ఇమ్మాన్యుయేల్ ఓ వెధవ.. ఎంత చెప్పినా వినలేదు.. తనూజ షాకింగ్ కామెంట్స్

Thanuja - Emmanuel: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో చిచ్చరపిడుగుగా, నెటిజన్ల దృష్టిలో డ్రామా క్వీన్‌గా, హౌస్‌మేట్స్‌కు చీటికీ మాటికీ చికాకు తెప్పించే అమ్మాయిగా గుర్తింపు పొందింది తనూజ పుట్టస్వామి. ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదురైనా వాటన్నిటిని పక్కన పెట్టి తన ఆటపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. 105 రోజుల పాటు ఇతర కంటెస్టెంట్లకు పోటీ ఇస్తూ షోలో నిలిచింది. విన్నర్ తానే అవుతానన్న నమ్మకంతో ఫినాలే వరకు వచ్చింది. కానీ చివరి క్షణంలో అదృష్టం కలిసి రాకపోవడంతో రన్నర్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విన్నర్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. అయితే.. బిగ్ బాస్ షో ను బయటికి వచ్చాక ఇమ్మాన్యుయేల్ పై తనూజ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తింది. ఫినాలేలో టాప్-5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ పోటీ పడ్డారు. 5వ స్థానంలో సంజనా ఎలిమినేట్ అవ్వగా.. 4వ స్థానంలో ఇమ్మాన్యూయేల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక డిమాన్ పవన్ రూ.15 లక్షల క్యాష్ బ్రీఫ్‌కేస్ తీసుకుని సెకండ్ రన్నర్‌అప్‌గా నిష్క్రమించగా, ఫైనల్ ఫైట్ కళ్యాణ్-తనూజ మధ్యే జరిగింది.నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్‌లో కామన్‌మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.చివరకు కళ్యాణ్ ట్రోఫీతో పాటు రూ.35 లక్షల నగదు, మారుతి సుజుకి విక్టోరియస్ కారు గెలుచుకున్నాడు. రన్నర్‌అప్‌గా నటి తనూజ పుట్టస్వామి నిలిచింది.

Bigg Boss Telugu 9 Runner-Up Thanuja Puttaswamy s Emotional Comments on Emmanuel Go Viral

అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తనూజ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా తన తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా షోలో తనతో కలిసి ఉన్న కంటెస్టెంట్లతో ఉన్న బాండ్ గురించి మాట్లాడుతూ.. 'ఇమ్ము నా ఫేవరెట్. ఆ వెధవకు ఎన్నిసార్లు చెప్పినా వినడు. కానీ మా ఇద్దరి మధ్య ఎక్కడో చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్లీ నార్మల్ అయ్యాం. తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, కొన్నిసార్లు ఏడ్చాం, సరదాగా గడిపాం. నాలో ఉన్న నాటినెస్‌ని బయటికి తీసుకొచ్చింది వాడే' అంటూ తనూజ చెప్పింది.

మూడు నెలల పాటు నాలుగు గోడల మధ్య గడిపిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. 'ప్రతి రోజు ఉదయం వాళ్లతోనే మొదలయ్యేది. ఇప్పుడు బయట ప్రపంచానికి వచ్చాక వాళ్లు కనిపించకపోయేసరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తోంది. నిజంగా చాలా చాలా మిస్ అవుతున్నా" అంటూ భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటలు వినిపించగానే లైవ్ చూస్తున్న అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే... ఈ సీజన్‌లో అతని జర్నీ నిజంగా ప్రత్యేకం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో మొదటి రోజు నుంచే ఇటు ఎంటర్టైన్‌మెంట్ పరంగా, అటు టాస్కుల పరంగా ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. ఎవ్వరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా హౌస్‌లో తన ఆటను కొనసాగించాడు. దాదాపు 10 వారాల పాటు నామినేషన్‌లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్‌గా అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు, మూడుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించి తన లీడర్‌షిప్ స్కిల్స్‌ను నిరూపించాడు.

సంజనా సిన తప్పులకు కూడా తానే బాధ్యత తీసుకుంటూ తలవంచిన సందర్భాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి. ఇలాంటి నిష్కళంకమైన ఆట తీరుతో ప్రేక్షకుల మదిని గెలిచినా, టైటిల్ రేస్‌లో మాత్రం ఇమ్మాన్యుయేల్ వెనుకబడిపోయాడు. టాప్-5 వరకు వచ్చినా, ట్రోఫీ దక్కకపోవడం అతని అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు తనూజ చేసిన తాజా వ్యాఖ్యలతో మళ్లీ ఇమ్మాన్యుయేల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వ్యాఖ్యలపై ఇమ్మాన్యుయేల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Read more about: bigg boss telugu emmanuel thanuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X