డిమోన్ పవన్ పై రీతూ చౌదరి ముద్దుల వర్షం... పబ్లిక్‌గా బాయ్‌ఫ్రెండ్‌తో..
Photo Courtesy: Star Maa
బిగ్‌బాస్ తెలుగు 9లో అందరినీ అలరించారు లవ్ బర్డ్స్ డిమోన్ పవన్- రీతూ చౌదరి. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడిన ఈ జంట.. చివరి వరకు నిలబడ్డారు. వీరి బాండింగ్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ గట్టిగా నిలబడ్డారు. బిగ్‌బాస్ నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయినా పవన్ కోసం బలంగా క్యాంపెయిన్ చేసింది. అతనికి ఓట్లు వేయాలని అభ్యర్ధించింది. బిగ్‌బాస్ తర్వాత ఈ జంటను తిరిగి మళ్లీ చూడలేమని అంతా అనుకున్నారు. దీనికి తెరదించుతూ వీరిద్దరూ ఓ షోలో మెరిశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9లో కామన్‌మెన్‌గా అడుగుపెట్టి.. టాస్క్‌లు, గేమ్స్ ఇలా ఏదైనా సరే రఫ్పాడించాడు డిమోన్ పవన్. టాప్ 5లో పడాల పవన్ కళ్యాణ్ - తనూజా పుట్టస్వామిలకు గట్టి పోటీ ఇచ్చాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తాడని అంతా అనుకున్న వేళ.. కుటుంబ ఆర్ధిక పరిస్ధితులు, తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని బిగ్‌బాస్ ఆఫర్‌కి ఓకే చెప్పి యోధుడిలా బయటకొచ్చాడు పవన్. తాను ఆ నిర్ణయం తీసుకోకపోయుంటే ఎలిమినేట్ అయి ఒట్టి చేతులతో ఇంటికొచ్చేవాడు. ఆ సమయంలో అతని అదృష్టం కూడా బాగా పనిచేసిందని బిగ్‌బాస్ విశ్లేషకులు పేర్కొన్నారు.

Photo Courtesy: Star Maa
బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక రీతూ చౌదరి తన షోలు, ఇతర కార్యక్రమాలతో తిరిగి బిజీ అవ్వగా.. డిమోన్ పవన్ సంగతి ఏంటీ? అనే చర్చ జరిగింది. తనకు కొన్ని ఛానెల్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయని.. వాటిపై త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు డిమోన్. తాజాగా స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు రీతూ చౌదరితో కలిసి వచ్చాడు డిమోన్ పవన్.
ఈ ఆదివారం స్టార్ మా పరివారంలో బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ సందడి చేశారు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ పడాల, భరణి శంకర్, దివ్య నిఖిత, దమ్ము శ్రీజ, డిమోన్ పవన్, రీతూ చౌదరిలు వచ్చారు. బిగ్‌బాస్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి.. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని రెండు గంటల్లో అయిపోగొడతామని శ్రీముఖి చెప్పింది. శ్రమ పడాలా, కష్ట పడాలా అప్పుడే అవుతారు కళ్యాణ్ పడాల అని అతనికి ఎలివేషన్ ఇచ్చారు కంటెస్టెంట్స్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని దమ్ము శ్రీజ పొగిడేసింది. బయట శ్రీజ చేసే హడావుడికి గెలిచింది ఇదా, అదా అని జనాలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారని ఇమ్మాన్యుయేల్ పంచ్‌లు విసిరాడు.
తర్వాత డిమోన్ పవన్‌ని పిలిచి... ఓ కామనర్‌గా అడుగుపెట్టావ్, టాప్ 3కి వెళ్లి సూట్‌కేస్‌తో బయటకు వచ్చావు.. ఎలా అనిపిస్తోందని శ్రీముఖి అడుగుతుంది. దానికి చాలా హ్యాపీ అనిపిస్తోందని ముక్కు అవినాష్ ఇమిటేట్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అయితే రీతూ చౌదరి అని చెప్పాడు డిమోన్ పవన్. దానికి రీతూ చౌదరి కూడా నా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ జెన్యూన్, నా బుజ్జి బంగారం డిమోన్ పవన్ అని అతనికి స్టేజ్ మీదే ముద్దు పెట్టేసింది రీతూ చౌదరి. దాంతో అందరూ వీరిద్దరినీ ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ గురించి రీతూ ఏం చెప్పింది? బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ అల్లరి చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











