Bigg Boss: బిగ్‌బాస్‌లోకి కామన్‌మెన్.. భారీగా పోటెత్తిన దరఖాస్తులు.. ఎంతమందికి ఛాన్స్ అంటే?

8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు త్వరలో 9వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా అతి త్వరలో సీజన్ 9 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. హోస్ట్‌గా పలువురు హీరోల పేర్లు వినిపించగా.. తానే మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఈసారి బిగ్‌బాస్ రణరంగంలా ఉంటుందని .. గెలవాలంటే యుద్దం చేయాల్సిందేనని ప్రోమోలో హింట్ ఇచ్చారు.

బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేక్షాళన

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌కు రేటింగ్ పరంగా మంచి మార్కులు పడలేదు. ఈ నేపథ్యంలో షోను పూర్తిగా మార్చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక, నామినేషన్స్ విధానం, ఎలిమినేషన్, ఓటింగ్ ఇలా అన్నింటిలోనూ ప్రక్షాళన మొదలు పెట్టినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. జూలై చివరినాటికి కంటెస్టెంట్స్ ఎంపికను పూర్తి చేసి తుదిజాబితాను సిద్ధం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి సీజన్‌లోనూ సెప్టెంబర్ తొలి వారంలో బిగ్‌బాస్ షో గ్రాండ్‌గా లాంచ్ అయ్యేది. అయితే ఈసారి కాస్త ముందుగానే సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 9 Record applications came for Commonmen entry into BB House

కంటెస్టెంట్స్ వీరేనా?
కంటెస్టెంట్స్‌గానూ పలువురి పేర్లు తెరమీదకి వస్తున్నాయి. బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలతో పాటు సింగర్స్, కొరియోగ్రాఫర్లు, సోషల్ మీడియా ఇన్ఫూయెన్సర్లు తదితర కేటగిరీల నుంచి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్స్‌గా వెళ్లేది వీళ్లేనంటూ పలువురి పేర్లు తెరమీదకి వస్తున్నాయి. తేజస్విని గౌడ, కల్పికా గణేష్, కావ్యశ్రీ, నవ్యస్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సాయికిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, బమ్ చిక్ బబ్లూ, ఇమ్మాన్యుయేల్, దేబ్‌జనీ మోదక్, రీతూ చౌదరి, అలేఖ్య పికెల్స్ రమ్య మోక్షలు హౌస్‌లో అడుగుపెడతారని అంటున్నారు.

కంటెస్టెంట్స్‌గా కామన్‌మెన్
ఈసారి బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఓ బంపరాఫర్ ఇచ్చారు. హౌస్‌లోకి కామన్‌‌మెన్స్‌ను కంటెస్టెంట్స్‌గా తీసుకునేందుకు ఆడిషన్స్ మొదలు పెట్టారు. ఈ మేరకు ఓ ప్రోమో ద్వారా నాగార్జున ప్రకటించారు. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి సెలబ్రెటీలకే కాదు. మీకూ అవకాశం ఇస్తున్నామని చెప్పారు. బిగ్‌బాస్ 9లో పార్టిసిపేట్ చేయాలంటే www.bb9.jiostar.com వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ చెబుతూ వీడియో అప్లోడ్ చేయొచ్చని చెప్పింది.

ఎంపిక ఇలా
ఈ పిలుపుకు సామాన్యుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్కసారైనా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలని ఎంతో మంది ప్రేక్షకులు కలగంటారు. అలాంటిది ఏకంగా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టే ఛాన్స్ వస్తే వదులుకుంటారా? అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కామన్‌మెన్ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్స్‌లో నుంచి దాదాపు 200 మందిని వారి వీడియోలు, వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వారిలో 100 మందికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి, వారిలో 40 మందిని ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్స్‌ నిర్వహిస్తారు. ఈ 40 మందికి నేరుగా ఇంటర్వ్యూ చేసి వారిలో 15 మందిని సెలెక్ట్ చేసి పబ్లిక్ ఓటింగ్ ద్వారా ముగ్గురు కామన్‌మెన్‌లకు కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. అప్లికేషన్స్‌కు ఇంకా సమయం ఉండటంతో ఎంతమంది సామాన్యులు దరఖాస్తు చేసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X