బిగ్ బాస్ శ్రీజకు మరో అన్యాయం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తున్న పేర్లలో దమ్ము శ్రీజ ఒకటి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కామనర్‌గా అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే.. శ్రీజకు ఈ సీజన్‌లో వరుసగా అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అప్పుడూ అలా... ఇప్పుడూ ఇలా... అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

అగ్నిపరీక్ష నుంచి హౌస్ వరకు
బిగ్ బాస్ 9 కోసం ఏకంగా 20 వేల మంది దరఖాస్తు చేయగా, పలు దశల ఎంపికల తర్వాత 45 మందిని షార్ట్‌లిస్ట్ చేసి 'అగ్నిపరీక్ష' అనే మినీ షో నిర్వహించారు. ఆ షోలో సత్తా చాటిన ఆరుగురు కామనర్స్‌లో శ్రీజ ఒకరు. తొలి రోజే యాంకర్ శ్రీముఖి ని తన లాజిక్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేలా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రెండు మూడు వారాల్లో ఆమె మాటతీరు కొందరికి నచ్చకపోయినా, క్రమంగా తన ఆటను మార్చుకుని 'ఆడపులి' అనే ఇమేజ్ సంపాదించుకుంది.

Bigg Boss Telugu 9 Srija Dammu s Bad Luck Continues With BB Jodi 2 Elimination

షాకింగ్ ఎలిమినేషన్
శ్రీజ ఫైనల్స్ దాకా వెళ్లే కంటెస్టెంట్ అని చాలా మంది భావించిన సమయంలో, కానీ, ఎవరూ ఊహించిన విధంగా ఐదో వారంలో ఆమె ఎలిమినేషన్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ముఖ్యంగా ఆమె ఎలిమినేషన్ కావడం 'అన్ ఫెయిర్" అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆడియన్స్ ఓటింగ్ కంటే మ్యానేజ్‌మెంట్ నిర్ణయాలే కారణమన్న టాక్ కూడా వినిపించింది.

హౌస్‌లో ఆట ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో, ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి తీసుకున్నారు. అందులో భాగంగా శ్రీజ రీ - ఎంట్రీ ఇచ్చారు. అయితే.. అక్కడ కూడా అన్యాయమే జరిగింది. కేవలం ఒక వారంలోనే తిరిగి ఎలిమినేట్ చేశారు. ఈ సమయంలో నటుడు భరణిని కాపాడేందుకు శ్రీజను ఎలిమినేట్ చేశారనే టాక్.ఈ సమయంలో కూడా ఆమె అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

BB జోడి 2లోనూ బ్యాడ్ లక్
బిగ్ బాస్ 9 ముగిసిన తర్వాత స్టార్ మా ఛానల్‌లో ప్రారంభమైన బీబీ జోడి సీజన్ 2 లో కూడా శ్రీజకు అదృష్టం కలిసి రాలేదని అభిమానులు అంటున్నారు. షో ఫార్మాట్ ప్రకారం రెండు వారాలకు ఒకసారి ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ ద్వారా ఎలిమినేషన్ జరుగుతుంది. ఆర్జే చైతుతో జోడీగా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ, తక్కువ సమయంలోనే ఫేస్ ఆఫ్‌కు వెళ్లి ఎలిమినేట్ అయినట్టు సమాచారం. కేవలం రెండు వారాల్లోనే బయటకు వెళ్లడం ఆమెకు మరో దెబ్బగా మారింది.

అభిమానుల ఆవేదన
బిగ్ బాస్‌లో ఆడియన్స్ ఓటింగ్‌తో కాకుండా ఎలిమినేట్ అవ్వడం, ఇప్పుడు డ్యాన్స్ షోలోనూ తొందరగా బయటకు రావడం.. ఇవన్నీ చూసి 'శ్రీజకు బ్యాడ్ లక్ మామూలుగా లేదు' అని అభిమానులు అంటున్నారు. టాలెంట్ ఉన్నా సరే సరైన టైమింగ్, అదృష్టం కలిసి రాకపోవడమే ఆమెకు ఇబ్బంది పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీజకు నిజమైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో, అదృష్ట రేఖ ఎప్పుడు మారుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X