అభిమానులకు తనూజ పుట్టస్వామి క్షమాపణలు.. లేడీ సింగం కంటతడి, ఏం జరిగిందంటే?

దాదాపు 105 రోజుల పాటు అభిమానులకు వినోదాన్ని పంచిన బిగ్‌బాస్ తెలుగు 9 ఇటీవల ముగిసింది. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్ విజేతగా నిలిచాడు. తొలి నుంచి టఫ్ ఫైట్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా విజేత అవుతుందని అనుకున్నప్పటికీ అనూహ్యంగా తనూజ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో తనూజ అభిమానులు బిగ్‌బాస్ నిర్వాహకులపై ట్రోలింగ్‌కు దిగారు. బిగ్‌బాస్ టైటిల్ గెలవనప్పటికీ అసలు విజేత ఆమెనంటూ పోస్ట్‌లు పెట్టారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నాటి నుంచి తన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారు తనూజ పుట్టస్వామి. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. నిజాయితీ, మంచితనం, అమాయకత్వంతో తనూజ ఆకట్టుకున్నారు. మన పక్కింటి అమ్మాయిలా కనిపించడంతో కుర్రకారు కూడా ఆమెకు ఓట్లు గుద్దేశారు. బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైన నాటి నుంచి ఈ సీజన్ విజేత ఖచ్చితంగా తనూజయే అనుకున్నారు. అయితే మధ్యలో కళ్యాణ్ రెచ్చిపోవడంతో లెక్కలు మారిపోయాయి.

Bigg Boss Telugu 9 Runner-Up Thanuja Puttaswamy Apologises to Fans Wins Hearts with Her Kind Gesture

అప్పటి నుంచి హౌస్‌లో, ఓటింగ్‌లో పవన్ కళ్యాణ్ vs తనూజ పుట్టస్వామిగా మారిపోయింది. ఇదే సమయంలో ఆమె స్థానికతపైనా పెద్ద చర్చ జరిగింది. వీటన్నింటికీ తన ఆట తీరు, మంచి మనసుతోనే ఆన్సర్ ఇచ్చింది. ఫైనల్‌లో కళ్యాణ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆడిన తనూజ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. రన్నరప్‌గా నిలిచినప్పటికీ అందరి హృదయాలను గెలుచుకున్నావంటూ ప్రముఖులు, అభిమానులు కామెంట్స్ పెట్టారు.

బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సీజన్ కంటెస్టెంట్స్ అంతా కొత్త ప్రాజెక్ట్‌లతో ముందుకు వెళ్తుండగా.. మరికొందరు మాత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, విందు, వినోదాలతో సమయం గడుపుతున్నారు. అయితే రన్నరప్‌గా నిలిచిన తనూజ మాత్రం వారందరికీ తాను భిన్నమని నిరూపించారు. పార్టీలు, పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించకుండా ఒక రోజంతా అనాథ పిల్లలతో గడిపి తన మంచి మనసును నిరూపించుకున్నారు. వారితో ఆటలు ఆడుతూ వారితో కలిసి భోజనం చేసింది. ఈ వీడియోతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టకుండా కొంతకాలం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడపాలని ఆమె భావిస్తోందట.

ఇదిలాఉండగా.. తన అభిమానులకు తనూజ పుట్టస్వామి క్షమాపణలు చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దాంతో అసలు ఏం జరిగింది? ఎందుకు తనూజ క్షమాపణలు చెప్పారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే... బిగ్‌బాస్‌ జర్నీ అనంతరం తనూజ తన అభిమానులను కలవాలని అనుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు తనూజ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. వారి మధ్యలో తనూజ కూడా ఇరుక్కుపోయారు. అతి కష్టం మీద వేదికను చేరుకున్న ఆమె.. తిరిగి వెళ్లేటప్పుడు కూడా అంతే ఇబ్బందిపడ్డారు. ఈ సమయంలో అభిమానులు ఇచ్చిన కానుకలతో ఆమె చేతులు నిండిపోయాయి.

ఈవెంట్‌లో తనూజ మాట్లాడుతూ.. కొన్ని టెక్నికల్ ఈష్యూస్ వల్ల నేను బయటే వేచి చూడాల్సి వచ్చింది. ఇందుకు మీ అందరికీ సారీ. ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురుచూశాను. కానీ ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. మీ అందరితో టైం స్పెండ్ చేసి కాసేపు ఉండాలని అనుకున్నాను, కానీ కొన్ని కారణాలతో ఎక్కువసేపు ఉండలేను. నన్ను చూడాలని ఆఫీస్‌లకి సెలవులు పెట్టి, చాలా దూరం ప్రయాణించి వచ్చారు. ఇంకా కాసేపు కారులోనే నన్ను పెట్టుంటే ఏడ్చేసేదాన్ని. మీ అందరి కోసం టైం తీసుకుని మళ్లీ వస్తాను... పోలీసుల పర్మిషన్ మాకు దొరకకపోవడం వల్లే మీతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానని తనూజ కంటతడి పెట్టారు.

తాజాగా తన వల్ల ఇబ్బందిపడిన అందరికీ క్షమాపణలు చెబుతూ తనూజ నోట్ పెట్టారు. నిన్న మీ అందరినీ వ్యక్తిగతంగా పలకరించడానికి సరైన సమయమని భావించాను. కానీ ఈ సమావేశంలో కొన్ని ఊహించయని అంతరాయాల కారణంగా, నా మనసు భారంగా, విచారంగా అనిపించింది. అయినప్పటికీ మీ అందరినీ చూసిన ఆ కొద్దినిమిషాల్లో నేను పొందిన ప్రేమ అపారమైనది. మీ ప్రతి చిరునవ్వు, ప్రతి ప్రోత్సాహం నాకు ఎంతో విలువైనవి. ఈ ప్రయాణంలో ఇంత ప్రేమతో, నమ్మకంతో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తనూజ తెలిపారు.

నిన్న జరిగిన ఏదైనా అసౌకర్యానికి నా హృదయపూర్వక క్షమాపణలు. నన్ను చూడటానికి చాలా దూరం ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ.. దయచేసి మీ ప్రేమను నేను లోతుగా అనుభవించానని, దానిని నా హృదయంలో ఎప్పటికీ మోస్తున్నానని అర్ధం చేసుకోండి. ఇది ముగింపు కాదు.. ముందు ముందు ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ నేను కలుస్తాను, పలకరిస్తాను, మీతో సమయం గడుపుతానని మాట ఇస్తున్నాను అని తనూజ పుట్టస్వామి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరోసారి తనూజ తన మంచి మనసును చాటుకున్నారంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 thanuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X