బిగ్‌బాస్ తనూజకు మాధురి సర్‌ప్రైజ్.. ఇంతకీ ఆ స్పెషల్ గిప్ట్ ఏంటో తెలుసా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి తనూజ పుట్టస్వామి. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే. సీరియల్ నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ రియాలిటీ షోలో తన ఆటతీరు, తన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. షో ప్రారంభం నుంచే తనదైన స్ట్రాటజీతో ముందుకు సాగుతూ బలమైన కంటెస్టెంట్‌గా నిలిచింది. చాలామంది ఆమెనే ఈ సీజన్ విజేత అవుతుందని భావించినప్పటికీ చివరికి పడాల కళ్యాణ్ విన్నర్‌గా నిలవగా, తనూజ రన్నరప్‌గా నిలిచింది. అయితే, కానీ, అభిమానుల దృష్టిలో మాత్రం 'రియల్ విన్నర్'గా నిలిచింది.
కన్నడకు చెందిన తనూజ పుట్టస్వామి తెలుగులో 'ముద్దమందారం'సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. తన సహజమైన నటన, భావ వ్యక్తీకరణతో బుల్లితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ గుర్తింపే ఆమెకు బిగ్‌బాస్ వంటి పెద్ద రియాలిటీ షోలో అవకాశం తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న సమయంలో తనూజకు అనేక మంది స్నేహితులు ఏర్పడ్డారు.

వారిలో ముఖ్యంగా దివ్వెల మాధురితో ఏర్పడిన స్నేహం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వచ్చినప్పుడు మొదట తనూజపై తీవ్ర విమర్శలు చేసింది. ఇద్దరి మధ్య కొంత ఉద్రిక్తత కూడా కనిపించింది. అయితే రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మారిపోయింది. వారిద్దరూ త్వరలోనే మంచి స్నేహితులుగా మారిపోయారు. మాధురి వ్యక్తిత్వాన్ని చూసి మొదట కొంచెం భయపడ్డ తనూజ, తర్వాత ఆమెను ప్రేమగా 'మ్యాడీ' అని పిలవడం ప్రారంభించింది. అప్పటి నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. హౌస్‌లో ఉన్నంత కాలం ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచారు.
తనూజ బర్త్‌డే సెలబ్రేషన్
మార్చి 5న తనూజ తన 30వ పుట్టినరోజు జరుపుకుంది. ఇది బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే కావడంతో అభిమానులకు కూడా ప్రత్యేకంగా మారింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ప్రత్యేక రోజును మరింత స్పెషల్‌గా మార్చేందుకు దివ్వెల మాధురి తనూజకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తనతో కలిసి కేక్ కట్ చేయించి చిన్న బర్త్‌డే సెలబ్రేషన్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా తనూజకు చీర గాజులు ధరింపజేసి ఆశీర్వదించినట్టుగా ప్రేమగా చూసుకుంది.
బంగారు చెవికమ్మలు బహుమతి
ఈ సందర్భంగా మాధురి తనూజకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఆమెకు బంగారు చెవికమ్మలు బహుమతిగా అందించింది. ఈ సర్‌ప్రైజ్ చూసి తనూజ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జరిగిన బర్త్‌డే సెలబ్రేషన్ వీడియోను మాధురి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ వీడియోతో పాటు మాధురి ఎంతో భావోద్వేగంగా ఒక మెసేజ్ కూడా రాసింది. 'హ్యాపీ బర్త్‌డే బంగారం... మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇది. నువ్వు నేరుగా స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతలా ఉన్నావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను' అంటూ ఆమె రాసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్‌కు స్పందించిన తనూజ కూడా 'థ్యాంక్యూ మ్యాడీ' అంటూ కామెంట్ పెట్టింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తనూజ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో పాటు దివ్వెల మాధురి కూడా వెళ్లినట్లు సమాచారం. తిరుమల దర్శనం అనంతరం వారు బర్త్‌డే సెలబ్రేషన్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు తనూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, మరికొందరు బిగ్‌బాస్ హౌస్‌లో గొడవపడిన ఈ ఇద్దరు బయట ఇలా క్లోజ్‌గా ఉండటం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్‌బాస్ తర్వాత కెరీర్
బిగ్‌బాస్ షో తర్వాత తనూజకు మరింత పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆమె పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది. అయితే కొత్త సీరియల్స్ లేదా సినిమాలకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదని సమాచారం. మొత్తానికి తనూజ పుట్టినరోజు సందర్భంగా మాధురి ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











