బిగ్‌బాస్ ఫైర్‌బ్రాండ్ తనూజ పుట్టస్వామిపై ఫ్యాన్స్ ఆగ్రహం... కరెక్ట్ కాదంటూ

బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని చివరి వరకు విజేతగా నిలిచేందుకు పోరాడారు తనూజ పుట్టస్వామి. ఏ గ్రూప్‌లోనూ ఉండకుండ తనకు తానుగా ఆడి బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆడపులిగా, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు తనూజ పుట్టస్వామి. అంతకుముందే తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ రానీ గుర్తింపును, ఫాలోయింగ్‌ను బిగ్‌బాస్‌తో సొంతం చేసుకున్నారు తనూజ. మా కుటుంబంలో ఒక అమ్మాయిగా, మన బిడ్డగా ఆడియన్స్ ఆమెను ట్రీట్‌ చేశారు.

వెండితెర నుంచి బుల్లితెరకు
కర్ణాటకకు చెందిన తనూజ ... తొలుత కన్నడంలోనే పలు సినిమాలు, సీరియల్స్ చేశారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన తనూజ.. తన అందం, ప్రతిభతో అవకాశాలు దక్కించుకున్నారు. తొలుత అందాల రాక్షసిలో నటించిన తనూజకు ముద్ద మందారం మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్, షోలలో నటించిన తనూజ అనూహ్యంగా గతేడాది తెలుగు బిగ్‌బాస్ 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది.

Bigg Boss Telugu 9 Thanuja Puttaswamy Emerges as the People s Winner Fans Troll Her Over Lack of Social

ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్
రావడం రావడంతోనే నాగార్జునకు బిర్యానీ వండుకుని తెచ్చి మంచి మార్కులు కొట్టేసింది తనూజ. తొలుత హౌస్‌లో అందరితో కలిసిపోతూ తన మార్క్ చూపించింది. తొలివారంలో నామినేషన్స్‌లో నిలిచిన తనూజ అప్పుడే తన సత్తా చాటింది. ఓటింగ్‌లో ఎవ్వరూ అందుకోని విధంగా టాప్‌లోకి దూసుకొచ్చింది. గేమ్స్, టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటింది. మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా సాంప్రదాయ బద్ధమైన దుస్తుల్లో నటించడం కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దక్కేలా చేసింది. తనను ట్రాప్ చేయాలని ఎంతమంది ట్రై చేసినా ఎవ్వరినీ పట్టించుకోకుండా గేమ్ ఆడింది. ఎప్పుడు చూసినా డల్‌గా, ఏడుస్తూ కనిపించి సింపతి కొట్టేసింది.

షోను భుజాలపై నడిపిన తనూజ
సంజన గల్రానీని తిరిగి హౌస్‌లోకి తీసుకురావడానికి తనకు ఎంతో ఇష్టమైన కాఫీని కూడా త్యాగం చేసింది. అందరి మీద ప్రేమ చూపిస్తూనే, తనకు ఎవరూ అక్కర్లేదు అన్నట్లుుగ గేమ్ ఆడటంతో ఆమె మనస్తత్వం అర్ధం కాలేదు. ఓటింగ్‌లో అగ్రస్థానం, ప్రేక్షకుల మద్థతుతో బిగ్‌బాస్ తెలుగు 9 కప్ ఈసారి తనూజ గెలుస్తుందని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా దూసుకురావడంతో లెక్కలు తారుమారు అయ్యాయి. చివరికి నాగార్జున స్వయంగా వచ్చి 20 లక్షల రూపాయలు ఆఫర్ చేసినా నో చెప్పి.. మంచి మార్కులు వేయించుకుంది తనూజ. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్‌బాస్ షో తెలుగు 9 విజేతగా కళ్యాణ్ నిలిచినప్పటికీ నిజమైన విన్నర్ తానేనని నిరూపించుకుంది తనూజ.

ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న తనూజ
దాదాపు 3 నెలల పాటు కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉన్న తనూజ అందరితో గడుపుతోంది. తిరిగి తన రెగ్యులర్ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్టార్ మాలో సంక్రాంతి స్పెషల్ షోకు హాజరైంది. త్వరలోనే తన సీరియల్స్, ఇతర కార్యక్రమాలలో బిజీ కానున్నారు. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత అభిమానులు కలవాలని తనూజ ప్లాన్ చేశారు. ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో పోలీసులు ఇందుకు అనుమతి నిరాకరించారు. దాంతో మరోసారి మిమ్మల్ని కలుస్తాను అంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు.

తనూజపై ఫ్యాన్స్ సీరియస్
అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తనూజ ఈ మధ్య అంతగా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన పోకిరి సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే సరదా సంభాషణను ఉపయోగించి తనూజను ట్రోల్ చేస్తన్నారు. దీనిని తనూజ స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో వస్తావ్ ఇన్‌స్టాలో 4, 5 స్టోరీలు షేర్ చేస్తావ్.. లేదా ఫెస్టివల్‌ కి ఒక స్టోరీ పెట్టేసి వెళ్లిపోతావ్.. ఏం అప్‌డేట్ ఇచ్చావ్? బిగ్‌బాస్ అయిపోయింది.. ఫ్యాన్స్ కి ఒక అప్‌డేట్ ఇద్దాం.. కనీసం ఫోటోషూట్ అయినా చేద్దాం. కనీసం నీ రీల్స్ అయినా షేర్ చేశావా? లేదు. స్టోరీలు స్టోరీలు ట్రైన్ బోగీలాగా షేర్ చేస్తావ్. ఏ రోజైనా షేర్ చేసావా నీ రీల్స్ అంటూ కింద స్క్రోలింగ్ మాదిరిగా వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇప్పటికైనా తనూజ తన అభిమానులను పట్టించుకుంటారో? లేదో? చూడాలి.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 thanuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X