Bigg Boss Telugu 9 Contestant List: బిగ్‌బాస్ తెలుగు 9 షోలోకి వెళ్లేది ఎవరు? సెలబ్రిటీల జాబితా మీ కోసం..

తెలుగు అత్యంత టెలివిజన్ రేటింగ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అయితే నిర్ణీత గడువు కంటే ముందుగానే ప్రారంభమవుతుందనే వార్తలను పక్కన పెట్టి.. ఈ క్రేజీ షో ప్లాన్ ప్రకారమే స్ట్రీమింగ్ అవుతుందని నిర్వాహకులు హింట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఈ షోలో పాల్గొనే వారి జాబితా ఒకటి సోషల్ మీడియా, యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతున్నది. ఈ షో స్టార్ట్ ఎప్పుడు? ప్రాబబుల్ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఇంకా ఈ షో విశేషాల వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభానికి అన్నపూర్ణ స్టూడియోలోని సెట్ సిద్దమవుతున్నాయి. యుద్ద ప్రాతిపాదికన ఈ సెట్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ సెట్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు చూడని విధంగా, కనీవినీ ఎరుగని విధంగా ఈ సెట్‌కు రూపకల్పన జరుగుతుంది. కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఈ సెట్‌ను రూపొందిస్తున్నారు.

Bigg Boss Telugu 9 Nagarjuna Akkineni Ritu Chowdary

ఇక ఈ షోలో కామన్ మ్యాన్ కేటగిరీ కోసం ప్రకటన చేశారు. ఈ మేరకు నాగార్జున అక్కినేనితో ప్రొమోను కూడా రిలీజ్ చేశారు. ఈ కేటగిరిలో దాదాపు 2 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో 9 మందిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి 9 మంది సెలబ్రిటీలను, 9 మందిని కామన్ మ్యాన్ ఎంపిక చేస్తారు. ఈ సారి మొత్తం ఇంటిలో 18 మంది ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు అనే విషయం వైరల్ అవుతున్నది.

బిగ్‌బాస్ తెలుగు 9 షో కోసం ఇప్పటికే సెలబ్రిటీల ఎంపిక పూర్తయింది. దాదాపు టెలివిజన్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఎంపిక చేశారు. వారికి కోవిడ్, ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. వారిని ఇంట్లోకి పంపే ముందు మూడు, నాలుగు రోజులపాటు వారిని ఓ హోటల్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితి గురించి జాగ్రత్తలు తీసుకొంటారని తెలిసింది.

బిగ్‌బాస్ తెలుగు 9 షోలో పాల్గొనడానికి అవకాశం ఉన్న సెలబ్రిటీల జాబితాలో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక రంగనాథ్, యాంకర్ నిఖిలూ, టీవీ నటి, జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య వుల్లింగల, యాంకర్ రీతూ చౌదరీ, యాక్టర్ ప్రదీప్
నటి కల్పిక గణేష్, కమెడియన్ హరి, ఇన్ఫ్లూయెన్సర్ బంచిక్ బబ్లూ, బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ గర్ల్‌ఫ్రెండ్ టీవీ యాక్టర్ కావ్యశ్రీ, ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్ శివ కుమార్, టెలివిజన్ యాక్టర్ తేజస్విని గౌడ, సింగర్ సాకేత్, జబర్దస్త్ రాకేష్
టీవీ నటి దేబ్ జానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, యాదమ రాజు, ఆలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తదితరులు ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 9 షోను సెప్టెంబర్ తొలివారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ షోను సెప్టెంబర్ 7వ తేదీన స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ డేట్‌కు ప్రారంభం కాకపోతే సెప్టెంబర్ 14 తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ షో గురించిన లేటేస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X