రెండు సార్లు కెప్టెన్‌గా నిలిచి తాను సాధారణ కంటెస్టెంట్ కాదని నిరూపించాడు.

అయితే.. రీతూతో ఉన్న లవ్ ట్రాక్ పవన్ గేమ్‌కు మొదట్లో మైనస్ అయ్యింది. ఇద్దరి మధ్య గొడవలు, మళ్లీ కలయికలు కొంతమందికి చిరాకు తెప్పించాయి. దీంతో పవన్ టాప్ 5లో కూడా నిలుస్తాడా అనే సందేహాలు వచ్చాయి. కానీ రీతూ ఎలిమినేషన్ తర్వాత పవన్ పూర్తిగా మారిపోయాడు. గేమ్‌పై పూర్తి ఫోకస్ పెట్టి, టాస్కుల్లో దూకుడు చూపిస్తూ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. రీతూ వెళ్లిన తర్వాత పవన్‌లో 'పవర్ యాంగిల్' బయటపడింది. కామెడీ పంచ్‌లు, ఫిజికల్ టాస్కుల్లో 'బాహుబలి'లా ఆడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే మొదట్లో నాలుగో స్థానం అనుకున్న పవన్, ఓటింగ్ ట్రెండ్స్‌లో ఏకంగా టాప్ 3కి చేరాడు. కానీ చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారవడంతో టాప్ 3 వద్దే పవన్ ప్రయాణం ముగిసినట్టు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే?
సమాచారం ప్రకారం డిమాన్ పవన్‌కు వారానికి సుమారు రూ.70,000 చొప్పున చెల్లించారు. 15 వారాలకు గాను ఆయన సుమారు రూ.10.5 లక్షల వరకు సంపాదించినట్టు అంచనా. అలాగే.. రూ. 15 లక్షల ఆఫర్ తీసుకున్నట్టు తెలుస్తోంది.సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన డిమాన్ పవన్, యోధుడిగా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్తున్నాడని చెప్పాలి. విన్నర్ కాకపోయినా, పవన్ సంపాదించుకున్న ఫ్యాన్‌బేస్, గుర్తింపు మాత్రం అతడికి పెద్ద ప్లస్. ఇక గ్రాండ్ ఫినాలేలో ఇంకెన్ని షాకింగ్ ట్విస్టులు ఉంటాయో వేచిచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X