Bigg Boss Telugu 9: ఊహించని ట్విస్ట్.. చివరి క్షణంలో బిగ్‌బాస్ ఫైర్ బ్రాండ్ ఎలిమినేట్.. కారణం ఇదేనా?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రాండ్ ఫినాలే కు చేరువవుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. మరో రెండు వారాల్లో ఈ గేమ్ షో కు ఎండ్ కార్డు పడుతున్న నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.ఈ వారం ఆశ్చర్యానికి గురిచేసే ఎలిమినేషన్ జరిగినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు వచ్చిన ఎలిమినేషన్స్ అన్నీ ఊహించదగినవే అయినా.. ఈ 13 వారం ఎలిమినేషన్ మాత్రం పూర్తి భిన్నంగా జరగబోతుందట. ఈ వారం ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారంట. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? ఆ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడానికి కారణమేంటీ?
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో టెన్షన్ హై లెవల్ లో ఉంది. ఇక టికెట్ టు ఫినాలే రేసు ప్రారంభం కావడంతో రణరంగంలా మారింది. హౌస్‌మేట్స్ అందరూ తమ తమ స్ట్రాటజీలను మార్చుకుంటూ ఒకరిపై మరొకరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇదిలాఉంటే.. 13వ వారం నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్‌లో నెలకొన్న టెన్షన్‌ను మరింత పెంచాయి.

ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన ప్రత్యేక టాస్క్ ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు ప్రకటిస్తూ, కారణాలు చెబుతూ బాటిల్స్ పగులగొట్టి నామినేట్ చేయాల్సి వచ్చింది. దీంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన నామినేషన్స్‌లో చివరికి సంజన గల్రానీ, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజా పుట్టస్వామి, భరణి శంకర్ నామినేషన్‌లోకి చేరారు. ఈ సారి టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్‌లో ఉండటంతో హౌస్‌లో టెన్షన్ పీక్స్‌కి చేరుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తాజా పరిస్థితి పూర్తిగా రణరంగంలా మారింది. ఆన్‌లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వీక్లీ పనితీరు ఇవన్నీ పరిశీలిస్తే.. ఈ వారం బయటకు వెళ్లాల్సింది సుమన్ శెట్టి లేదా సంజనా అని చాలా మంది అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా షాకింగ్‌గా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లబోతున్న కంటెస్టెంట్ రీతూ చౌదరిగా తెలుస్తోంది.
వాస్తవానికి ఈ వారం ఓటింగ్‌లో రీతూ చౌదరి టాప్-2లో నిలిచిందని అనేక పోల్స్ చూపిస్తున్నాయి. డెమాన్ పవన్‌తో లవ్ ట్రాక్, ఎమోషనల్ కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ బిగ్ బాస్ రీతూని షోలో బాగా ప్రోత్సహించాడని ప్రారంభం నుంచి టాక్ ఉంది. కానీ గతవారం రీతూ vs సంజన గొడవ హౌస్‌లో హీట్ పెంచినప్పటికీ, ఆ గొడవ బయటికి వెళ్లాక ప్రేక్షకుల వైఖరి రీతూ పట్ల మారిపోయినట్టు కనిపిస్తోంది.
డిమాన్ పవన్‌తో రీతూ ఎక్కువసేపు దగ్గరగా ఉండటం, రాత్రి టైం ప్రైవేట్ బిహేవియర్ షోలో కనిపించడం చాలా మంది ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. సంజన ఈ విషయాన్ని ఓపెన్‌గా హౌస్‌లో చర్చించడంతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. సంజన చేసింది తప్పే అయినా.. రీతూ.. బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున లను ఎదిరించిన తీరు నెటిజన్లకు అంతగా నచ్చలేదు.
దాంతో ఆన్‌స్క్రీన్ సపోర్ట్ రీతూకు వచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం సంజనకు భారీగా సపోర్ట్ లభించింది. సంజనకు వచ్చిన అత్యధిక ఓటింగ్ తో ఆమె టాప్ జోన్‌లోకి వెళ్లగా, రీతూ మాత్రం అంచనాలకు విరుద్ధంగా డేంజర్ జోన్‌లో పడిపోయింది. దీంతో బిగ్ ట్విస్ట్ గా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రీతూనేనన్న సమాచారం బయటకు వచ్చింది.
రీతూ టాస్కుల్లో ఎప్పుడూ గట్టి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్కుల్లో కూడా టాప్ 2 వరకు వెళ్లింది. అయినా కూడా బిగ్ బాస్‌లో విజయానికి కేవలం టాస్కులు ఒక్కటే కాదని, బిహేవియర్, మేచ్యూరిటీ, పబ్లిక్ కనెక్షన్ కూడా ముఖ్యం అని రీతూ అవుట్ అయిన తర్వాత స్పష్టమయ్యేలా ఉంది. రీతూ ఎలిమినేషన్ వార్త హౌస్‌లో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా పెద్ద షాక్ గా మారింది. ఈ ట్విస్ట్ వల్ల హౌస్ డైనమిక్ పూర్తిగా మారుతుందని అంతా భావిస్తున్నారు. చివరి వారాల్లో ఇంకా ఏమేం ట్విస్టులు వస్తాయో అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











