Bigg boss Telugu 9: గేమ్ మొత్తం సంజనా చేతుల్లో.. తనూజకు బిగ్ బాస్ షాక్..?
Bigg boss Telugu 9: తెలుగు బుల్లితెరపై సంచలనంగా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దశకు చేరుకుంది. డిసెంబర్ 21న జరిగే ఫినాలే కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, టైటిల్ విన్నర్ ఎవరు? అన్న చర్చ రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ కీలక సమయంలో బిగ్ బాస్ డ్రామా క్వీన్ సంజన జర్నీ వీడియో ఒక్కసారిగా గేమ్ దిశనే మార్చేసినట్లుగా కనిపిస్తోంది. ఆ వీడియో చూస్తే.. గుసు బంప్స్ వచ్చేలా ఎలివేషన్ ఇచ్చారు. సంజనకు బిగ్‌బాస్ ఇచ్చిన ప్రాముఖ్యత, అందులో 'గేమ్ మొత్తం సంజన చేతుల్లోనే ఉంది?' అంటూ బిగ్ బాస్ చెప్పడం చూస్తే.. తనూజకు బిగ్‌బాస్ షాక్ ఇవ్వబోతున్నారా? అనే సందేహాలను తెరపైకి తెచ్చింది. ఇంతకీ ఆ జర్నీ వీడియోలో ఏముందంటే?
బిగ్‌బాస్ సీజన్ 9లో ఆటను నిజంగా రసవత్తరంగా మార్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే... చాలా మంది ప్రేక్షకులు ఎలాంటి సందేహం లేకుండా చెప్పే పేరు సంజనా. తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆమె ఆటలో స్పష్టమైన దూకుడు కనిపించింది. ఇంట్లో ఏదైనా జరగాలంటే అది తన వల్ల జరగాలి లేదా తన చుట్టూనే జరగాలనే విధంగా సంజన గేమ్‌ను నడిపించింది. ముఖ్యంగా షో ఆరంభంలో కొంచెం స్తబ్దంగా సాగిన గేమ్‌ను ఒక్కసారిగా హై వోల్టేజ్‌కు తీసుకెళ్లిన ఘట్టం... 'గుడ్డు దొంగతనం'టాస్క్. ఆ ఒక్క ఘటనతో సంజన పేరు ప్రతి ఇంట్లో మార్మోగిపోయింది. ఆ తర్వాత మాటల యుద్ధం, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎమోషన్స్ అన్ని కలసి ఆమెను హైలెట్ గా మార్చేశాయి. టాప్ 5 ప్లేయర్‌గా నిలబెట్టాయి.

వాస్తవానికి సంజన ప్రయాణం చాలా ప్రత్యేకం. ఆమె స్పెషల్ గా మార్చిన, ప్రత్యేకంగా నిలబెట్టిన మరో అంశం ఆమె త్యాగం. చిన్న పిల్లాడిని, చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి గేమ్ కోసం హౌస్‌లోకి అడుగుపెట్టడం చిన్న విషయం కాదు. అయినా ఒక్కరోజు కూడా ఆమె తన పిల్లాడిని ముందుకు పెట్టుకుని సింపతి కార్డు ఆడలేదు. ఈ విషయంలో ఆమె ధైర్యాన్ని, స్ట్రాంగ్ మెంటాలిటీని ప్రేక్షకులు తప్పకుండా మెచ్చుకోవాల్సిందే.
బిగ్‌బాస్ సీజన్ 9 జర్నీ వీడియోల్లో భాగంగా సంజన వీడియోను లాస్ట్‌లో చూపించడం కూడా చాలా కీలకంగా మారింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని అనిపించేలా, బిగ్‌బాస్ ఆమెకు భారీ ఎలివేషన్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో పెట్టిన తన జర్నీ మెమరీస్ చూసిన సంజన, ముఖ్యంగా తన బిడ్డ అలరిక్ ఫోటో చూసి ఎమోషనల్ అయిపోయింది. 'అరగంటలో వస్తానని చెప్పా... కానీ 100 రోజులు అయినా ఇంటికి రాలేదు రా... సారీ" అంటూ సంజన చెప్పిన డైలాగ్ బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలను తాకింది.
జర్నీ వీడియోలో బిగ్‌బాస్ సంజన గురించి చెప్పిన మాటలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. "టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5కి చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది... సీజన్ 9 తొలి కెప్టెన్‌గా ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. టాస్కుల్లో మీరు పోటీ పడినా సంచాలకులుగా ఉన్నా సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించారు.. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం.. ' ఈ మాటలతో సంజన మాత్రమే కాదు, ప్రేక్షకులకూ గుసు బంప్స్ వచ్చాయి. చివరిగా 'కష్టాలెన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు చూసి మీ బాబు ఎంతో గర్వపడతారు..'అన్న డైలాగ్ అయితే సంజన కళ్లను చెమ్మగిల్లేలా చేసింది.
తనూజకు బిగ్‌బాస్ షాక్?
ఇప్పటివరకు గేమ్‌లో తనూజ బలమైన కంటెండర్‌గా కనిపించింది. కానీ ఫినాలే వీక్‌లో సంజనకు వచ్చిన ఈ రేంజ్ ఎలివేషన్, ఆమె జర్నీకి ఇచ్చిన ప్రాముఖ్యత... గేమ్ బ్యాలెన్స్‌ను మార్చేస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటింగ్ పరంగా కళ్యాణ్-తనూజ మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎమోషనల్ కనెక్ట్, గేమ్ ఇంపాక్ట్ విషయంలో సంజన ఒక్కసారిగా ఫోకస్‌లోకి వచ్చేసింది. బిగ్ బాస్ గేమ్ ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గేమ్‌లో కీలక మలుపు సంజన జర్నీ వీడియోతో మొదలైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదిఏమైనా ఇక చివరి నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. మొత్తానికి ఈ వీడియో మాత్రం హైలెట్ మారింది.


Click it and Unblock the Notifications











