Bigg Boss Telugu 9: బిగ్ బాస్ నుంచి సుమన్ శెట్టి అవుట్.. రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరిదశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ షోకు మరో వారం రోజుల్లో ఎండ్ కార్డు పడునున్నది. ఇప్పటివరకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఆసక్తి కొనసాగుతుండగా, ప్రస్తుతం అసలు చర్చంతా విజేత ఎవరు? అనే దానిపైనే నడుస్తోంది. మొదట టైటిల్ రేస్‌లో కళ్యాణ్, తనూజలు ముందున్నట్లు కనిపించినా, ఈ వారం ఆట తీరుతో ఇమ్మాన్యుయేల్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించిన విధంగా సుమన్ శెట్టి ఎలిమినేషన్ జరిగింది. ఈ తరుణంలో సుమన్ శెట్టి రెమ్యూనరేషన్ చర్చకు దారి తీసింది. ఇంతకీ ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేకు చేరువవుతున్న వేళ, ఊహించని పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేషన్ హాట్ టాపిక్‌గా మారింది. గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా, 14 వారాల పాటు హౌస్‌లో కొనసాగడం, అలాగే అతడు అందుకున్న భారీ రెమ్యూనరేషన్ ఇప్పుడు ప్రేక్షకుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచే సుమన్ శెట్టి గేమ్‌పై మిక్సడ్ అభిప్రాయాలు వచ్చాయి. టాస్కుల్లో పెద్దగా మెరవకపోయినా, తన అమాయకత్వం, మంచితనం, ఇతర కంటెస్టెంట్స్‌లా కన్నింగ్ వ్యూహాలు లేకపోవడం వల్ల ప్రేక్షకుల సింపతీతో ముందుకు సాగారు.

అయితే, గత వారం రీతూ చౌదరిని ఎలిమినేట్ చేసినప్పటి నుంచి సుమన్ శెట్టి కొనసాగించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టాప్ 5కి అర్హత ఉన్న రీతూను బయటకు పంపి, సుమన్‌ను కొనసాగించడం ఏంటన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ అసంతృప్తికి చెక్ పెట్టాడానికీ, అలాగే ఓటింగ్ పరంగా కూడా వెనకబడటంతో ఈ వారం అతడు ఎలిమినేట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సుమన్ శెట్టి ఎలిమినేషన్ కంటే కూడా ఇప్పుడు అతడి రెమ్యూనరేషన్ ఎక్కువగా చర్చకు వస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. సుమన్ శెట్టికి రోజుకు రూ.45 వేల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. 14 వారాలు హౌస్‌లో కొనసాగడంతో అతడు దాదాపు రూ.44 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్‌లలో ఒకటి అని చెప్పవచ్చు.
గతంలో యాంకర్ రవి తర్వాత, అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్‌గా సుమన్ శెట్టి పేరు వినిపిస్తోంది. గేమ్‌లో పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా, ఆడుతూ పాడుతూ 14 వారాలు కొనసాగి ఇంత మొత్తాన్ని సంపాదించడమే నిజంగా పెద్ద విషయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇది అదృష్టం అంటుంటే, మరికొందరు ఇది షో వ్యూహమేనని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. సుమన్ శెట్టి ఎలిమినేషన్‌తో టాప్ 5 రేస్ మరింత హీట్ ఎక్కింది. ఇప్పుడు టైటిల్ పోటీ ప్రధానంగా తనూజా, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్యనే సాగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశమున్నట్టు టాక్ నడుస్తోంది. ఇలా జరిగితే.. డిమోన్ పవన్ లేదా సంజనలో ఎవరో ఒకరు కూడా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం నడుస్తోంది. ఇలా మొత్తంగా సుమన్ శెట్టి ఎలిమినేషన్‌తో పాటు అతడు అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











