Bigg Boss 9 Telugu: సాయి శ్రీనివాస్‌కు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్.. 4 వారాలకు ఎంత వసూలు చేశాడంటే?

Bigg Boss 9 Telugu Sai srinivas Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సీజన్ ఫైనల్‌కు ఇంకా ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉండగా, ఎవరూ ఊహించని విధంగా 9వ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ప్రేక్షకులు ఒక్కసారి కంగారుపడేలా ఈ వారం బిగ్‌బాస్ రెండు కంటెస్టెంట్లను హౌస్‌ నుంచి పంపించేశారు. అందులో రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా, సండే షోలో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కు కారణాలేంటీ? ఇంతకీ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు. అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకెళ్లే..

బిగ్‌బాస్ తెలుగు 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లలో ఒకరిగా నిలిచిన రాము రాథోడ్, గేమ్‌లో ఫైర్ చూపించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకస్థానం సంపాదించాడు. మొదటి రోజు నుంచే ఎనర్జీతో, క్లారిటీతో, గేమ్ స్పిరిట్‌తో వ్యవహరించిన రాము, టాప్ 5లో కచ్చితంగా ఉంటారని బిగ్ బాస్ లవర్స్ భావించారు. అయితే గత కొద్ది రోజులుగా రాము తన తల్లిదండ్రుల మిస్ అవుతున్నానని, హోమ్ సిక్ ఫీలవుతున్నానని చెప్పుకుంటూ వస్తున్నాడు. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ముందు తాను ఇక కొనసాగలేనని స్పష్టంగా చెప్పాడు. నాగ్‌తో పాటు ఇతర హౌస్‌మెట్స్ కూడా రామును ఒప్పించడానికి ప్రయత్నించినా, అతను వెనక్కి తగ్గలేదు. చివరకు కింగ్ నాగార్జున అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ సెల్ఫ్ ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

Bigg Boss Telugu 9 Sai Srinivas Elimination Reason and Remuneration Details

రాము రాథోడ్ సెల్ప్ ఎలిమినేట్ చేసుకుని హౌస్‌లోని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలా ఈ వారం ఒక్క కంటెస్టెంట్ బయటకు వెళ్లడంతో ఎలిమినేషన్ లేకపోవచ్చని భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించిన కంటెస్టెంట్. ప్రారంభంలో కొంత హైప్ ఉన్నప్పటికీ, ఆయన తన గేమ్‌ను బలంగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. టాస్కులు, స్క్రీన్ ప్రెజెన్స్, మైండ్ గేమ్ వంటి అంశాల్లో అతను ఇతర కంటెస్టెంట్స్ కంటే వెనుకబడ్డాడు. ఇక పలు సందర్భాల్లో ఆయన కన్నింగ్‌గా ప్రవర్తించాడని హౌస్‌మేట్స్, ఆడియన్స్ మధ్య అభిప్రాయాలు రావడం వల్ల ఓటింగ్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడింది. చివరికి ఈ వారం ఓటింగ్‌లో అందరి కంటే తక్కువ ఓట్లు సాధించి ఎలిమినేట్ అయ్యాడు.

సాయి శ్రీనివాస్ పక్కా యాక్టర్. బిగ్‌బాస్ షోకి రాకముందు పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఈ రియాలిటీ షో ద్వారా ఆయన పేరు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు దొరికింది. ఇకపై సినిమాల్లో అవకాశాలు వస్తే తన ప్రతిభను చూపిస్తాడు" అని బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. ఇక సాయి శ్రీనివాస్ బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగు వారాలు కొనసాగాడు. ప్రతి వారం రూ.2 లక్షల చొప్పున ఆయనకు మొత్తం రూ.8 లక్షల రెమ్యూనరేషన్ లభించినట్లు సమాచారం. "ఇంకొక్క వారం ఉంటే నేనేమిటో చూపించేవాడిని" అని సాయి బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింత హీట్ అవుతోంది. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్‌ల తర్వాత, హౌస్‌లో ఉన్న వారు ఒక్కొక్కరు తమ స్ట్రాటజీని మార్చుకుంటున్నారు. ఇంకా ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో విజేత ఎవరు అవుతారు? ఎంతమంది ఫైనల్‌కి చేరుకుంటారు? అన్నది అభిమానుల్లో భారీ ఆసక్తిగా మారింది. మొత్తానికి .. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్‌ ఆడియన్స్‌ను ఎమోషనల్ చేయడంతో పాటు గేమ్‌లో కొత్త మలుపు తీసుకొచ్చింది. ఇక ముందు వారం ఎవరికి సేఫ్ జోన్ దక్కుతుంది? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్నదే వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X