Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే! టైటిల్ విన్నర్ ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Top 5 Contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. మరో మూడువారాల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు, ఎప్పుడూ చూడని టాస్కులు ఎన్నో చోటు చేసుకున్నాయి. మొత్తం 23 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో ప్రవేశించగా, ఇప్పుడు ఫైనల్‌కు చేరువగా కేవలం 9 మంది మాత్రమే మిగిలారు. ఇలా రసవత్తరంగా సాగుతున్న ఈ రియాలిటీ గేమ్ షో సోషల్ మీడియాలో హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ గామారింది. షో ఫినాలే దగ్గరపడుతుండటంతో టాప్ 5 రేసుపై ఎవరున్నారు? టైటిల్ విన్నర్ ఎవరు? రన్నప్ ఎవరు? అనే ఆసక్తి పీక్‌కు చేరుకుంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కామనర్స్ Vs సెలబ్రిటీస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రారంభమైంది. తొలుత 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్‌తో హౌస్ ఓపెన్ అయింది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌లో పోటీ మరింత తీవ్రంగా కనిపించింది. కామనర్లు తమ గేమ్‌తో హౌస్‌ను డామినేట్ చేయడంతో పాటు ప్రేక్షకుల దృష్టిలో నిలిచారు. సీజన్‌లో మిడ్ వీక్ ట్విస్టులు ఒక్కటే కాదు. గేమ్ ప్లాన్స్, అవుట్-ఆఫ్-ద-బాక్స్ టాస్కులు అన్నీ కలిసి బిగ్‌బాస్ 9ను అత్యంత ఎంటర్‌టైనింగ్ సీజన్‌లలో ఒకటిగా నిలిపాయి. ప్రేక్షకుల జోష్ ను మరింత పెంచడానికి, బిగ్‌బాస్ 5 వారం మరో ఆరుగురు సెలబ్రిటీలను వైల్డ్‌కార్డ్ రూపంలో హౌస్‌లోకి పంపాడు.

Bigg Boss Telugu 9 - Top 5 Contestants Race Heats Up Who Will Make It to the Finale

ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలతో హౌస్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. టాస్కులు, కాంట్రవర్సీలు, ఎమోషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన షోలో ఎవరి స్ట్రాటజీ సక్సెస్ అవుతాయో చూడటానికి ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ రోలర్‌కోస్టర్ ప్రయాణంలో పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటికెళ్లగా, ప్రస్తుతం కేవలం 9 మంది మాత్రమే పోటీలో నిలిచారు. ఫ్యాన్ బేస్, టాస్క్ పర్ఫార్మెన్స్, సోషల్ మీడియా బజ్ అన్ని ఇప్పుడు టాప్ 5లో ఎవరు చోటు దక్కించుకుంటారు? కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ విన్నర్ ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో పలు సోషల్ మీడియా పోల్స్, యూట్యూబ్ విశ్లేషణల ప్రకారం టాప్ 5 లిస్ట్ లో నిలిచిన అనే వివరాలు ఇలా ఉన్నాయి.

తనూజ పుట్టస్వామి
ఈ సీజన్ ప్రారంభం నుంచే ముద్దమందారం ఫేమ్ తనూజ పుట్టస్వామి ముందంజలో ఉంది. ప్రతి వారం జియో హాట్‌స్టార్ ఫ్యాన్ జోన్ ఓటింగ్‌లో ఆమె పేరు టాప్ స్థానంలో నిలుస్తోంది. ఎమోషనల్ డిప్లొమసీ, హౌస్ రిలేషన్స్ ను తనకు తగినట్టు వాడుకుంటుంది. అలాగే.. టాస్కులు ఆడే విధానం, గేమ్ స్ట్రాటజీ చాలా డిపరెంట్ గా ఉంటాయి. అయితే.. ఆమెకు రియాలిటీ షోకు తగిన ఆగ్రెషన్ లేవని విమర్శించే వారు కూడా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా.. ఈ ముద్దు గుమ్మ మాత్రం ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ తో దూసుకపోతుంది. ఇదే హవా కొనసాగిస్తే.. ఫైనల్‌లో టాప్ కంటెండర్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పవన్ కళ్యాణ్ పడాల
ఈ సీజన్‌లో మోస్ట్ ట్రాన్స్‌ఫార్మేన్స్ కంటెస్టెంట్ ఎవరంటే..పవన్ కళ్యాణ్ పడాలనే అంటారు. మొదటి 3 వారాల్లో తనలో నెగిటివ్ గా ప్రవర్తించడం, మహిళా కంటెస్టెంట్లకు వ్యతిరేకంగా వ్యవహరించడం నెట్టింట తీవ్ర విమర్శలకు గురయ్యింది. కానీ ఒక దశ తర్వాత అతను తన గేమ్ అర్థం చేసుకొని, తనని తాను మార్చుకున్నారు. పవన్ నిర్ణయాల్లో ధైర్యం, స్ట్రాటజీలలో పట్టు, కంటెస్టెంట్స్ తో మంచి బాండింగ్ ఇవన్నీ అతని ప్లస్ పాయింట్స్.. అతడు ప్రతి ఆన్ లైన్ ఓటింగ్ లో తనూజతో హోరాహోరీగా పోటీపడటం చూడవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అతడే "టైటిల్ కంటెండర్"గా చర్చ జోరుగా సాగుతోంది.

