ఆయన పిలిస్తే ఇంట్లో నుంచి వచ్చేస్తా.... బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 9 మరికొద్దిగంటల్లో 10 వారాలు పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగుపెట్టనుంది. మరో 4 వారాల్లో బిగ్‌బాస్ 9వ సీజన్ ముగుస్తుండగా.. టైటిల్ విన్నర్ ఎవరు అవుతారోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నిఖిల్ నాయర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు. కొద్దిగంటల్లో అది కూడా తేలిపోనుంది. మిగిలిన వారితో ఇకపై ఆట రంజుగా సాగే అవకాశం ఉంది. తాజాగా తన క్రష్ గురించి బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే....
వైల్డ్‌కార్డ్ ఎంట్రీదారులంతా ఔట్
పదో వారంలో ఇమ్మాన్యుయేల్ తప్పించి అందరినీ నేరుగా నామినేట్ చేశాడు బిగ్‌బాస్. అయితే కెప్టెన్ కావడం తనూజ పుట్టస్వామి సేవ్ అయిపోయింది. దాంతో శనివారం నాటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేషన్‌కు శ్రీకారం చుట్టాడు నాగార్జున. తొలుత నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. అయితే ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఆదివారం నాడు గౌరవ్ గుప్తా ఎలిమినేట్ కాబోతున్నారట. దాంతో వారిద్దరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్, గౌరవ్ గుప్తాలు ఎలిమినేషన్‌తో .. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఆరుగురు కంటెస్టెంట్స్‌ని బిగ్‌బాస్ టీమ్ సక్సెస్‌ఫుల్‌గా ఇంటికి పంపించినట్లయ్యింది. తొలుత ఆయేషా జీనత్ అనారోగ్యం కారణంగా హౌస్‌ను వీడగా.. ఆ తర్వాత రమ్య మోక్ష, దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయిలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

నాగ్‌కి తెలియకుండా ఆ పనిచేసిన చైతూ
ఇక శనివారం అంటేనే బిగ్‌బాస్‌లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో అందరిని ఆటలు ఆడిస్తారు. నామినేషన్స్ డేతో పాటు వీకెండ్ ఎపిసోడ్‌ని ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వరు. వీకెండ్ పూట ఖచ్చితంగా ఎవరో ఒక సెలబ్రిటీ తమ సినిమాలను ప్రమోషన్స్ చేసుకోవడం కోసం బిగ్‌బాస్ స్టేజ్ మీదకి వస్తారు. తాజాగా ఈ శనివారం అక్కినేని నాగచైతన్య హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే చైతూ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే బాగా ఇష్టమని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌కి నేనే ఓనర్‌ని అని చైతూ తెలిపాడు. నాకు తెలియకుండా ఎప్పుడు చేశావని నాగార్జున అడగ్గా.. చేశానులే అని ఆన్సర్ ఇచ్చాడు చైతూ.
కార్తీక్ అనే పేరు కోసం వెతికా
ఇక స్టేజ్ మీద నాగచైతన్యని చూడగానే కంటెస్టెంట్స్ అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. మీరంటే పిచ్చి అని రీతూ అనగా... మరి నేనంటే ఇష్టమని అన్నావుగా అని నాగార్జున సెటైర్ వేస్తారు. ఎప్పటికీ మీరు మీరే సార్ అని రీతూ తెలిపింది. చైతూలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పమని నాగ్ అడగ్గా... చైతూ సార్ కాళ్లు ఉంటాయి సార్, ఎంత తెల్లగా ఉంటాయో, శిల్పాన్ని చెక్కినట్లుగా ఉంటారు అంటుంది. ఆ శిల్పాన్ని చెక్కింది నేనే అని నాగ్ అనడంతో అంతా నవ్వేస్తారు. కార్తీక్ అనే పేరుంది కదా సార్.. నా బాయ్ ఫ్రెండ్ పేరు కార్తీక్ ఉండాలని కొన్ని రోజులు వెతికాను అని రీతూ చెప్పింది. అయితే మీ పేరు జెస్సీ కాదు కదా అని చైతూ సెటైర్ వేయడంతో అంతా నవ్వేస్తారు.
ఇంట్లో నుంచి వచ్చేస్తా
ఇక చైతూకి బైక్స్ చాలా ఇష్టం.. నువ్వు హౌస్‌లో నుంచి వచ్చేస్తే, నిన్ను బైక్ మీద తీసుకుని వెళ్తాడని నాగార్జున ఆఫర్ ఇస్తారు. దాంతో రీతూ క్షణం కూడా ఆలోచించకుండా ఐయామ్ కమింగ్ అని ఎలిమినేట్ అయిపోవడానికి ఓకే చెప్పేసింది. గెలిచినా కూడా తర్వాత నిన్ను నేను బైక్ మీద తీసుకెళ్తానని నాగచైతన్య అన్నాడు. మిమ్మల్ని జోష్ నుంచి గెలుచుకుందామని అనుకుంటున్నాని రీతూ చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియక చైతూ నవ్వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలోనూ నాగచైతన్యపై తనకున్న ఇష్టాన్ని పలుమార్లు బయటపెట్టింది రీతూ చౌదరి.


Click it and Unblock the Notifications











