Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మెగా సపోర్ట్.. నాగబాబు సర్‌ప్రైజ్ ట్వీట్

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రెటీలు, సామాన్యులకు అవకాశం కల్పిస్తూ ఈసారి బిగ్‌బాస్ తీసుకున్న నిర్ణయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌ని బిగ్‌బాస్‌లోకి పంపారు. వీరిలో తెలుగు బుల్లితెర నటుడు భరణి శంకర్‌ కూడా ఈసారి హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్ లాంచింగ్ రోజే ఈయన ఎంట్రీ ప్రేక్షకులను టెన్షన్ పెట్టింది. అయితే బిగ్‌బాస్ ఊహించని నిర్ణయంతో పరిస్ధితులు మారిపోయాయి.

బాక్స్‌తో వచ్చిన భరణి
ఆవేశంతో రాజ్యమేలిన వ్యక్తి మీ మనసుల్ని ఏలేందుకు మీ ముందుకు వస్తున్నాడంటూ అదిరిపోయే ఏవీతో భరణి బిగ్‌బాస్ స్టేజ్ మీదకి అడుగుపెట్టాడు. అయితే అతని వెంట ఓ రెడ్ కలర్ బాక్స్ తీసుకొని వచ్చాడు. అయితే అదేంటీ? అని నాగార్జున పలుమార్లు అడిగాడు.. దీనిని హౌస్‌లోనే నేను చూపిస్తానని భరణి తేల్చి చెప్పడంతో.. నాగ్ ససేమిరా అన్నాడు. ఈ బాక్స్ నా శరీరంలో ఒక భాగమని, దానిని వదిలిపెట్టి నేనుండలేనని తెలిపాడు. అయితే బాక్స్ తీసుకుని మీరు లోపలికి వెళ్లాలా? వద్దా అనే నిర్ణయం బిగ్‌బాస్‌దేనని నాగార్జున చెబుతాడు.

Bigg Boss Telugu 9 Mega Brother Nagababu wishes to serial actor Bharani Shankar

భరణిని బయటకు పంపేసిన బిగ్‌బాస్
కంటెస్టెంట్స్ తమ వెంట ఏమీ తీసుకెళ్లడానికి వీల్లేదని బిగ్‌బాస్ వాయిస్ ఓవర్ వినిపించింది. బాక్స్ వదిలేస్తావా? హౌస్‌ను వదిలి ఇంటికి వెళ్లిపోతావా? అని నాగార్జున ప్రశ్నించగా భరణి ఇంటికి వెళ్లిపోవడానికే సిద్ధపడ్డాడు. అయితే ఆ కాసేపటికే మనసు మార్చుకున్న బిగ్‌బాస్.. భరణిని లోపలికి పంపేందుకు ఒప్పుకున్నాడు. ఇప్పటికైనా అదేంటో చెబుతావా అని నాగార్జున ప్రశ్నించడంతో.. బాక్స్ ఓపెన్ చేసిన భరణి ఓ గోల్డ్ చైన్‌ను బయటికి తీశాడు. దీని గురించి హౌస్‌లోనే నేను డిస్కస్ చేస్తానని చెప్పాడు భరణి. ఈ వయసులోనూ ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తున్నావని కాంప్లిమెంట్ ఇచ్చిన నాగార్జున.. భరణితో పుషప్ తీయాలని డిమోన్ పవన్‌ను పిలిచాడు. దాంతో ఇద్దరూ పోటాపోటీగా 60 పుషప్స్ తీసి మెప్పించారు. తర్వాత భరణిని నాగార్జున ఇంట్లోకి పంపారు.

సీరియల్స్‌తో పాపులర్
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ఆయన బీటెక్ గ్రాడ్యుయేట్. 2003లో తొలుత బుల్లితెరపై అడుగుపెట్టి.. తన ఇంటి పేరునే తన పేరుగా మార్చుకున్నాడు. దాదాపు 30కి పైగా సీరియల్స్‌లో భరణి శంకర్ నటించారు. సీతామహాలక్ష్మీ, తరంగాలు, కుంకుమ రేఖ, పున్నాగ వంటి సీరియల్స్‌ ఆయనకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి పేరు తీసుకొచ్చాయి. పలు సీరియల్స్‌లో రొమాంటిక్, కామెడీ, ప్రతినాయకుడి పాత్రలు చేసి మెప్పించారు భరణి శంకర్. ఈటీవీ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన.. జెమిని, స్టార్ మా తదితర ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్‌లో పనిచేశారు.

సినిమాల్లోనూ అవకాశాలు
బుల్లితెరపై తన ప్రతిభను నిరూపించుకున్న భరణి శంకర్‌కు సినిమాల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. పరమ వీర చక్ర, ఆవిరి, పాండవులు పాండవులు తుమ్మెద, క్రేజీ అంకుల్స్స, ధీర, గీత సాక్షిగా, సీడీ క్రిమినల్ ఆర్ డెవిల్‌లో నటించారు. ఈ దశలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలలో కీలకపాత్ర పోషించాడు భరణి. ఇతను హౌస్‌లో అడుగుపెట్టాడో లేదో వెంటనే మెగా బ్రదర్ నాగబాబు.. భరణికి మద్ధతు తెలుపుతూ ట్వీట్ చేయడం గమనార్హం. నాకు అత్యంత సన్నిహితుడైన భరణి.. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో అడుగుపెడుతున్నందున ఆయనకు ఆల్ ది బెస్ట్. ఈ జర్నీలో ఆయనకు విజయాన్ని, గుర్తింపు రావాలని కోరుకుంటున్నానని నాగబాబు ట్వీట్ చేశారు.

మెగా సపోర్ట్‌తో బిగ్‌బాస్ విజేతలుగా
దీంతో భరణికి ఓటింగ్ విషయంలో ఢోకా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ ప్రభావం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాగబాబు ట్వీట్‌తో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు, జనసేన కేడర్ భరణికి ఓట్లు గుద్దేస్తారని అంటున్నారు. గతంలో మెగా ఫ్యామిలీ మద్ధతుగా నిలిచిన వారు నామినేషన్స్‌ గండాలు గట్టెక్కి, బిగ్‌బాస్ విజేతలుగా నిలిచిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు భరణికి కూడా మెగా ఫ్యామిలీ అండదండలు ఉండటంతో ఆయన కూడా బిగ్‌బాస్ విజేతగా నిలుస్తాడా? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X