డిమోన్ పవన్‌తో రీతూ రిలేషన్ అదే... దివ్వెల మాధురిపై రీతూ తల్లి షాకింగ్ కామెంట్స్

బిగ్‌‌బాస్ అంటేనే ప్రేమకథలు గ్యారంటీ. గత సీజన్‌లలో ఎందరో కంటెస్టెంట్స్ హౌస్‌లో లవ్ ట్రాక్‌లు నడిపారు. ఇవి బిగ్‌బాస్‌కు ప్లస్‌గా మారడంతో పాటు ఆయా కంటెస్టెంట్స్‌కి ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చాయి. కొన్ని భాషల్లో అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమలో పడిన కంటెస్టెంట్స్.. రియల్ లైఫ్‌లో పెళ్లి చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు బిగ్‌‌బాస్ 9లో డిమోన్ పవన్ - రీతూ చౌదరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున గాసిప్స్ వచ్చాయి. హౌస్‌లో వాళ్లిద్దరి బిహేవియర్ కూడా అలాగే ఉంది.

బిగ్‌బాస్ నుంచి రీతూ చౌదరి ఔట్
అయితే బిగ్‌బాస్ తెలుగు 9లో 13వ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం ఆడియన్స్‌కు షాకిచ్చింది. ఈ సీజన్‌లో ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా రీతూ ఉంటారని అందరూ భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె ఎలిమినేట్ కావడం చర్చనీయాంశమైంది. ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె ఇంటి వద్ద రీతూకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక మీడియా అయితే ఆమెను డిమోన్ పవన్ గురించే ఎక్కువ ప్రశ్నలు అడిగింది. ఇదే సమయంలో దివ్వెల మాధురి వీరిద్దరిపై చేసిన కామెంట్స్‌పైనా మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి రీతూ చౌదరి తల్లి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 9 Rithu Chowdhary s Mother Counter to Divvala Madhuri on Demon Pavan

రీతూ చౌదరి - డిమోన్ పవన్‌లపై దివ్వెల మాధురి వ్యాఖ్యలు
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ తెలుగు 9లో అడుగుపెట్టిన దివ్వెల మాధురి మూడు వారాల పాటు హౌస్‌లో కొనసాగి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత పలు మీడియా సంస్థలు ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. మాధురిని కూడా ఎక్కువ మంది పవన్ - రీతూ గురించి అడిగారు. దానికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. డిమోన్ పవన్‌తో రీతూ చౌదరిది హెల్దీ రిలేషన్‌షిప్ అయితే వాళ్ల ఫ్యామిలీ నుంచే ఒకరు నాకు ఫోన్ చేశారు. రీతూ చౌదరిని బాత్‌రూంలోకి తీసుకెళ్లి డిమోన్‌తో మాట్లాడొద్దని నాకు చెప్పారు. ఇంట్లో రీతూ వాళ్లమ్మ దొర్లి దొర్లి ఏడుస్తోందని మాధురి అన్నారు. కన్నతల్లికే రీతూ- పవన్‌ల రిలేషన్ అన్ హెల్దీగా అనిపించినప్పుడు, ఓ మదర్‌గా నాకూ అలాగే ఉంటుందని తెలిపారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి.

పవన్ నా బెస్ట్ ఫ్రెండ్
తాజాగా రీతూ ఎలిమినేట్ అయి ఇంటికి రాగానే మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టారు. పవన్‌తో మీ రిలేషన్ ఫ్రెండ్‌షిప్ అని మీరు అంటున్నారు, కానీ బయట వేరేలా అనుకుంటున్నారని మీడియా అడిగింది. దీనికి రీతూ స్పందిస్తూ.. హౌస్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. కొందరు కనెక్ట్ అవుతారు.. నాకు డిమోన్ పవన్‌ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్ కనెక్ట్ అయ్యింది. మన లైఫ్‌లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వారిలో కొన్ని నచ్చుతాయి, క్లోజ్ అవుతాము.. వాళ్లతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి చాలా మంచోడు, ఆ కంఫర్ట్ జోన్‌లోనే అబ్బాయితో ఫ్రెండ్ షిప్ చేశా. అతను నా బెస్ట్ ఫ్రెండ్. మన కాలేజీలో, స్కూల్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా.. ఆ రేంజ్‌లో బెస్ట్ ఫ్రెండ్ అని కుండబద్దలు కొట్టింది రీతూ చౌదరి.

దివ్వెల మాధురికి రీతూ తల్లి కౌంటర్
ఇకపోతే.. మీ అమ్మగారు.. దివ్వెల మాధురి గారికి ఫోన్ చేసి డిమోన్ పవన్‌తో మాట్లాడొద్దని చెప్పారా? నిజమేనా? అని ప్రశ్నించగా రీతూ, ఆమె తల్లి షాక్ అయ్యారు. నేనేం చెప్పలేదు.. ఆమ ఊహించుకుని ఏదేదో మాట్లాడింది. ఆమె ఏ ఉద్దేశంతో లోపలికే వెళ్లిందో, నాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు రీతూ చౌదరి మదర్ మండిపడ్డారు. దాంతో రీతూ తన తల్లిని వారించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై దివ్వెల మాధురి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X