ఫ్రెండ్‌నని కూడా లేదు.. బిగ్‌బాస్‌లో వదిలేశాడు... ఇమ్మాన్యుయేల్‌పై రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్
Photo Courtesy: Star Maa
దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది బిగ్‌బాస్ తెలుగు 9. డిసెంబర్ 21న జరిగిన గ్రాండ్ ఫినాలేలో పడాల పవన్ కళ్యాణ్ బిగ్‌బాస్ విజేతగా నిలిచాడు. అతనికి టఫ్ ఫైట్ ఇచ్చిన బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచింది. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ బిగ్‌బాస్ గురించిన ఏ వార్త అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ అంతా కలిసి స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్‌పై రీతూ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు టాప్ 5లో చోటు దక్కించుకుని టైటిల్ విజేతగా నిలుస్తాడని అనిపించుకున్నాడు ఇమ్మాన్యుయేల్. అయితే అనూహ్య కారణాలతో థర్డ్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తన ఆటతీరు, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరిని అలరించారు ఇమ్మాన్యుయేల్. అతని ఎలిమినేషన్‌తో కమెడియన్లకు బిగ్‌బాస్ టైటిల్ ఇవ్వరా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సైతం నడిచింది.

Photo Courtesy: Star Maa
ఇక బిగ్‌బాస్ తెలుగు 9లో ఇమ్మాన్యుయేల్‌కు రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామిలతో ముందు నుంచి పరిచయం ఉంది. తనూజ కంటే రీతూ చౌదరితో ఫ్రెండ్‌షిప్ ఎక్కువ. వీరిద్దరూ జబర్దస్త్‌తో పాటు పలు ప్రోగ్రామ్స్‌లో కలిసి పనిచేయడంతో పాటు ఈవెంట్స్‌కు కూడా వెళ్లడంతో పర్సనల్‌గా బాండింగ్ కూడా ఉంది. అయితే బిగ్‌బాస్‌కి వచ్చేసరికి రీతూ చౌదరికి కానీ, తనూజకి కాకుండా సంజనకు ఇమ్మాన్యుల్ మద్ధతుగా నిలవడం అభిమానులకు షాకిచ్చింది. సంజన ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడల్లా ఇమ్మాన్యూయేల్ సాయం చేశాడు. ఆమె ఒకదశలో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయి.. తిరిగి రావడం కోసం తన కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. అలా చివరి వరకు అమ్మ అమ్మ అంటూ ఆమెతో పాటు ఉన్నాడు.. సంజన వెంటే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు హాజరైన రీతూ చౌదరి.. ఇమ్మూపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ ఈ వారం ప్రోగ్రామ్ సందడిగా మారింది. ఈ సందర్భంగా యాంకర్ శ్రీముఖి, అవినాష్‌లు కంటెస్టెంట్స్‌ని సరదాగా ఇంటర్వ్యూ చేశారు. బిగ్‌బాస్‌లో ఎవరినైనా ఒకరిని చూసి ఏం నటిస్తున్నావురా అనిపించిన కంటెస్టెంట్ ఉన్నారా? అని భరణిని శ్రీముఖి అడిగింది. దానికి భరణి సమాధానిస్తూ.. 100 పర్సెంట్ అక్కడ అంతా నటిస్తూనే ఉంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి కంటెస్టెంట్ ఎక్కడో దగ్గర నటించాల్సి వస్తుంది అని భరణి ఆన్సర్ ఇచ్చాడు. మరి అందులో మీరు కూడా ఉన్నారు.. మీరు కూడా నటించారా అని అవినాష్ ప్రశ్నించాడు. సుమన్ అన్న దగ్గర ఎక్కడ నేను నటించాల్సిన అవసరం రాలేదని భరణి ఆన్సర్ ఇచ్చాడు. నటించాల్సిన అవసరం ఎవరి దగ్గర వచ్చిందని శ్రీముఖి ప్రశ్నించగా.. అది ఎవరనేది చెప్పను అని భరణి తెలిపాడు. అంటే మీరు భయపడుతున్నారా? అని శ్రీముఖి అడగ్గా.. ఎవరికీ అని భరణి షాక్ అయ్యాడు.
రీతూ చౌదరి గారు... ఇమ్మాన్యుయేల్‌తో మంచి ఫ్రెండ్ మీరు, సడెన్‌గా ఇమ్మూని వదిలేసి వెళ్లిపోయారని అవినాష్ అడిగాడు. దానికి రీతూ బదులిస్తూ.. ఇమ్మాన్యుయేల్‌ని నేను వదిలేయలేదు, అతనే నన్ను వదిలేసి కళ్యాణ్ దగ్గరకి వెళ్లిపోయాడు అని చెప్పింది. ఆ మాటలతో ఇమ్మూ షాకయ్యాడు. అంటే మీరు కూడా డిమోన్ పవన్ దగ్గరికి వెళ్లలేదా? మీరు ఇమ్మాన్యుయేల్ కప్పు గెలవకూడదని అనుకున్నారా? అని అవినాష్ తిరిగి ప్రశ్నించాడు. నాకు హౌస్‌లో ఎవరైతే బ్యాక్‌బోన్‌లా ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే నాకు ఎమోషనల్‌గా ఉన్నారో వాళ్లు మాత్రమే గెలవాలని కోరుకున్నానని రీతూ కుండబద్ధలు కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రీతూ ఆరోపణలకు ఇమ్మాన్యుయేల్ ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











