Bigg Boss Telugu 9: ఇదేంట్రా బాబు.. కళ్యాణ్ పడాల డిస్మిస్! అసలు ఆర్మీ జవాన్ కాదా?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ రియాలిటీ గేమ్ షోకు ఎండ్ కార్డు పడుతుంది. ఈ సీజన్ ఎన్నో ట్విస్టులు, మలుపులతో రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో టైటిల్ విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరు? టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్స్ ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బీబీ ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా కళ్యాణ్ పడాలపై పడింది. అతడే ఈ సీజన్ విన్నర్ అనే హోప్స్ క్రియేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ ఆ విషయాలేంటీ? అసలేం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. గతంలో ఎన్నాడు లేని విధంగా సెలబ్రెటీలు వర్సెస్ కామనర్స్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. సెలబ్రెటీ కోటాలో 9 మంది అడుగుపెడితే.. కామనర్స్ కోటాలో 6 గురు గేమ్ లో పాల్గొన్నారు. ఇలా 15 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగులో కామన్ మ్యాన్ కేటగిరీ కోటా కింద అడుగు పెట్టిన పవన్ పడాలపై బీబీ ప్రేక్షకులు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అతనిపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎందుకంటే.. పవన్ సింపుల్ అండ్ కామ్ ఆటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసు దొచుకున్నారు. దీనికి ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ తోడు కావడంతో ప్రేక్షకుల మద్దతు పొందుతూ ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచాడు.

సీజన్ ప్రారంభం నుంచి టైటిల్ రేస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన తనూజను కూడా వెనక్కు నెట్టి, బిగ్ బాస్ టికెట్ టు ఫీనాలే రేసులో టాప్ లో నిలిచారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున ప్రశంసలు, ఆర్మీ స్టైల్‌లో ఇచ్చిన సెల్యూట్స్, కెప్టెన్‌గా రెండు వారాల్లో వరుసగా నిలువడం అన్ని కలసి కళ్యాణ్‌ను టైటిల్ రేస్‌లో టాప్ కన్టెండర్‌గా నిలిపాయి. ఆర్థిక స్థితి బలహీనంగా ఉండటం, సామాన్యుడిగా హౌస్‌లోకి ప్రవేశించడం ప్రేక్షకులలో 'జై జవాన్' సెంటిమెంటును రేకెత్తించింది. ఈ సీజన్‌లో అతడిని తెలుగోడైన విన్నర్‌గా చూడాలన్న కోరిక సోషల్ మీడియాలో బలంగా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో కళ్యాణ్ పడాల .. ఆర్మీ హోదాపై కొత్త వివాదం చెలరేగింది. ఎస్‌జే సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అతడు కళ్యాణ్‌పై కీలక ఆరోపణలు చేస్తూ.. వరుసగా వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోల్లో ప్రధానంగా.. పవన్ పడాల అసలు ఇండియన్ ఆర్మీ కాదని, CRPFలో కొద్దికాలమే పనిచేసి వచ్చేశాడని, ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండడం నియమాలకు విరుద్ధమని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, "సోల్జర్‌గా ఉంటే ఎక్కడ పడితే అక్కడ సెల్యూట్ చేయరు" అంటూ క్రమశిక్షణ విషయంలో కళ్యాణ్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు.
ఇక కళ్యాణ్ అభిమానులు తమవంతుగా సోషల్ మీడియాలో కౌంటర్ కామెంట్లతో చర్చ చేస్తున్నారు. బిగ్ బాస్ టీం ఇదే విషయంలో తనదైన వెరిఫికేషన్ చేసి ఉండేదని, CRPF అయినా.. ఆర్మీ అయినా.. దేశ సేవే చేసాడని, వ్యక్తిగత జీవితాన్ని తవ్వి విమర్శించడం తగదని స్ట్రాంగ్ కామెంట్స్ పెడుతున్నారు. "మీరు చేయలేనిది అతను చేస్తున్నందుకే ఈ అసూయ" అంటూ ఆర్మీ జవాన్ సుందర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
వాస్తవానికి, బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పుడే కళ్యాణ్ తాను రాజీనామా చేసి నటన వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని స్పష్టంగా చెప్పాడు. ఆర్మీలో చేరడం తనకు ప్యాషన్ కాకుండా, కుటుంబ ఒత్తిడితో జరిగిన విషయం అని, తన భవిష్యత్తు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉందని తెలిపాడు. కాబట్టి షో తర్వాత తిరిగి సర్వీస్‌లో చేరే అవకాశమే లేదని అప్పట్లోనే చెప్పాడు. గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ 'జై కిసాన్' భావోద్వేగంతో టైటిల్ దక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన వివాదాలతో అతడి ఇమేజ్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు కళ్యాణ్ 'జై జవాన్' అనే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందనే వాదన లేకపోలేదు. ఏది ఏమైనా .. సీజన్ ఫైనల్‌కు కేవలం కొన్ని రోజుల ముందు ఇలాంటి వివాదం కాస్త చర్చనీయంగా మారింది. ఈ వివాదం నిజమెంత? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఫ్యాన్ మాత్రం "కళ్యాణ్ పడాలే బిగ్ బాస్ సీజన్ 9 విజేత అవుతాడు' అంటు కామెంట్స్ పెడుతూ సపోర్టు ఇస్తున్నారు. ఈ వివాదం కళ్యాణ్ ఓటింగ్ పై ఏమైనా ప్రభావం పడుతుందా? లేదా కావాలనే ఆరోపణలు చేస్తున్నారా? వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











