Bigg Boss buzzz: పవన్‌తో లవ్‌ట్రాక్ కెమెరా కోసమేనా? మరీ కళ్యాణ్‌తో ? రీతూపై శివాజీ ఫైర్..

Bigg Boss buzzz: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ గేమ్ షోకు మరో రెండు వారాల్లో ఎండ్ కార్డు పడబోతుంది. ఈ నేపథ్యంలో 13వ వారం షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వారం ఎవరూ ఊహించిన విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. షాకింగ్ ఎలిమినేషన్ అయినా రీతూ వెంటనే శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. సాధారణంగానే శివాజీ సైటైరికల్ ప్రశ్నలు దాడి ఉంటుంది. ఇక రీతూ చౌదరితో ఇంటర్వ్వూ అంటే టాప్ లేచిపోవాల్సిందే. అనుకున్నట్టుగానే మంగపతి శివాజీ ప్రశ్నల దాడిని ఫైర్ బ్రాండ్ రీతూ తిప్పికొట్టింది. మీరు కూడా ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి రీతూ రాగానే హోస్ట్ శివాజీ తనదైన సైల్ట్ లో ఆహ్వానించారు. వచ్చి రాగానే.. 'ఒక్క నిజం చెప్తాను రీతూ.. నువ్వు మ్యాక్సిమమ్ ఎప్పుడైతే ఏడ్చావో.. ఆ టైమ్‌లో మాత్రం కన్నీళ్లు రాలేదమ్మాయ్..'అని శివాజీ అనగా.. వెంటనే.. 'ఇంకిపోయినయ్ ఏడ్చి..ఏడ్చి..'అని రీతూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో శివాజీ ' ఓరి బాబోయ్..'అంటూ శివాజీ వ్యంగంగా మాట్లాడుతాడు. ఇక ఆగకుండా శివాజీ తన ప్రశ్నల దండయాత్రం ప్రారంభించాడు.

Bigg Boss Telugu 9 Rithu Chowdary s Fiery Reply to Shivaji in Bigg Boss Buzz Interview Goes Viral

'రీతూ గేమ్ మీద కన్నా ఫోకస్ అంతా కూడా డీమాన్ మీద చేయడం వల్ల రీతూ ఎందుకో వెనకపడింది. ఒక్క నిమిషం ఆగి.. సారీ డీమాన్ వెంటపడింది. ఇదంతా ఎలా ఉందంటే అమ్మా.. నువ్వు స్ట్రాటజికల్‌గా ఏడిస్తే.. వాడొచ్చి ఓదారుస్తాడు.. వాడ్ని తిడతావ్.. వాడ్ని తిట్టినప్పుడు నువ్వెళ్లి ఒక మూలన కూర్చుంటావ్.. మళ్లీ పోయిన తర్వాత.. ఇలా ఇదంతా కెమెరా అటెన్షన్‌లా అనిపించడం లేదా? అని శివాజీ నిలదీస్తాడు.

ఆ ప్రశ్నకు రీతూ సమాధానమిస్తూ 'కనెక్ట్ అయ్యాడు జెన్యూన్‌గా.. వాడు గెలవాలి.. వాడు బాగా ఆడాలి అనుకున్నా.. అని రీతూ ఏదో చెప్పాలని ప్రశ్నిస్తుంది. కానీ, ఆమె ఫ్లో కు శివాజీ అడ్డుపడుతాడు. ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు? ఎందుకు కనెక్ట్ అయ్యాడు? ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు? అంటూ శివాజీ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.

దీనికి రీతూ ఆన్సర్ చెబుతూ కళ్యాణ్ పడాల ప్రస్తవన తీసుకవచ్చింది. 'నాకు కళ్యాణ్ కూడా క్లోజ్.. అని రీతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ, శివాజీ మరోసారి అడ్డుపడి..'అవును.. మొదట రెండు వారాలు కళ్యాణ్‌తోనే క్లోజ్ గా ఉన్నావ్.. ఆ తర్వాత డీమాన్‌కి షిప్ట్ అయ్యావని అంటున్నారు'అని శివాజీ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

దీంతో రీతూ మొఖం ఒక్కసారిగా మడిపోతుంది. 'ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి.. కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారంటే.. 'అని రీతూ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. 'కొంచెం కాదు.. అసలు ఒక రెండు మూడు వారాలైతే.. వీళ్లిద్దరినీ తీసి బయట పడేయ్యాలి'అనే కామెంట్స్‌ సోషల్ మీడియాలో చాలా వచ్చాయి' అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడతో ఆగకుండా.. సంజన విషయాన్ని ప్రస్తవిస్తూ.. 'నీ క్యారెక్టర్ మీద అంత పెద్ద ముద్ర వేసినప్పుడు నువ్వు అలానే ఎందుకు ఉన్నావ్.. అంటూ నిలదీశాడు. దీంతో రీతూ' నేను నాలా ఉండటానికే ప్రయత్నించు' అని తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది.

అలాగే.. సంజన కోసం హెయిర్ కట్ చేసిన విషయాన్ని కూడా శివాజీ ప్రస్తవించారు. 'మూడు వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా.. త్యాగం చేసేస్తావా? అని శివాజీ అడిగగా.. 'నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను చేస్తా..' అని రీతూ ధీటుగా సమాధానం ఇస్తుంది. దీంతో శివాజీకి కాస్త కాలింది'అది డీమాన్ కాదు. డీమాన్ బయటికిపోతున్నాడు అన్నప్పుడు నువ్వు త్యాగం చేస్తే.. నేను అర్థం చేసుకుంటాం.. కానీ, సంజన కోసం నువ్వు హెయిర్ కట్ చేసుకోవడం వెనుక సీక్రెట్ ఏంటీ? అని శివాజీ నిలదీస్తాడు.

ఇంక డీమాన్ లవ్ ట్రాక్ గురించి ప్రశ్నిస్తాడు. 'బయటికొచ్చాక డీమాన్‌తో అదే రిలేషన్ కంటిన్యూ చేస్తావా?అని శివాజీ అడుగుతాడు. మరీ రీతూ ఎలాంటి సమాధానం చెప్పిందో అనేది ఇంట్రెస్టింగ్ మారింది. ప్రస్తుతం రీతూ చౌదరి బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X