Bigg Boss Telugu 9: డిమోన్ పవన్‌కు రీతూ చౌదరి బంపరాఫర్.. బిగ్‌బాస్ టైటిల్‌ గెలిస్తే..

బిగ్‌బాస్ తెలుగు 9లో లవ్ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రీతూ చౌదరి - డిమోన్ పవన్. రీతూ అప్పటికే సెలబ్రిటీ కాగా.. పవన్ ఒక కామన్‌మెన్. వీరిద్దరికీ బిగ్‌బాస్ హౌస్‌లో పరిచయం ఏర్పడింది. అతని నిజాయితీ, నడవడిక తదితర అంశాలతో డిమోన్‌కు బాగా దగ్గరైంది రీతూ. వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం పట్ల భారీగా ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుతం రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వగా.. పవన్ మాత్రం టాప్ 5లో చోటు దక్కించుకుని టైటిల్‌ రేసులో పోరాడుతున్నాడు. దాంతో పవన్ కోసం రీతూ రంగంలోకి దిగింది.

రీతూతో పవన్ లవ్ ట్రాక్
సామాన్యుడి కోటాలో బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు డిమోన్ పవన్. టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ వచ్చాడు. ఈ దశలో రీతూ చౌదరితో లవ్ ట్రాక్ కారణంగా కొంతకాలం అతనికి ట్రోలింగ్ ఎదురుకావడంతో పాటు నాగార్జున క్లాస్ పీకడంతో పవన్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఫిజికల్ టాస్క్‌లలో తన బలాన్ని చాటుకుని పోటీలో నిలబడ్డారు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటూనే వచ్చినా పవన్ కళ్యాణ్ - పవన్‌ల వీడియోను నాగార్జున లీక్ చేయడం కలకలం రేపింది.

Bigg Boss Telugu 9 Rihtu Chowdary Campaigns for Demon Pavan Ahead of Grand Finale

ఫన్‌తో ఆకట్టుకుంటోన్న డిమోన్ పవన్
అయితే రీతూ ఎలిమినేట్ అయ్యాక తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాడు డిమోన్ పవన్. రీతూ వెంట పడినా, పడకపోయినా తొలి నుంచి తనలోని ఈ యాంగిల్ చూపించి ఉంటే ఖచ్చితంగా రేసులో ముందుండేవాడని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. అటు పవన్ తనకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని, హౌస్‌లో నన్ను చాలా బాగా చూసుకున్నాడని ఎలిమినేట్ అయ్యాక ప్రెస్‌మీట్‌లో చెప్పారు రీతూ చౌదరి.

ఓటింగ్‌లో పవన్ కళ్యాణ్ హవా
మరోవైపు... దాదాపు 100 రోజులుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్‌బాస్ తెలుగు 9కి మరో నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. హోరాహోరీగా సాగిన ఈ సీజన్‌‌లో అందరూ ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచిన పడాల పవన్ కళ్యాణ్, తనూజ పుట్టస్వామి, సంజనా గల్రానీ జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌లు ఉన్నారు. గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగా .. సోల్జర్ కళ్యాణ్, తనూజల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా టఫ్ ఫైట్ జరుగుతోంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే విజేత ఎవరు అన్నది తెలుసుకోవడానికి ఆదివారం రాత్రి జరగనున్న బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే కోసం తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

పవన్ కోసం రంగంలోకి రీతూ చౌదరి
పవన్‌ కళ్యాణ్‌కు ఆడియన్స్ మద్ధతు బలంగా ఉండగా.. మిగిలిన ముగ్గురు తనూజ, సంజన, ఇమ్మాన్యుయేల్‌లు సెలబ్రిటీలు కావడంతో వారి పీఆర్ టీమ్స్, వారికున్న ఫ్యాన్ బేస్‌తో ఓట్లు సంపాదిస్తున్నారు. అయితే పవన్‌కు తన మిత్రులు, కొందరు మాజీ కంటెస్టెంట్స్ అండగా నిలుస్తూ ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. తాజాగా తన ఫ్రెండ్ కోసం రీతూ చౌదరి కూడా రంగంలోకి వాడుతోంది. సోషల్ మీడియాలో తనకున్న భారీ ఫాలోయింగ్ దృష్ట్యా.. డిమోన్ పవన్‌కు ఓటు వేయాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రీతూ చౌదరి ఓ వీడియో విడుదల చేశారు.

పవన్‌ని గెలిపించండి
డిమోన్ పవన్ .. జెన్యూన్ , ఇన్నోసెంట్, నైస్ పర్సన్. గేమ్స్‌లో ముందుంటాడు, ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది రీతూ చౌదరి. నేను, పవన్ కలిసే ఉంటాం.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక అతనితో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ముందు డిమోన్ పవన్‌కు ఓట్లు వేసి అతనిని బిగ్‌బాస్‌గా గెలిపించాలని రీతూ చౌదరి అభ్యర్ధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్‌తో భవిష్యత్తులోనూ తన ప్రయాణం సాగుతుందని రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది. దాంతో బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక పవన్ డిమోన్ బాగా బిజీ అవుతాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X