Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ గేమ్ ఛేంజ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌పై షాకింగ్ ట్విస్ట్?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు ఇతర ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్‌ ఎంపిక పూర్తి చేసి.. ఆగస్ట్ రెండో వారం నాటికి తుది జాబితాను విడుదల చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సెట్ నిర్మాణం కూడా పూర్తి కాగా.. మరికొన్ని పనులు మిగిలి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 9 గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనా
ఎప్పటిలాగానే ఈసారి కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ఎవరు రాబోతున్నారన్న చర్చ నడుస్తోంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, బుల్లితెర నటులు సాయికిరణ్, దేబ్‌జనీ మోదక్‌, కావ్యశ్రీ , జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పచ్చళ్ల వ్యాపారం చేస్తూ వివాదానికి కారణమైన అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేం రమ్య మోక్ష, సినీనటి కల్పికా గణేష్, హీరో సుమంత్ అశ్విన్, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ తేజస్విని గౌడ, పరమేశ్వర్ హివ్రాలే, జానపద గీతాలతో దుమ్మురేపుతోన్న నాగదుర్గా దత్తా, లక్ష్మి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రోజుకొక కొత్త పేరు కంటెస్టెంట్స్ లిస్ట్‌లో వినిపిస్తుంది. కానీ ఫైనల్‌గా ఎవరు తేలారు అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది.

Bigg Boss Telugu 9 makers not Allowed too many wild card entries for season 9

సామాన్యులకు డోర్స్ ఓపెన్
ఇకపోతే.. ఈసారి సామాన్యులకు కూడా కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టగా.. దీనికి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. లక్షలాది మంది ఆశావహులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు. బిగ్‌బాస్‌లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారో దానిపై ఓ వీడియో తీసి పంపించారు. దానితో పాటు తమ బలాలు, బలహీనతలు, టాలెంట్ గురించి వివరిస్తూ నమోదు చేసుకున్నారు.

ముగ్గురికి హౌస్‌లో ఛాన్స్
ఇలాంటి వారిని వడపోసే ప్రక్రియను చేపట్టాడు బిగ్‌బాస్. మొత్తం దరఖాస్తుల్లో నుంచి తొలి విడతలో 200 మందిని సెలెక్ట్ చేశారు. వారిని అన్ని రకాలుగా పరీక్షించి 100 మందిని బయటకు తీశారు. తిరిగి వీరందరినీ వడపోసి 40 మందిని ఫైనల్‌గా సెలెక్ట్ చేశారు. వీరికి పలు రకాల పోటీలు పెట్టి.. వీరిలో నుంచి ముగ్గురికి సామాన్యుల కోటాలో కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కింగ్ నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 7 నుంచి బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కానుందని.. స్టార్ మా, జియో హాట్ స్టార్‌లో ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయని పేర్కొన్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై షాకింగ్ న్యూస్
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్‌ లాంచింగ్ ఎపిసోడ్‌లో 15 నుంచి 17 మందిని కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి పంపుతారు. వీరిలో ఒక్కొక్కరిని కానీ, ఇద్దరినీ కానీ ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అయితే ఈ మెగా రియాలిటీ షోని మరింత రక్తి కట్టించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తారు. దీనిలో భాగంగానే సీజన్ మధ్యలో పలువురిని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పిస్తారు. గత సీజన్‌లో దాదాపు 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. అలా వెళ్లిన రోహిణి, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణలు అద్భుతంగా ఆడి షోను నిలబెట్టారు. అయితే అంత మందిని ఒకేసారి పంపించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో బిగ్‌బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారట. తాజా సీజన్‌లో ఎక్కువగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండవని.. ఒకరు లేదా ఇద్దరు టాప్ సెలబ్రెటీలను లోపలికి పంపుతారని బుల్లితెర వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X