Bigg Boss Telugu 9: పవన్ కళ్యాణ్‌‌ ఇంకా సర్వీస్‌లోనే.. మా టీమ్‌లోనే డ్యూటీ... జవాన్ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో కామన్‌మెన్ కోటాలో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్. ఎవ్వరూ ఊహించని విధంగా సెలబ్రిటీలను దాటుకుని ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. టాస్క్‌లు, గేమ్స్‌, డిస్కషన్స్ ఇలా అన్నింటిలో సత్తా చాటుతూ బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో టికెట్ టూ ఫినాలే గెలిచి తొలి ఫైనలిస్ట్‌గా ఫైనల్‌లో అడుగుపెట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇదే జోరులో ఆడితే.. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా నిలవడం కళ్యాణ్‌కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్‌ సైన్యంలో పనిచేయడం లేదంటూ ఇటీవల వార్తలు రావడం బిగ్‌బాస్ ఆడియన్స్‌కు షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో సోల్జర్ కళ్యాణ్ స్నేహితుడు, మరో ఆర్మీ జవాన్ ఈ ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కామన్‌మెన్ కేటగిరీలో బిగ్‌బాస్‌లోకి
వృత్తిరీత్యా సైనికుడు అయిన సోల్జర్ కళ్యాణ్.. బిగ్‌బాస్‌పై ఇష్టంతో ఆ షోలో ఎలాగైనా పాల్గొనాలని ఆశించాడు. ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం కల్పించడంతో కామన్‌మెన్ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసుకుని షార్ట్ లిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో 40 మందితో పోటీపడి 13 మంది ఫైనలిస్టులలో ఒకడిగా నిలిచాడు. బిగ్‌బాస్ లాంచింగ్ రోజున హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. తనూజ, రీతూ చౌదరిలతో క్లోజ్‌గా ఉండటంతో అమ్మాయిల చుట్టూనే తిరుగుతాడని, ఆటపై ధ్యాస పెట్టడం లేదంటూ కళ్యాణ్‌పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

Bigg Boss Telugu 9 Pawan Kalyan Padala Controversy Here is Army Colleague Gives Clarification

నాగార్జున క్లాస్‌తో సోల్జర్‌లో మార్పు
ఎప్పుడైతే నాగార్జున క్లాస్ తీసుకున్నాడో నాటి నుంచి కళ్యాణ్‌ ఆటలో మార్పులు చోటు చేసుకున్నాయి. గేమ్స్, టాస్క్‌లలో దూకుడు కనిపించింది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కావడంతో ఫిజికల్ టాస్క్‌లలో అతని ముందు ఎవ్వరూ నిలబడలేకపోయేవారు. రెండు సార్లు కెప్టెన్ కావడంతో పాటు నామినేషన్స్‌లోనూ సెలబ్రెటీలను దాటి ఓట్లు సంపాదించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచాడు. దీంతో బిగ్‌బాస్ అంచనాలు తారుమారయ్యాయి. టాప్‌ 5లో ఖచ్చితంగా ఉంటాడు అనే స్థాయి నుంచి టైటిల్ విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడు కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ఆర్మీలో లేడంటూ
అయితే కళ్యాణ్ గురించి ఓ న్యూస్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్‌జే సుందర్ అనే ఆర్మీ జవాన్ అతనిపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పడాల అసలు ఇండియన్ ఆర్మీ కాదని.. సీఆర్‌పీఎఫ్‌లో కొంతకాలం పనిచేసి బయటకు వచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే భారత సైన్యంలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువగా బయటే ఉండటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నాడు. అలాగే ఎవరికి పడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ ఆర్మీ స్టైల్‌లో సెల్యూట్ చేయకూడదని సుందర్ మండిపడ్డాడు. అయితే దీనిపై బిగ్‌బాస్ అభిమానులు, ప్రేక్షకులు పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచారు. తాజాగా ఈ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ టీమ్‌‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ మణి ఈ ఇష్యూపై స్పందించారు.

