అవి నిబ్బానిబ్బి వేషాలు.. కళ్యాణ్ పడాలపై బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
తెలుగు టెలివిజన్ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా బిగ్‌బాస్ తెలుగు 9 నిలిచింది. తొలిసారి ఒక కామనర్ టైటిల్ గెలిచి రికార్డు సృష్టించడంతో ఈ సీజన్ ప్రేక్షకుల్లో మరింత గుర్తుండిపోయింది. 105 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరాటంలో కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా, సీరియల్ నటి తనూజ రన్నర్‌అప్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఫినాలే దశలో కళ్యాణ్‌కు భారీ మద్దతు లభించడానికి మరో కారణం కూడా చర్చనీయాంశమైంది. సీరియల్ నటి అయిన తనూజపై, అదే సీరియల్ బ్యాచ్‌కు చెందిన కొంతమంది బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. తనూజకు వ్యతిరేకంగా శ్రీసత్య- యష్మీ లు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల శ్రీసత్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నరంటే?
బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల.. హౌస్‌లోకి ఒక సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టిన అగ్నిపరీక్షలాంటి టాస్క్‌లను ధైర్యంగా ఎదుర్కొని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ప్రతి వారం తన ఆటతీరుతో ఓటర్లను ఆకట్టుకుంటూ, చివరకు టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. విజయం అనంతరం కళ్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంతదూరం వచ్చాను. హౌస్‌లో ఉన్నప్పుడు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పలు ఈవెంట్స్, టీవీ షోల్లో పాల్గొంటు తన ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే.. ఇటీవల కొత్తగా తన యూట్యూబ్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తన వీడియోలతో ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

ఇదిలాఉంటే.. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తనకు సపోర్టుగా నిలిచిన బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్యకు కళ్యాణ్ పడాల షాక్ ఇచ్చారంట. తనకు బహిరంగంగా మద్దతు ఇచ్చిన శ్రీసత్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారంట. ఈ విషయం చర్చనీయంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? తనకు సపోర్టుగా నిలిచిన శ్రీ సత్యను ఎందుకు అన్ ఫాలో చేశారు. అనే విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీసత్య స్పష్టత ఇచ్చింది.
కళ్యాణ్ అన్‌ఫాలోపై శ్రీసత్య క్లారిటీ
ఇంటర్వ్యూలో యాంకర్ శివ 'కళ్యాణ్ పడాల మిమ్మల్ని అన్‌ఫాలో చేశారట... దానికి కారణం ఏంటి?'అని ప్రశ్నించగా, శ్రీసత్య చాలా కూల్‌గా స్పందించింది. 'అది వాళ్లకి సంబంధించిన విషయం. ఫాలో-అన్‌ఫాలో అనేవి నిబ్బానిబ్బి పనులు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేస్తే ఏంటి, అన్‌ఫాలో చేస్తే ఏంటి? అసలు అతనికి ఏమైందో నాకు కూడా తెలియదు. ప్రతి ఒక్కరికీ వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. నిజం చెప్పాలంటే, అతను ఎవరో కూడా నాకు ముందుగా తెలియదు. బయట కూడా నేను అతన్ని కలవలేదు' అని చెప్పింది. అయితే తన మద్దతుపై మాత్రం స్పష్టత ఇచ్చింది.'విన్నర్ రేసులో కళ్యాణ్ డిజర్వింగ్ పర్సన్ అనిపించాడు కాబట్టే మేము సపోర్ట్ చేశాం. అంతకు మించి ఎలాంటి అజెండా లేదు'అని శ్రీసత్య క్లియర్‌గా పేర్కొంది.
తనూజ పీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు
అదే ఇంటర్వ్యూలో తనూజతో జరిగిన కాంట్రవర్శీపై కూడా శ్రీసత్య ఓపెన్‌గా మాట్లాడింది. 'బిగ్‌బాస్ 9లో నేను మొదటి నుంచీ ఇమ్మానుయేల్‌కి సపోర్ట్ చేశా. అప్పుడే నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. మొదట లైట్‌గా తీసుకున్నా... కానీ అది రోజు రోజుకీ పెరిగిపోయింది. ఫ్యామిలీని కూడా వదల్లేదు'అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను, యష్మీ కలిసి చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ కూడా అదే నేపథ్యమని చెప్పింది. 'శ్రీజ రీఎంట్రీ ఇవ్వడం నాకు నచ్చింది. ఆమె వీడియో కింద ఫైర్ సింబల్ కామెంట్ పెట్టా. దానికీ నన్ను బూతులు తిట్టారు. ప్రతి చిన్న విషయానికీ దూషించడం నాకు అస్సలు నచ్చలేదు' అని చెప్పింది.
'పెయిడ్ పీఆర్ వాళ్లు డబ్బులు తీసుకుని పని చేయడం ఓకే. కానీ ఒక లైన్ క్రాస్ చేసి తిట్టారు. ఫ్యామిలీ వరకు తీసుకెళ్లారు. అప్పుడు మేమెందుకు ఊరుకోవాలి? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కావాలంటే ఎన్ని చెత్త కామెంట్లు చేశారో చూపిస్తా. పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాం' అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఇమ్మానుయేల్‌కు మొదట మద్దతు ఇచ్చానని, కానీ ఆడియన్స్ నుంచి అతనికి తగిన స్థాయి సపోర్ట్ రాకపోవడంతో పరిస్థితి మారిందని శ్రీసత్య చెప్పింది. 'నాపై పెయిడ్ పీఆర్ దాడి ఎక్కువైపోయింది. అది తట్టుకోలేక చివరకు కళ్యాణ్‌ని సపోర్ట్ చేశా. ఇది కూడా నేను అప్పుడే క్లియర్‌గా చెప్పాను'అని వివరించింది.


Click it and Unblock the Notifications











