TRP: బిగ్ బాస్ తెలుగు 9 టీఆర్‌పీ రికార్డు.. ఐదేళ్ల రేటింగ్స్ బ్రేక్..
Bigg Boss 9 Telugu TRP Rating: తెలుగు టెలివిజన్‌లో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎన్నడూ చూడని ట్విస్టులు, కాంట్రవర్సీలు, స్ట్రాంగ్ టాస్కులు, ఎమోనషన్స్ అన్నీ మిక్స్ కావడంతో ప్రేక్షకులకు ఫుల్‌టైమ్ ఎంటర్టైన్‌మెంట్ అందుతోంది. నిజంగానే ఈ సీజన్‌ను "ఆల్ ఇన్ వన్ షో" అని పిలవడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇంకా నాలుగు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. పదకొండో వారం హౌస్‌లో జరిగిన పరిణామాలు షోను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ గత ఐదేళ్లుగా ఉన్న రికార్డులను బ్రేక్ చేసిందట. ఇంతకీ ఆ రికార్డ్స్ ఏంటి? అనే వివరాలలోకి వెళ్తే..
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తంగా సాగుతోంది. ఈ సీజన్ గత సీజన్ కంటే భిన్నంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీలుగా కాన్సెప్ట్ తో ప్రారంభమైంది. 9 మంది సెలబ్రెటీలు రాగా, 6 కామరన్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే..మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు వైల్డ్ కార్డు ద్వారా టీవీ, సినిమా, సోషల్ మీడియా సెలబ్రెటీలు హౌస్ లోకి పంపించారు. ఇది కూడా ఈ సీజన్ కు హైలెట్ గా మారింది. అలాగే.. ఈ సీజన్‌లో రోజుకో కొత్తగా ట్వీస్ట్, కొత్త రూల్స్, కొత్త గేమ్స్ సీజన్ మరింత ఆసక్తికరంగా, వినూత్నంగా మార్చేశారు. ఇలా విభిన్నంగా సాగుతుండటంతో ఈ సీజన్ కు మంచి ఆదరణ సంపాదించుకుంది. అలాగే మంచి టీఆర్పీ దక్కించుకుంది.

ఈ సీజన్ పాపులారిటీ పెరగడానికి మరో ప్రధాన కారణం హోస్ట్ నాగార్జున ప్రెజెన్స్, వీకెండ్ ఎపిసోడ్స్‌లో కింగ్ నాగార్జున అందించే ఎనర్జీ, పంచ్ డైలాగులు, కాంటెస్టెంట్స్‌తో ఇంటెన్స్ ఇంటరాక్షన్స్, అలాగే.. స్పెషల్ గెస్టుల ఎంట్రీ ఇలా అన్ని ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. అలాగే.. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్స్ చేయడం కూడా షోపై ఇంట్రెస్ట్ కలిగే చేశాయి. అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందనే క్యూరియసిటీ పెంచుస్తున్నాయి. ఇలా ప్రతి వారం వచ్చే ట్విస్టులతో టీఆర్పీ రేటింగ్ పెరుగుతోంది.
ఇక రేటింగ్స్ పరంగా కూడా సీజన్ 9 ఘన విజయం సాధించింది. మొదటి వారం రేటింగ్ సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, షో కంటిన్యూ అవుతున్న కొద్ది రేటింగ్ కూడా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ నమోదు కాని రీతిలో వ్యూయర్‌షిప్‌ను సాధించింది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 9 గత వారం 7 రోజుల సగటుగా 10 TVR (Urban SD+HD) ని సాధించింది. ఇది అత్యంత అరుదైన రికార్డు. ఇది గత ఐదేళ్లలో ఏ బిగ్ బాస్ తెలుగు సీజన్ సాధించలేని రికార్డు. టీవీ ప్రేక్షకుల భారీ స్పందన ఈ సీజన్‌ను పూర్తిగా లీడర్ బోర్డ్ టాప్‌కు తీసుకొచ్చింది. ఇలా బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ సక్సెస్ పుల్ గా దూసుకెళ్తుంది.
మొత్తంగా చూస్తే.. బిగ్ బాస్ తెలుగు 9 చివరి వారాల్లోకి అడుగుపెట్టినకొద్దీ, గేమ్ రేంజ్ పెరిగిపోగా, ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ మరింత టాప్ లెవెల్‌కి చేరుకుంది. గ్రాండ్ ఫినాలే వరకు ఇంకా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











