Bigg Boss Telugu 9 Grand Finale: ఇదేం ట్విస్టురా బాబు.. ఫినాలే రేసు నుంచి సంజన ఔట్.. ఇమ్మూకి షాక్..!
Bigg Boss Telugu 9 Grand Finale: తెలుగు బుల్లితెరపై 105 రోజుల పాటు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్‌కు విన్నర్ ప్రకటించనున్నారు. అయితే ఫినాలే వేళ చోటుచేసుకున్న ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాయి. గ్రాండ్ ఫినాలేను మరింత ప్రత్యేకంగా మార్చుతూ హోస్ట్ నాగార్జున (Nagarjuna) 'కూలీ' సినిమాలోని సైమన్ పాత్ర లుక్‌లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. "105 రోజుల రణరంగం చివరి అంకానికి చేరుకుంది.. ఈరోజు ముగింపు అద్భుతంగా ఉండబోతోంది" అంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యలతో ఫినాలే ప్రారంభమైంది.
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల సందడి
ఫినాలేకు ఇప్పటికే ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్, దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, ప్రియ, సుమన్ శెట్టి, రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్, ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ, హరిత హరీష్, గౌరవ్, రీతూ చౌదరి, రాము రాథోడ్, భరణి, ఆయేషా, దివ్య నిఖిత తదితరులు హాజరై స్టేజ్‌ను గ్రాండ్‌గా మార్చారు. ఇక హౌస్ లో తనూజ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, డీమాన్ పవన్, సంజన తమ ప్రత్యేక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఫిదా చేశారు. మంగ్లీ ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు ఫినాలేకు మరింత ఎనర్జీ తెచ్చింది. ఈ సందర్భంగా "బిగ్ బాస్ సీజన్ 9 దేశంలోనే నెం.1 షో" అని నాగార్జున ప్రకటించారు.

ఊహించని ఎలిమినేషన్ ట్విస్టు
టాప్ 5 కంటెస్టెంట్లను బయటకు తీసుకొచ్చేందుకు హీరో శ్రీకాంత్ (Srikanth) హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. వైట్ టీషర్టుల వెనుక 'సేఫ్ లేదా అన్‌సేఫ్' రాయమని బిగ్ బాస్ ఆదేశించగా... శ్రీకాంత్ అందరికీ 'సేఫ్' అని రాయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే అసలు ట్విస్టు ఇక్కడే జరిగింది. గార్డెన్ ఏరియాలోకి కంటెస్టెంట్లను పిలిచిన తర్వాత సడన్‌గా బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ అయ్యాయి. బ్యాండ్ మేళం, డాన్సర్లతో సంజనను కట్ అవుట్ కు దండ చేసి బయటకు తీసుకువెళ్లారు. వెంటనే నాగార్జున 'సంజన, నువ్వు ఎలిమినేట్' అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంజన కామెంట్స్‌తో ఇమ్మూకి షాక్
ఎలిమినేషన్ తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన సంజన భావోద్వేగానికి లోనయ్యారు. 'బిగ్ బాస్ విన్నర్ ఎవరు?' అని నాగార్జున అడగగా 'నా ఇష్టమైన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్... అతడే విన్నర్ కావాలి. కానీ ఇప్పటివరకు లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు కాబట్టి, తనూజ గెలిస్తే బాగుంటుంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలతో ఇమ్మాన్యుయేల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీకాంత్ స్పెషల్ గెస్ట్ హైలైట్
ఫినాలేలో స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన హీరో శ్రీకాంత్ ఫైనల్ కంటెస్టెంట్లతో ముచ్చటించారు. "బిగ్ బాస్ 9 ప్రతి ఎపిసోడ్ చూశాను.. మీరంతా అద్భుతంగా ఆడారు" అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు-'హలో బ్రదర్స్' సినిమాలో తనకు బాడీ డబుల్‌గా నటించింది శ్రీకాంత్ అనే విషయాన్ని వెల్లడించడంతో కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు. ఇలా ఊహించని ట్విస్టులు, ఎమోషనల్ మూమెంట్స్‌తో బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మరి చివరికి టైటిల్ ఎవరి చేతికి వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











