డిమోన్‌ని నాకు దూరం చేయాలని.. బిగ్‌బాస్‌లో కుట్ర.. రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్

రీతూ చౌదరి... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత జబర్దస్త్‌తో బాగా పాపులర్ అయ్యింది. అనంతరం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తెలుగు లొగిళ్లకు బాగా చేరువ అయ్యింది రీతూ చౌదరి. ఫేమ్‌తో పాటు వివాదాలలోనూ ఆమె పేరు బలంగా వినిపించింది. వివాహం, విడాకులతో పాటు ఏపీలో ఓ భూ కుంభకోణం విషయంలోనూ రీతూ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. ఇలాంటి దశలో బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్‌బాస్ జర్నీలో ఆమెకు డిమోన్ పవన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సీజన్‌లో పవన్ - రీతూల లవ్ ట్రాక్ సక్సెస్ అయ్యింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి జర్నీ కొనసాగుతోంది. తాజాగా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్స్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రీతూ చౌదరి తన కెరీర్‌లో కీలక విషయాలు, డిమోన్ పవన్‌తో రిలేషన్, తనపై నెగిటివ్ ట్రోలింగ్‌పై స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే...

ఏం చేసినా డిమోన్ భరిస్తాడు
నేనేం చేసినా, వాగినా డిమోన్ పవన్ భరిస్తాడు, తిడతాడు. హౌస్‌లో కొట్టుకున్నాం, తిట్టుకున్నాం.. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం బిజీగా ఉన్నాం. మేమిద్దరం కనుక ఫ్రెండ్స్ కాకపోయుంటే హీరో, విలన్‌లా ఉండేవాళ్లం. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ అయింది కళ్యాణే. ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్.. కళ్లలో కళ్లు పెట్టుకునే టాస్క్‌‌ అక్కడ చేసేశాం. బయటకు వచ్చిన తర్వాత దీనిని ఇంత వైరల్‌గా చేశారా? మా ఇద్దరి గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా? అని అనుకున్నా. కళ్యాణ్ తొలి నుంచి నేను ఎలిమినేట్ అయ్యే వరకు ఒకేలా ఉన్నాడు. టాప్ 5 వరకు ఉంటానని అనుకున్నా.. ఫస్ట్ వీక్ నుంచి మనం మనలాగే ఉందాం, జనానికి నచ్చితే ఓకే, లేదంటే లేదు అనుకున్నా. గేమ్స్‌లో ముందు ఉండేదానిని.. ఓడిపోయినా, గెలిచినా ఎఫర్ట్స్ మాత్రం పెట్టేదానిని అని రీతూ చెప్పింది.

Bigg Boss Telugu 9 Rithu Chowdary Gets Emotional About Character Assassination and Demon Pavan s Support

కళ్యాణ్ గెలుస్తాడని అనుకోలేదు
మ్యాథ్స్ టాస్క్ బాగా ఎంజాయ్ చేశాం. డిమోన్ నన్ను నామినేట్ చేసేటప్పుడు పవన్ కూడా ఏడ్చాడు. ఒక వారం పాటు మా ఇద్దరికి గొడవలు జరిగాయి. కానీ ఆ తర్వాత పవన్‌ని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టా.. తొలి నుంచి ఆ అబ్బాయి సాఫ్ట్. డిమోన్ కాకుండా నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. డిమోన్ అక్కడ ఫ్రెండ్.. నాకు ఇమ్మూ ముందు నుంచే ఫ్రెండ్. హౌస్‌లో ఏదైనా జరిగితే ఇమ్మూని పిలిచి వాడిని హగ్ చేసుకుని ఏడ్చేసేదానిని. నేను విన్నర్ కాకపోతే.. తనూజ, ఇమ్మూ, డిమోన్ పవన్‌లలో ఒకరు గెలవాలని అనుకున్నా.. కానీ కళ్యాణ్ గెలిచాడు. ఇమ్మూ నామినేషన్‌లలోకి రాకపోవడం బాగా దెబ్బేసింది అని రీతూ ఆవేదన వ్యక్తం చేసింది.

నన్ను, డిమోన్‌ని విడదీయాలని
ఫైర్ స్ట్రోమ్ బ్యాచ్ బిగ్‌బాస్‌లోకి వచ్చి బయట జరుగుతున్న విషయాలు నాకు చెప్పారు. దాంతో నేను ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనుకున్నా. నేను, డిమోన్ మంచి ఫ్రెండ్స్. వాళ్లు వచ్చి డిమోన్‌ని రీతూతో మాట్లాడొద్దు, రీతూ బ్యాడ్ అని చెప్పేవాళ్లు. అంతలా నేనేం చేశాను. ఎందుకు బ్యాడ్? ఎలా బ్యాడ్‌గా కనిపిస్తున్నాను, బట్టల వల్ల నన్ను అలా అర్ధం చేసుకున్నారా? ఎందుకు మా ఇద్దరినీ బ్రేక్ చేద్దామని అనుకుంటున్నారో అర్ధం కాలేదు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆ వీక్ మాత్రం చాలా హాట్‌గా గడిచింది. హౌస్‌లో నాకుంది వాడొక్కడే బెస్ట్ ఫ్రెండ్.. అన్ని వీక్స్ వాడు నాతో ఉండి, నాతో మాట్లాడొద్దని వారంతా కలిసి చెప్పడం, వాడిని కావాలని నామినేట్ చేయడం, ఆ పిల్ల నిన్ను వాడుకుంటుంది అని చెప్పేవారు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా వాడు నా దగ్గరికి వచ్చి ఎందుకు నిన్ను అలా అంటున్నారు? నాతో చాలా మంచిగా ఉంది అని చెప్పేవాడు అని రీతూ గుర్తుచేసుకుంది.

మా అమ్మతో నా గురించి చెడుగా
నేను హౌస్‌లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, బయట కొన్ని ఇష్యూలతో అమ్మ బాగా ఇబ్బందిపడింది. ఇవేం నాకు తెలియదు.. హౌస్‌లో నేను హ్యాపీగా ఫన్ చేసుకుంటున్నా, నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నా. బయట నన్ను అలా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది తెలియదు. నేను బిగ్‌బాస్ నుంచి వచ్చేస్తే బాగుండు అని అమ్మ అనుకుంది. ఆర్టిస్ట్స్ కూడా నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. దాంతో మా మమ్మీ ఓట్లు వేయమని కాల్ చేసినప్పుడు చాలా మంది లిఫ్ట్ చేయలేదు, మీ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తోంది మేం ఓట్లు వేయమని నానామాటలు అన్నారట. అంత బ్యాడ్ చేస్తున్నప్పటికీ ప్రతివారం ఆడియన్స్ నన్ను సేవ్ చేస్తూనే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిమానానికి, వారి ప్రేమకు గర్వంగా ఉంది అని రీతూ చౌదరి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X