Bigg Boss 9 Telugu: సీజన్​ 9లో సూట్​ కేస్ అందుకున్నది ఎవరు? ఫ్రైజ్ మనీ ఎంత?

Bigg Boss Telugu 9 Suitcase Twist: అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 10న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఎన్నడూ చూడని ట్విస్టులు, ఎమోషనల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రాండ్ ఫినాలేకు చేరుకునే సరికి 'ఈసారి టైటిల్ ఎవరి చేతికి వెళ్తుంది?' అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఫినాలే వేదికపై మరోసారి సూట్‌కేస్ ఆఫర్ సంచలనంగా మారింది. సీజన్​ 9లో సూట్​ కేస్ అందుకున్నది ఎవరు? ఫ్రైజ్ మనీ ఎంత?

సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్లుగా తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సంజన నిలిచారు. ముందుగా సంజన ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత నవ్వుల రారాజుగా పేరు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్ అనూహ్యంగా నాలుగో స్థానంతో బయటకు వెళ్లాడు. దీంతో ఫైనల్ టాప్ 3గా కళ్యాణ్ పడాల, తనుజ పుట్ట స్వామి, డీమాన్ పవన్ మిగిలారు. టాప్ 3లో ఉన్నవారిలో ఒకరిని ఎలిమినేట్ చేయడంతో పాటు సూట్‌కేస్ ఆఫర్ ఇవ్వాలని బిగ్ బాస్ టీమ్ నిర్ణయించింది.

Bigg Boss Telugu 9 Suitcase Twist Demon Pavan Takes 15 Lakhs and Exits Grand Finale Race

ఈ ట్విస్టును మరింత రసవత్తరంగా మార్చేందుకు మాస్ మహారాజు, హీరో రవితేజ ను రంగంలోకి దించారు. మాస్ మహారాజా తనదైన స్టైల్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తన కామెడీ టైమింగ్‌తో కంటెస్టెంట్లను ఎంటర్‌టైన్ చేశారు. అనంతరం తాను వచ్చిన అసలు పని ఏంటో చెప్పి... చేతిలో ఉన్న సూట్‌కేస్ ఆఫర్లను చూపించారు. మొదటగా రవితేజ తన దగ్గర ఉన్న సిల్వర్ సూట్‌కేస్‌లో రూ.5 లక్షలు ఉన్నాయని ప్రకటించి, "ముగ్గురిలో ఎవరు తీసుకుంటారు?" అని ప్రశ్నించారు. ముగ్గురు కంటెస్టెంట్లు ఏకగ్రీవంగా 'నో' చెప్పారు.

దీంతో ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఈ దశలో కూడా కళ్యాణ్ పడాల, తనుజ స్పష్టంగా నో చెప్పగా... డీమాన్ పవన్ మాత్రం కాస్త తడబడ్డాడు. ప్రైజ్ మనీ ఇంకాస్త పెరిగే అవకాశం ఉందా అని అడగగా, లేదని చెప్పడంతో గేమ్ కొనసాగిస్తానని ప్రకటించాడు. అయితే ఇక్కడే మరో ట్విస్టు. హోస్ట్ నాగార్జున (Nagarjuna) రంగంలోకి దిగారు. 'ఇలా అయితే వర్కౌట్ కాదు'అంటూ ప్రైజ్ మనీని ఏకంగా రూ.15 లక్షలకు పెంచారు. ఈ ఆఫర్ ముగ్గురికీ వర్తిస్తుందని ప్రకటించారు.

రూ.15 లక్షల ఆఫర్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత డీమాన్ పవన్ ఆ సూట్‌కేస్ ఆఫర్‌ను అంగీకరించాడు. దీంతో ఎవరూ ఊహించని విధంగా డీమాన్ పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈ నిర్ణయం ప్రేక్షకులను షాక్‌కు గురిచేయడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇలా సూట్‌కేస్ ఆఫర్‌తో డీమాన్ పవన్ ఎలిమినేషన్ బిగ్ బాస్ తెలుగు 9 ఫినాలేకు మాస్ ట్విస్టుగా మారింది. ఒకవైపు టైటిల్ రేస్ ఉత్కంఠగా కొనసాగుతుండగా, మరోవైపు భారీ ప్రైజ్ మనీతో కంటెస్టెంట్ బయటకు రావడం షోకు మరింత హైప్ తీసుకొచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సూట్‌కేస్ ఎపిసోడ్ మరోసారి సంచలనంగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X