Bigg Boss 9 Telugu: శివాజీ ఎంట్రీ.. బజ్ ఇంటర్వ్యూ హౌస్‌లోనేనా? ఇక టీఆర్పీ రికార్డులు బద్దలు కావాల్సిందే..
తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Bigg Boss Telugu 9). ఈ రియాలిటీ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. విజేత ఎవరు? రన్నర్-అప్ ఎవరు? అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కళ్యాణ్, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. ఈ ఐదుగురిలో టైటిల్ ఎవరి చేతికి వెళ్తుంది? అన్నదానిపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
ఇలాంటి కీలక సమయంలో బిగ్ బాస్ మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వీకెండ్ ఎపిసోడ్‌లో సెలబ్రిటీల ఎంట్రీతో షోను మరింత హైప్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే బిగ్ బాస్ బజ్ హోస్ట్, హీరో శివాజీ (Shivaji) బిగ్ బాస్ హౌస్‌లోకి స్పెషల్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగింది? శివాజీ ఎంట్రీతో హౌస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ లోకి శివాజీని పంపించబడం వెనుకల ఏమైనా కారణముందా? అనే వివరాలు మీకోసం..

నేటి ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యాక... ఏంటి ఇది? బజ్ ఇంటర్వ్యూ బిగ్ బాస్ హౌస్‌లోనే జరగబోతోందా? అనే సందేహం ప్రేక్షకుల్లో కలిగింది. ఎందుకంటే.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా వారు శివాజీ బజ్ ఇంటర్య్వూకు వెళ్లాల్సిందే. అక్కడ కంటెస్టెంట్లను తనదైన శైలిలో శివాజీ ఉతికి ఆరేస్తాడు. కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తాడు. అలాంటి శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం షాక్ గా మారింది. ఆ సీన్ చూస్తుంటే టీఆర్పీ రికార్డులు బద్దలు కావడం ఖాయమని బిగ్ బాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ప్రోమోలో ఏం చూపించారు అంటే... చిరునామా సాంగ్‌తో ప్రారంభమైంది. ఆ సాంగ్ ప్లే అవుతుండగా హౌస్‌లోకి నటి లయ, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి ఇమ్మాన్యుయేల్ వెల్కమ్ చెప్పగా... సంజన, తనూజ కూడా సరదాగా మాట్లాడారు. ఇంతలో సీక్రెట్ రూమ్ నుంచి ఒక్కసారిగా శివాజీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది చూసిన కంటెస్టెంట్స్ షాక్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ లభించింది.
హౌస్‌లోకి వచ్చిన శివాజీ... డిమాన్ పవన్‌ను చూసి "పాపం..." అంటూ దగ్గరికి తీసుకుని ఫన్నీ కామెంట్స్ చేశాడు. 'చిలకో చోట, గోరింక ఓ చోట ఉంది'అంటూ సెటైర్లు వేయడంతో హౌస్ అంతా నవ్వులతో మారుమోగింది. శివాజీ మెమరీస్ గుర్తొస్తున్నాయేమో అంటూ లయ కూడా సరదాగా కామెంట్ చేయడం మరో హైలైట్‌గా మారింది.
శివాజీ, లయ కలిసి గతంలో వైరల్ అయిన రీతూ- డీమన్ సీన్స్‌ను రీక్రియేట్ చేశారు. లయ వంట చేస్తుండగా... 'ఏమైంది అలా ఉన్నావ్?'అంటూ శివాజీ అడగడం, 'నేను కట్ చేస్తున్నాను కదా' అంటూ లయ రిప్లై ఇవ్వడం... ఆ తర్వాత యాపిల్ ఇచ్చి బుజ్జగించే సీన్ మొత్తం హౌస్‌లో నవ్వుల పువ్వులు పూయించింది. 'సేమ్ ఇలానే చేస్తాడు'అంటూ కంటెస్టెంట్స్ నవ్వుకోవడం, పవన్ సిగ్గుపడటం... అన్నీ కలిసి ఈ ఎపిసోడ్‌ను స్పెషల్‌గా మార్చేశాయి.
చివరగా అందరూ కలిసి 'నీతోనే డ్యాన్స్ టూ నైట్' సాంగ్‌కు డ్యాన్స్ వేయడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ హౌస్‌లోకి వెళ్లినా... ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చే ముందు శివాజీకే హోస్ట్‌గా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారింది. మొత్తం మీద... గ్రాండ్ ఫినాలే ముందు ఇలాంటి సెలబ్రిటీ ఎంట్రీలు, శివాజీ మార్క్ హ్యూమర్, బజ్ స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిస్తే... ఈ వారం బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు టీఆర్పీ రికార్డులు బద్దలు కావడం ఖాయమని చెప్పాలి. ఇక శివాజీ హౌస్ లో ఎంట్రీ ఇవ్వడంతో 'బజ్ ఇంటర్వ్యూ నిజంగానే హౌస్‌లోనే జరుగుతుందా?'అని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