ఆర్మీ పర్మిషన్‌తోనే బిగ్‌బాస్‌లోకి
జైహింద్ అందరికీ... ప్రజంట్ హాట్ టాపిక్‌గా మారిన పవన్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడాలని వచ్చాను. కళ్యాణ్ పడాలను రీమూవ్ చేసేయలేదు.. కళ్యాణ్ పడాలను తీసేయలేదు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు.. చాలా పెద్ద పెద్ద టీవీ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అవేవో ఫేక్ ఆరోపణలు స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఆపాలని మీ ముందుకు వచ్చాను. కళ్యాణ్ పడాల పర్మిషన్ తీసుకుని బిగ్‌బాస్‌లోకి ఎంటరయ్యాడు. పర్మిషన్ అడిగే వచ్చాడు. లెటర్ రాసి పెట్టేసే వచ్చాడు. ఒకవేళ లీవ్ గురించి చెప్పాలనుకుంటే.. లీవులు అన్నీ అయిపోయాయి. భార్య ప్రెగ్నెంట్ అయితే పంపిస్తారు. మన అమ్మానాన్నలకు బాగోకపోయినా పంపిస్తారు. ఎడ్యుకేషన్ పర్సస్ మీద ఎన్‌వోసీ ఉంటే ఎగ్జామ్‌కి వెళ్లాలనుకున్నా పంపిస్తారు. ఇలా లీవుల ఎక్స్‌టెన్షన్ .. లీవులు ఇచ్చే పద్ధతులు ఉంటాయి. అవేవీ లేకుండా కళ్యాణ్ రాలేదు అని మణి తెలిపారు.

తీసేయడం అంత ఈజీ కాదు
కళ్యాణ్ మాతో పాటే డ్యూటీ చేస్తున్నాడు.. తనని రిమూవ్ చేసేయలేదు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. తను ఇప్పటికీ ఫోర్స్‌లోనే ఉన్నాడు. తనను రిమూవ్ చేయాలంటే తన సిగ్నేచర్ ఉండాలి, ఒక పదేళ్ల లోగా రిమూవ్ చేసేయాలంటే.. ఒక సోల్జర్ నేను వెళ్లిపోవాలని అనుకుంటే తన ట్రైనింగ్ మీద ఖర్చుపెట్టిన మొత్తం కట్టేసి వెళ్లాలి. అంత ఈజీగా పంపించేయడం కుదరదు. దీనికి చాలా రూల్స్ ఉంటాయి. పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సోల్జర్ నుంచి రిలీవ్ అవ్వాలంటే చాలా సంతకాలు చేయాలి. అన్నింటికి సెటిల్‌మెంట్ చేసే వెళ్లాలి. తనని పంపించలేదు.. ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పొద్దు అని మణి వెల్లడించారు.

సింపతీ కార్డ్ వాడలేదు
ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్‌ని అనే చెప్పుకుంటాడు. తాపీ పని చేసే వ్యక్తి.. తాపీ పని చేస్తున్నాడని చెబుతాడు. ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ వర్కే చేస్తున్నాడని చెబుతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనొక సోల్జర్‌ని అని బిగ్‌‌బాస్ స్టార్టింగ్‌లో మాత్రమే చెప్పాడు. తర్వాత ఈ గేమ్ ప్రాసెస్‌లో అతను నేను సోల్జర్‌ని, నాకు ఓట్లేయండి అని ఎక్కడా అడుక్కోలేదు. బిగ్‌బాస్‌లో తను గేమ్ ఎలా ఆడుతున్నాడు? గేమ్ నచ్చిందా? లేదా? తన బిహేవియర్ ? అందరితో ఎలా ఉన్నాడు? ఆ గేమ్‌కి మీరు ఓట్లు వేస్తున్నారా? లేదా? అది ఇంపార్టెంట్. తను ఎప్పుడూ సింపతీ కార్డ్ వాడలేదు. నాగార్జున సార్‌కి సెల్యూట్ కొట్టాడు. పవన్ ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడిగితేనే పవన్ కళ్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు. అంతేకానీ ఇందులో ఏం లేదు. సో.. మీరంతా ఫేక్ న్యూస్ చేసి తనను బ్యాడ్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు. ఫేక్ న్యూస్ ప్రమోట్ చేయొద్దు జై భారత్ అని మణి ముగించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గతంలో పవన్‌పై వ్యాఖ్యలు చేసిన సుందర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X