Sanjjanaa Remuneration: బిగ్‌బాస్‌కి సంజన గల్రానీకి రికార్డ్ రెమ్యునరేషన్.. 15 వారాలకు ఎన్ని లక్షలంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరో 24 గంటల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియనుంది. దాదాపు 100 రోజులకు పైగా హౌస్‌లో గడిపి టాస్క్‌లు, గేమ్స్ ఇలా అన్నింటిని దాటుకుని ఐదుగురు కంటెస్టెంట్స్ టాప్ 5లో నిలిచారు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విజేత కానున్నారు. అయితే దీనికంటే ముందు టాప్ 5లో నిలిచిన వారిలో ఎవరికి? ఎంత పారితోషికం దక్కింది అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా సీనియర్ హీరోయిన్ సంజన గల్రానీ రెమ్యునరేషన్ వివరాలు పరిశీలిస్తే..
బుల్లితెరపై సంజన హవా
ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన సంజన గల్రానీ పెళ్లి చేసుకోవడం, వ్యక్తిగత కారణాలతో సినిమాలలో అంతగా నటించడం లేదు. అయితే ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. బుల్లితెర ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అవుతున్నారు. తన మాతృభాష కన్నడంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న సంజన.. తాజాగా తెలుగు బుల్లితెరపైనా అడుగుపెట్టింది. బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఆమె అడుగుపెట్టగానే.. అంతా షాక్ అయ్యారు. ఈవిడ ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండదని అంతా అనుకున్నారు. ఆమె వయసుతో పాటు కంటెస్టెంట్స్ అంతా కుర్రాళ్లు కావడంతో చాలా మంది ఈ రకంగానే ఆలోచించారు. కానీ తొలిరోజు నుంచే సంజన షాకిచ్చింది.

బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి కెప్టెన్
బిగ్‌బాస్‌లో కిచెన్‌లోనే అన్ని గొడవలు స్టార్ట్ అవుతాయని గ్రహించిన సంజన.. తన గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది. గుడ్లు దొంగతనం చేసి గొడవలు పెట్టింది. జనం గొడవలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా చాక్లెట్ తింటూ ఎంజాయ్ చేసేది. అలా బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఆ జోరులో సంజన గల్రానీ ఖచ్చితంగా బిగ్‌బాస్ విన్నర్ అవుతారని అంతా భావించారు. ఇలాంటి దశలో ఆమె అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, తనూజల త్యాగంతో తిరిగి హౌస్‌లో అడుగుపెట్టింది సంజన గల్రానీ.
టాప్ 5లో సంజన గల్రానీ
హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాతి నుంచి సంజన హవా తగ్గించింది. పవన్ కళ్యాణ్, పవన్ డిమోన్, తనూజల హోరులో ఆమె సైడ్ అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ చివరిలో గట్టిగా పోరాడి టాప్ 5లో చోటు దక్కించుకుని ఫైనల్‌లో అడుగుపెట్టింది. దాంతో ఆమె విజేతగా నిలుస్తుందా? మధ్యలోనే ఎలిమినేట్ అవుతుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తనూజ, పవన్ కళ్యాణ్‌ల మధ్య పోటీ జరుగుతున్నప్పటికీ సంజన సైతం మధ్యలో నేనూ ఉన్నానంటూ దూసుకొస్తున్నారు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్‌పై ఉత్కంఠ నెలకొంది.
సంజన గల్రానీకి పారితోషికం ఎంతంటే?
ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ తెలుగు 9లో 15 వారాల పాటు ఉన్నందుకు సంజన ఎంత రెమ్యునరేషన్ అందుకోనున్నారు? ఒక రోజుకు ఎంత? వారానికి ఎంత? అనేది హాట్ టాపిక్‌గా మారింది. సంజనకు రోజుకు 39,285 రూపాయల చొప్పున వారానికి 2.75 లక్షల రూపాయలు అందుకుంటున్నారట. అలా 15 వారాలకు గాను 41 లక్షల రూపాయలను సంజనకు బిగ్‌బాస్ నిర్వాహకులు పారితోషికంగా చెల్లిస్తున్నారట. ఒకవేళ బిగ్‌బాస్ తెలుగు 9లో కనుక విజేతగా నిలిస్తే ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలతో కలిపి సంజన గల్రానీ దాదాపు కోటి రూపాయలు ఇంటికి పట్టుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సంజన చివరి రోజున సంజనకు ఎంత పారితోషికం తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











