దివ్వెల మాధురి క్యారెక్టర్ పై సంజన షాకింగ్ కామెంట్స్.. తలలు పట్టుకోవాలంటూ..
Bigg Boss Sanjana About Divvela Madhuri: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగిసినప్పటికీ... ఆ షోకు సంబంధించిన కంటెస్టెంట్ల వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టాప్ 5 ఫైనలిస్ట్‌గా నిలిచిన నటి సంజనా గల్రానీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన అనుభవాలు మాత్రమే కాదు... తన జీవితంలోని కష్టకాలం, అలాగే కంటెస్టెంట్ దివ్వెల మాధురితో తన బాండింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.
సంజనా భావోద్వేగం
ఇంటర్వ్యూలో సంజనా భావోద్వేగానికి లోనవుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంది. 'ఐదేళ్ల క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్నీ, కెరీర్‌నీ పూర్తిగా కుదిపేసింది. అప్పట్లో నేను చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ నేను స్వతహాగా ఫైటర్‌ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను'అంటూ తన పోరాటాన్ని వివరించింది. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

బిగ్‌బాస్‌తో కొత్త ఆరంభం
బిగ్‌బాస్ షో తనకు చాలా నేర్పించిందని సంజనా చెప్పింది. 'ఈ అనుభవం తర్వాత నా కెరీర్‌లో ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాను. మళ్లీ గర్వంగా తలెత్తుకుని నడవడానికి కారణమైన బిగ్‌బాస్‌కు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను'అంటూ చెప్పుకొచ్చింది. అలాగే షో హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ... 'బిగ్‌బాస్ తర్వాత నాగార్జున గారికి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను' అని పేర్కొంది. ఇకపై తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడతానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీలు కూడా వచ్చాయని వెల్లడించింది.
దివ్వెల మాధురితో ఫైట్ ?
ఇంటర్వ్యూలో యాంకర్ దివ్వెల మాధురితో సంజనా బాండింగ్ గురించి ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. 'మాధురి గారు హౌస్‌కి వచ్చిన రోజు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండాలని అనుకున్నాం. కానీ నెక్స్ట్ డే నుంచే గొడవలు మొదలయ్యాయని అందరూ అనుకున్నారు. నిజానికి నేను మాధురితో ఫైట్ చేయలేదు. తానే నా మీద గొడవకు వచ్చింది'అని స్పష్టం చేసింది. మాధురి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ.. 'మాధురి గురించి మాట్లాడాలంటే భయంగానే ఉంటుంది. ఏం చెబితే ఆమె ఎలా తీసుకుంటుందో అర్థం కాదు. కానీ ఆమె మనసు మాత్రం చాలా మంచిది. కానీ, ఆమె నోరు మాత్రం గుంటూరు కారం లాంటిది. అలాంటి పర్సన్‌తో మాట్లాడటం కాస్త కష్టమే. ఆమె చెప్పిందే కరెక్ట్ అనాల్సిందే. ఎక్కువ మాట్లాడితే మేమే తలలు పట్టుకోవాలి'అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.
గుంటూరు కారం లాంటింది
అయితే చివరికి మాధురిపై ప్రశంసల వర్షం కురిపించింది సంజనా. 'మాధురి చాలా స్వీట్ హార్ట్. ఆమె నాకు చాలా దగ్గరైంది. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హౌస్‌లో నా కన్నా ఎక్కువ గట్స్, ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరు అంటే... నేను ఎలాంటి సందేహం లేకుండా దివ్వెల మాధురి అనే చెబుతాను'అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మొత్తంగా చూస్తే... దివ్వెల మాధురితో జరిగిన బాండింగ్, ఫైట్స్, ఫ్రెండ్‌షిప్ అన్నీ చాలా నిజాయితీగా చెప్పింది సంజనా. దివ్వెల మాధురి గుంటూరు కారం లాంటింది" అని కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











