బిగ్‌బాస్ ట్రోఫీ కాదు... అంతకుమించిన అవార్డ్‌ అందుకున్న ఇమ్మానుయేల్‌‌‌..

BB Utsavam: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)ముగిసినా.. ఆ సీజన్ చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. విజేతగా కళ్యాణ్ నిలిచినా, ఈ సీజన్‌ను నిజంగా ఎంటర్‌టైన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే చాలామంది నేరుగా చెప్పే పేరు ఇమ్మానుయేల్‌‌‌ (Emmanuel). హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ చివరి వరకూ తన కామెడీ టైమింగ్‌, ఎమోషన్‌, ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఇమ్మానుయేల్.. చివరికి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే.. ఈ ఫలితంతో కేవలం ఇమ్మూ అభిమానులనే కాదు బిగ్ బాస్ లవర్స్ కూడా కాస్త నిరాశపరిచింది. బిగ్ బాస్ ట్రోఫి విన్నర్ కళ్యాణ్ పడాల అయినా.. సోషల్ మీడియాలో 'అసలైన విన్నర్ ఇమ్మానుయేల్' అంటూ ట్రెండ్స్ కూడా నడిచాయి. అయితే అప్పటివరకు మౌనంగా ఉన్న ఇమ్ము తాజాగా 'బీబీ ఉత్సవం'అనే స్పెషల్ షోలో తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టాడు.ఈ సమయంలో తన తల్లిదండ్రులు తన గెలుపు కోసం పడిన క్షషాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss Telugu 9 Jabardasth Emmanuel Wins All Rounder Award at BB Utsavam

photo courtesy: Star Maa

బీబీ ఉత్సవంలో భావోద్వేగ ఘట్టం
ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయగా, గెస్ట్‌గా హీరో నిఖిల్ సిద్దార్థ పాల్గొన్నారు. ఈ షోలో ఇమ్మానుయేల్ తల్లి స్టేజ్‌పైకి రావడంతో అతడు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అమ్మను చూసిన వెంటనే ఇమ్ము కంటతడి పెట్టుకున్నాడు. మైక్ తీసుకుని మాట్లాడుతూ 'ఎంటర్‌టైనర్‌ని ఎక్కడా విన్నర్‌లా చూడరని నాకు తెలుసు. అయినా నేను గేమ్ ఆడితే చూస్తారేమో అనుకున్నాను. నేను ఓడిపోయానని బాధలేదు.. కానీ మా అమ్మానాన్నలు క్యారేజ్ కట్టుకుని, బైక్‌పై దాదాపు 90 ఊర్లు తిరిగారు. మా కొడుక్కి ఓటు వేయండని పాంప్లెట్లు పంచారు. అదే ఇప్పటికీ నా మైండ్‌లో తిరుగుతోంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మాటలతో అక్కడున్న కంటెస్టెంట్లు మాత్రమే కాదు.. చూసిన ప్రేక్షకులూ కంటతడి పెట్టుకున్నారు.

'ఆల్ రౌండర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'అవార్డు
ఈ సందర్భంలో నిఖిల్, ఇమ్మానుయేల్‌కు ఆల్ రౌండర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (All Rounder of Bigg Boss Telugu Season 9)ట్రోఫీ అందజేశారు. 'నీ వెనుక నీ అమ్మానాన్నల ప్రేమ కనిపిస్తోంది... ఇమ్ము వాళ్ల మదర్‌ని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తోంది'అంటూ నిఖిల్ చేసిన కామెంట్స్ కూడా హార్ట్ టచ్ చేశాయి. టైటిల్ దక్కకపోయినా, ఈ అవార్డు ఇమ్మానుయేల్‌కు అభిమానుల ప్రేమకు ప్రతీకగా మారింది. సోషల్ మీడియాలో 'ట్రోఫీ కళ్యాణ్‌దే... బిగ్ బాస్ లవర్స్ హార్ట్ ను గెలిచిన విజేత మాత్రం ఇమ్ము' అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

నిజమైన ఎంటర్‌టైనర్ ఎవరో అందరికీ తెలుసు
షోలో పాల్గొన్న భరణి కూడా స్పందిస్తూ '22 మంది కప్ కోసం ఆడారు. కానీ, 360 డిగ్రీల కోణంలో గేమ్ ఆడింది మాత్రం ఇమ్మానుయేల్. నా దృష్టిలో అతడే నిజమైన విన్నర్'అంటూ ఓపెన్‌గా చెప్పారు.దీనికి షో మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ స్పెషల్ షోలో కొద్దిసేపు నాగార్జున కూడా సందడి చేశారు. కంటెస్టెంట్లపై చేసిన సరదా వ్యాఖ్యలు ప్రోమోకే హైలైట్‌గా నిలిచాయి. విన్నర్ కాలేకపోయినా... ఇమ్మానుయేల్ అసలైన హీరో!అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X