Thanuja: దయచేసి ఆపేయండి.. ఇది ఒక్కరి జీవితం.. తనూజ ఎమోషనల్..
బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్‌లో చిచ్చరపిడుగు, నెటిజన్ల దృష్టిలో డ్రామా క్వీన్, హౌస్‌మేట్స్‌కు చీటికీ మాటికీ చికాకు తెప్పించే అమ్మాయి... ఇలా తనూజ పుట్టస్వామికి ఎన్నో ట్యాగ్‌లు వచ్చాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి, తన ఆటపై మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టి 105 రోజుల పాటు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో నిలిచింది. విన్నర్ తానే అవుతానన్న నమ్మకంతో ఫినాలే వరకు వచ్చి, చివరి క్షణంలో రన్నర్‌గా నిలిచింది. విన్నర్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తనూజ, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ ఎమోషనల్‌గా మాట్లాడింది.
స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న ఘనంగా జరిగింది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్‌లో కామన్‌మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 23 ఏళ్ల వయసులోనే బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలి నాన్-సెలబ్రిటీ విన్నర్‌గా నిలవడం విశేషంగా మారింది. రన్నరప్‌గా నటి తనూజ పుట్టస్వామి నిలిచింది.
ఫినాలేలో టాప్-5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, డెమన్ పవన్, ఎమ్మాన్యువల్, సంజనా గల్రానీ తలపడ్డారు. డిమాన్ పవన్ రూ.15 లక్షల క్యాష్ బ్రీఫ్‌కేస్ తీసుకుని సెకండ్ రన్నరప్‌గా నిష్క్రమించగా, ఫైనల్ పోరు కళ్యాణ్-తనూజ మధ్యే జరిగింది. చివరకు కళ్యాణ్ ట్రోఫీతో పాటు రూ.35 లక్షల నగదు, మారుతి సుజుకి విక్టోరియస్ కారు గెలుచుకున్నాడు.

అయితే.. బిగ్ బాస్ షో సమయంలో కళ్యాణ్-తనూజ మధ్య స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది. ఫినాలే స్టేజ్‌పై కళ్యాణ్, తనూజను "లేడీ క్వీన్" అని పిలిచి, తన గెలుపుకు ఆమె ఇచ్చిన సపోర్ట్‌ను గుర్తు చేసుకున్నాడు. తనూజ కూడా కళ్యాణ్‌ను హృదయపూర్వకంగా అభినందించింది. అయితే ఫినాలే అనంతరం సోషల్ మీడియాలో ఇరువురు అభిమానుల మధ్య తీవ్రమైన ఫ్యాన్ వార్ మొదలైంది. మీమ్స్, నెగటివ్ కామెంట్స్, వ్యక్తిగత విమర్శలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితిపై ముందుగా కళ్యాణ్ పడాల స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. తనూజపై నెగటివిటీ ఆపాలని, ఆమె తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని చెబుతూ అభిమానులను శాంతింపజేశాడు.
తాజాగా తనూజ పుట్టస్వామి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడింది. "మనల్ని ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో వాళ్ల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ నన్ను ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు, కొద్దిమంది చేసే నెగటివ్ కామెంట్స్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?' అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు, కళ్యాణ్‌ను ఉద్దేశించి జరుగుతున్న ట్రోలింగ్‌పై తనూజ మరింత ఎమోషనల్‌గా స్పందించింది. 'ప్లీజ్ దయచేసి ఆపేయండి. ఇలాంటి నెగటివిటీకి ఇప్పుడే చెక్ పెట్టండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు... కళ్యాణ్ గురించి. ఇది ఆయన కెరీర్. ఇప్పుడే ఆయన కెరీర్ స్టార్ట్ అవుతోంది. వీలైతే మనం సహాయం చేద్దాం. చేయలేకపోతే పర్వాలేదు కానీ విమర్శించడం ఆపేయండి. ఇది ఒకరి జీవితం" అంటూ అభిమానులను వేడుకుంది.
ఇక తాను రూ.20 లక్షల బ్రీఫ్‌కేస్ ఎందుకు తీసుకోలేదన్న చర్చలపై కూడా క్లారిటీ ఇచ్చింది. 'ఆ డబ్బు ఎవరికో చేరాల్సిందో వాళ్లకు చేరింది. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి దానిపై కూడా డిస్కషన్స్, ట్రోలింగ్స్ పెట్టకండి'అంటూ కోరింది. ప్రస్తుతం తనూజ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవైపు ఆమెకు మద్దతుగా కామెంట్స్ వస్తుండగా, మరోవైపు ఫ్యాన్ వార్ క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తనూజ రన్నరప్ అయినప్పటికీ, ఆమె గేమ్, పర్సనాలిటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇకపై ఇద్దరికీ మంచి అవకాశాలు రావాలని, బిగ్‌బాస్ తెలుగు అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











