Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. హోస్ట్‌గా ఎవరంటే? ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. షోకు సంబంధించి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గాసిప్స్‌కు చెక్ పెట్టేలా బిగ్‌బాస్ నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని రోజులు సాగుతుంది? హోస్ట్ ఎవరు? అనే గాసిప్స్ కొద్దిరోజులుగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి సమాధానం ఇచ్చేలా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

కంటెస్టెంట్స్ ఎంపికలో బిగ్‌బాస్ టీమ్
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 9వ సీజన్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతేడాది కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ విజేతగా నిలవగా.. గౌతమ్ కృష్ణ రన్నరప్‌గా నిలిచారు. 8వ సీజన్ ముగిసిన వెంటనే కొత్త సీజన్ గురించి చర్చ మొదలైంది. నాటి నుంచి కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ స్టార్లు కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను బిగ్‌బాస్ టీమ్ ఇప్పటికే మొదలుపెట్టి పలువురితో టచ్‌లోకి వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి.

Bigg Boss Telugu 9 Promo Akkineni Nagarjuna confirmed as host for New season

కంటెస్టెంట్ వీళ్లేనా?
సీజన్ మొదలవడానికి ముందే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు తెరమీదకి వచ్చేవి. ఈసారి కూడా కంటెస్టెంట్స్‌గా తేజస్విని గౌడ, కల్పికా గణేష్, కావ్యశ్రీ, నవ్యస్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సాయికిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, బమ్ చిక్ బబ్లూ, ఇమ్మాన్యుయేల్, దేబ్‌జనీ మోదక్, రీతూ చౌదరి, అలేఖ్య పికెల్స్ రమ్య మోక్ష తదితరుల పేర్లు తెర మీదకి వచ్చాయి. వీరు కాకుండా సోషల్ మీడియాలో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తులు, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందినవారిని మిక్స్ చేసి వినోదాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

నాగార్జునే హోస్ట్
అంతా బాగానే ఉంది కానీ.. ఈసారి బిగ్‌బాస్ 9 తెలుగు హోస్ట్ ఎవరు? నాగార్జునే హోస్ట్‌గా కొనసాగుతారా? కొత్తగా ఎవరైనా ఈ బాధ్యతలు స్వీకరిస్తారా? అంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, నాని వంటి వారు హోస్ట్‌ బాధ్యతలు అందుకుంటారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లు అన్నింటికీ తెరదించేలా స్టార్ మా బిగ్‌బాస్ తెలుగు 9 ప్రోమోను రిలీజ్ చేసింది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున భారీ డైలాగ్‌తో ప్రోమోను కట్ చేశారు.

ఈసారి రణరంగమే అన్న నాగార్జున
ఈ ప్రోమోతో బిగ్‌బాస్ నిర్వాహకులు చాలా అంశాలకు క్లారిటీ ఇచ్చారు. హోస్ట్‌గా ఎప్పటిలాగే నాగార్జున కొనసాగుతారని కుండబద్ధలు కొట్టేశారు. ఉల్టా పల్టా అంటూ గత సీజన్‌ను ఊదరగొట్టేసినా జనానికి అంతగా ఎక్కలేదు. అయితే 9వ సీజన్‌ను మరింత వాడివేడిగా, ఉత్కంఠభరితంగా మార్చేసినట్లుగా ప్రోమోలో హింట్ ఇచ్చారు. ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని.. వ్యూహాలు, మైండ్ గేమ్‌లా కుండా యుద్ధ రంగాన్ని తలపించేలా హౌస్ ఉంటుందని నాగార్జునతో చెప్పించారు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ 9 తెలుగు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ప్రతి ఏడాది జూలై, ఆగస్ట్ నెలలలో బిగ్‌బాస్ హడావుడి మొదలయ్యేది. కానీ ఈసారి జూన్‌లోనే ప్రోమో రిలీజ్ చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 9 ముందుగానే మొదలవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X