Bigg Boss Telugu 9: ఆ వివాదాస్పద నటికి బిగ్‌బాస్ డోర్స్ క్లోజ్? ఆ వైల్డ్ బిహేవియర్ వల్లే!
ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్‌బాస్ కార్యక్రమం హిందీతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో త్వరలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొలుత హిందీ బిగ్‌బాస్ టెలికాస్ట్ అయిన తర్వాత మిగిలిన భాషల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులోనూ బిగ్‌బాస్ లాంచింగ్ పనులు ఊపందుకున్నాయి. బిగ్‌బాస్‌కి సంబంధించిన ఏ వార్త అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కంటెస్టెంట్స్‌గా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, బుల్లితెర నటులు సాయికిరణ్, దేబ్‌జనీ మోదక్, కావ్యశ్రీ , జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పచ్చళ్ల వ్యాపారం చేస్తూ వివాదానికి కారణమైన అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేం రమ్య మోక్ష, సినీనటి కల్పికా గణేష్, హీరో సుమంత్ అశ్విన్, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ తేజస్విని గౌడ, పరమేశ్వర్ హివ్రాలే, ఫోక్ సింగర్స్ కమ్ డ్యాన్సర్స్ నాగదుర్గా దత్తా, లక్ష్మి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

సామాన్యులకు బిగ్‌బాస్‌లో ఛాన్స్
అలాగే ఈసారి పలువురు సామాన్యులకు కూడా హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. కామన్ మెన్ ప్రోగ్రామ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. లక్షల్లో దరఖాస్తులు రాగా.. పలు వడపోతల తర్వాత వీరిలో నుంచి 40 మందిని ఎంపిక చేశారు. పలు రౌండ్స్ నిర్వహించిన తర్వాత ఈ 40 మందిలో ముగ్గురికి హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం లభించనుంది. ఆ ముగ్గురు ఎవరా? అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. కామన్‌మెన్ సెలక్షన్ ప్రాసెస్‌ను కూడా స్ట్రీమింగ్ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
వివాదాల్లో కల్పిక గణేష్
అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా లిస్ట్‌లో వినిపిస్తున్న సినీ నటి కల్పిక గణేష్ అవకాశం కోల్పోయినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. గత కొద్దికాలంగా తన దురుసు ప్రవర్తనతో వివాదాల్లో నడుస్తున్నారు కల్పిక. తొలుత హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో గొడవకు దిగిన కల్పికపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఓ రిసార్ట్ సిబ్బందితో దురుసుగా వ్యవహరించి చిక్కుల్లో పడింది. ఈ క్రమంలో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కల్పిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
కల్పికపై తండ్రి ఫిర్యాదు
నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందని, రెండు సార్లు ఆత్మాహత్యాయత్నం కూడా చేసిందని కల్పిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించామని.. కొన్నాళ్లు అక్కడ చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసిందని తెలిపారు. దీని వల్లే ఆమె ఇంట్లో వాళ్లతోనూ గొడవ పడుతోందని, తరచూ వివాదాల్లో చిక్కుకుంటోందని ఆయన వెల్లడించారు. కల్పికను తక్షణం పట్టుకుని, రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించాలని ఆమె తండ్రి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు .. కల్పిక గణేష్‌కు కంటెస్టెంట్‌గా అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న కల్పిక.. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి తిరిగి బిజీ కావాలని అనుకున్నారు. కానీ పరిస్ధితులు ఆమెకు వ్యతిరేకంగా మారుతున్నాయి. మరి దీనిపై కల్పిక గణేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











