Bigg Boss Telugu 9: ఇమ్మాన్యుయేల్ బిగ్‌బాస్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా?
బిగ్‌బాస్ తెలుగు 9 చివరి దశకు చేరింది. ఇటీవలే 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. మరో 3 వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు? ఈ సీజన్ విజేత ఎవరు? అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ముద్ర వేయించుకున్న ఇమ్మాన్యుయేల్‌కు టైటిల్ విషయంలో ఊహించని షాక్ తగిలినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
12వ వారంలో నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగులో 9లో ఇప్పటి వరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, ఆయేషా జీనత్, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, రాము రాథోడ్, శ్రీనివాస సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తాలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో దివ్య నిఖిత, ఇమ్మాన్యుయేల్, పడాల పవన్ కళ్యాణ్, తనూజా పుట్టస్వామి, రీతూ చౌదరి, సంజన గల్రానీ, సుమన్ శెట్టి, పవన్ డిమోన్‌లు ఉన్నారు. ఇక 12వ వారంలో 8 మంది నామినేషన్స్‌లోకి వచ్చారు. వారు ఇమ్మాన్యుయేల్, దివ్య నిఖిత, సంజన గల్రానీ, భరణి శంకర్, పవన్ కళ్యాణ్, పవన్ డిమోన్, సుమన్ శెట్టి, తనూజ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్‌ను వీడనున్నారు.

టాప్ 5లో ఎవరంటే?
అంతా బాగానే ఉంది కానీ ఈసారి టాప్ 5ని సెలెక్ట్ చేయడం అంత ఈజీగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. భరణి శంకర్, తనూజ పుట్టస్వామి, ఇమ్యాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్‌లు టాప్ 5లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వీరిలోనూ తనూజా - భరణిల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. సినీ, బుల్లితెర వర్గాల మద్ధతుతో పాటు బలమైన పీఆర్ సపోర్ట్ వీరిద్దరికీ ఉండటంతో ఓటింగ్‌లో వీరు అలవోకగా సేవ్ అవుతున్నారు.
ఇమ్మాన్యుయేల్‌కు టఫ్ ఫైట్
వీరిద్దరికీ ఇమ్యాన్యుయేల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిగ్‌బాస్ 9లో ఎంటర్‌టైనర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్మాన్యుయేల్ మాత్రమే. టాస్క్‌లు, గేమ్స్‌లో దూకుడుగా ఉంటూనే అందరితో కలివిడిగా ఉంటున్నారు ఇమ్మూ. హౌస్‌లో తన ఫ్రెండ్ రీతూ చౌదరి ఉన్నప్పటికీ ఆమెతోనే కాకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఈ సీజన్‌లో మొత్తం మూడు సార్లు ఇమ్మాన్యుయేల్ కెప్టెన్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. అప్పట్లో ఎలిమినేట్ అయిన సంజనను తిరిగి హౌస్‌లోకి పంపడానికి తనూజ తనకు ఎంతో ఇష్టమైన కాఫీని వదులుకోగా.. రీతూ చౌదరి హెయిర్ కట్ చేయించుకుంది. అయితే సంజన కోసం తన కెప్టెన్సీ వదులుకుని బిగ్‌బాస్ జర్నీని రిస్క్‌లో పెట్టుకున్నాడు. అలాగే ఏకంగా 9 వారాల పాటు నామినేషన్స్ తప్పించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బిగ్‌బాస్. ఇదే ఇమ్మాన్యుయేల్ కొంప ముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రేసులోకి ఆ ఇద్దరు
5, 6 వారాల వరకు ఇమ్మాన్యుయేల్ హవా స్పష్టంగా కనిపించింది. కానీ అప్పటి నుంచే తనూజ, కళ్యాణ్‌లు ఆటలో దూకుడు పెంచి ఓటింగ్‌ను మెరుగుపరచుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా మారారు. పలుమార్లు నామినేషన్స్‌లోకి వచ్చి బయట తమకున్న ఫాలోయింగ్ ఏంటో నిరూపించుకున్నారు. ఇమ్మాన్యుయేల్ టాస్క్‌లలో బాగా ఆడుతున్నా, జనాన్ని ఎంటర్‌టైన్ చేస్తున్నా 9 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకపోవడంతో అతనికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఓటింగ్‌లో తన స్థానం ఎక్కడ? అనేది ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
ఇమ్మాన్యుయేల్‌కు లాస్ట్ ఛాన్స్?
చివరికి చాలా గ్యాప్ తర్వాత 11వ వారంలో ఇమ్మాన్యుయేల్ నామినేట్ అయ్యాడు కానీ.. ఓటింగ్‌లో అతను వెనుకబడిపోయాడు. అనధికారికంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పోలింగ్‌లో పవన్ కళ్యాణ్, తనూజ, భరణి, సంజన గల్రానీలు ఇమ్మాన్యుయేల్ కంటే టాప్‌లో నిలిచారు. దీనిని బట్టి ఇమ్మాన్యుయేల్ బిగ్‌బాస్ టైటిల్‌ను గెలవడం అంత ఆషామాషీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరో 3 వారాల సమయం ఉండటంతో అతనికి తలుపులు తెరిచే ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇది చాలా కష్టమైన టాస్క్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకు కమెడియన్లు టైటిల్ కొట్టలేదు.. ముక్కు అవినాష్, రోహిణి వంటి వారు గట్టిగా ట్రై చేసినా ఫలితం దక్కలేదు. మరి ఇమ్మాన్యుయేల్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











