ఆ టీవీ యాక్టర్‌తో నా రిలేషన్ అదే.. మరో జన్మ ఉంటే.. బిగ్‌బ్యూటీ తనుజా ఎమోషనల్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9)గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. కామనర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచి, బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. మొదటి నుంచీ ట్రోఫీకి గట్టి పోటీదారిగా భావించిన తనూజ మాత్రం చివర్లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, తన ఆటతీరు, మెచ్యూరిటీ, భావోద్వేగాలతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తనూజకు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీవీ నటుడు పవన్ సాయితో తనూజ రిలేషన్‌లో ఉందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై తనుజా క్లారిటీ ఇచ్చిన ఓ ఇంటర్వ్వూ తెగ వైరలవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?
బిగ్ బాస్ రన్నర్ తనూజ, పవన్ సాయి వీరిద్దరూ కలిసి 'ముద్దమందారం' సీరియల్‌లో నటించగా, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ రియల్ కపుల్ అన్నంతగా వర్కౌట్ అయింది. దీంతో ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరి మధ్య బాండింగ్‌పై చర్చలు మొదలయ్యాయి. ఇటీవల వైరల్ అవుతున్న తనూజ పాత ఇంటర్వ్యూలో.. పవన్ సాయితో తనకున్న అనుబంధం గురించి భావోద్వేగంగా వివరించింది. తనుజా మాట్లాడుతూ.. 'నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఎక్కువగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరో చెప్పాలంటే అది పవన్ మాత్రమే. ఏదైనా కొత్త అవకాశం వచ్చినా, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా... మొదటగా పవన్ అభిప్రాయం తీసుకుంటా. మా ఇంట్లో వాళ్లు కూడా ఆయన మాటను చాలా గౌరవిస్తారు' అని చెప్పింది.

పవన్ సాయి గురించి తనూజ చేసిన వ్యాఖ్యలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. 'పవన్ గారు లాంటి వ్యక్తిని నేను చాలా రేర్‌గా చూశాను. తమిళ్, తెలుగు ప్రాజెక్ట్స్‌లో కలిసి పనిచేశాం. బయట ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు కూడా ఆయనను నేను గమనిస్తూ ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా, చాలా కూల్‌గా, చిరునవ్వుతో హ్యాండిల్ చేస్తారు. అలాంటి మనస్తత్వం నాకు ఇంకో జన్మలో అయినా రావాలని కోరుకుంటా' అంటూ ప్రశంసల వర్షం కురిపించింది.
అలాగే పోటీ పరిస్థితుల్లోనూ పవన్ ఇతరులను మోటివేట్ చేస్తారని, తన చుట్టూ ఉన్నవారికి ధైర్యం నింపే వ్యక్తిత్వం ఆయనదని తనూజ చెప్పుకొచ్చింది. 'భవిష్యత్తులో అలాంటి వ్యక్తిని మళ్లీ కలుస్తానో లేదో తెలియదు కానీ... పవన్ మాత్రం నిజంగా చాలా ప్రత్యేకమైన మనిషి' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది.
ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రాగానే.. తనూజ చాలా మెచ్యూర్‌గా స్పందించింది. 'పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. చిన్నప్పటి నుంచి కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. పెళ్లయిన తర్వాత పని మనిషి పెట్టుకుంటావా లేదా అనేది నీ ఇష్టం కానీ, పుట్టింట్లో కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సిందే అని మా వాళ్లు చెప్పేవారు. ఇప్పుడు ఆ మాటల అర్థం నాకు తెలుస్తోంది. ఎప్పుడు ఆ ముహూర్తం కలిసి వస్తుందో, పెళ్లి ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే' అని చెప్పింది.
భవిష్యత్తు భాగస్వామి గురించి మాట్లాడుతూ.. 'ఒక అబ్బాయి మంచివాడైనా చెడిపోవడానికి కారణం చాలాసార్లు పరిస్థితులే. మన బిహేవియర్ బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. అతను ఎలా ఉంటాడన్నదానికంటే, మనం అతన్ని ఎలా అర్థం చేసుకుంటామన్నదే ముఖ్యమని మా అమ్మమ్మ చెప్పేది. నాకు ప్రత్యేకంగా ఇలాంటి క్వాలిటీస్ కావాలనే లిస్ట్ ఏమీ లేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చాలు. నా భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని నమ్ముతున్నాను' అంటూ తనూజ తన ఆలోచనలను పంచుకుంది.
మొత్తంగా చూస్తే.. బిగ్‌బాస్ తర్వాత కూడా తనూజ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. పవన్ సాయితో తనకు ఉన్న అనుబంధం, ఆమె చేసిన కామెంట్స్ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