ఇమ్మాన్యుయేల్
జబర్దస్త్ కమెడియన్‌గా పేరుతెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్, హౌస్‌లో కూడా తన కామెడీ స్టైల్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కంటెస్టెంట్స్ తో చలాకీగా కలవడం, టాస్కుల్లో చురుకుదనం చూపించడం, వివాదాలకు దూరంగా ఉండటం, గొడవలను పరిష్కారం, అందరితో కలుపుగొలుగా ఉంటూ హౌస్ లో నవ్వుల పూవ్వులు పూస్తున్నాడు ఇమ్మూ. కానీ ఇదే అతనికి డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అయ్యింది. టాస్కుల్లో చురుకుగానే ఉన్నా.. అతడు అసలు రిస్క్‌లు తీసుకోలేదు,ఓపెన్ క్లాష్‌లు చేయలేదు, డేర్ మూవ్స్ చూపలేదు. అందుకే ప్రేక్షకుల దృష్టిలో అతడు "స్టేబుల్ ప్లేయర్ కానీ 'విన్నర్ మెటీరియల్' కాదు" అనే భావన తెచ్చుకున్నారు.ఫలితంగా అతడు మూడో స్థానంలో నిలిచినా టైటిల్ రేసుకు కాస్త దూరంగానే ఉన్నాడని చెప్పాలి.

భరణి శంకర్
ఈ సీజన్‌లో పెద్దన్న పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ భరణి. అలాగే.. బాండింగ్ బంధాలతో చిక్కున్న వ్యక్తి కూడా అతడే.. అందుకే అతడు తన గేమ్ ను చూపించలేకపోయాడు. దీంతో ఆరువారాలకే ఎలిమినేట్ అయ్యారు. కానీ, బీబీ ప్రేక్షకుల కోరిక మేరకు బిగ్ బాస్ టీం భరణిని రీ ఎంట్రీ పేరుతో తిరిగి హౌస్‌లో అడుగుపెట్టారు. రీ ఎంట్రీ తరువాత వచ్చి గేమ్ డైనమిక్స్ ను మార్చేశాడు. తనూజ-దివ్య, రీతూ-పవన్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌కు ఎదురుతిరగడం, టాస్కుల్లో హై ఎనర్జీ వంటి మూవ్స్ అతనికి పాజిటివ్ సెంటిమెంట్ పెంచాయి. సోషల్ మీడియాలో అతని ఆట తీరు చర్చనీయంగా మారింది. అందుకే టాప్ 5లో అతడు కూడా స్థానం సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది.

డీమోన్ పవన్
సీజన్ ప్రారంభంలో డీమోన్ పవన్ హౌస్‌కు సరైన కంటెస్టెంట్ అనిపించలేదు. కానీ మిడ్-సీజన్ తర్వాత అతని పర్మామెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. టాస్కుల్లో ఆగ్రెషన్,లాయల్టీ, గేమ్ లో లాజిక్స్ వంటివి ఆడియన్స్ నుంచి ఓట్లు సంపాదించుకునేలా చేశాయి. ముఖ్యంగా అతని స్లాంగ్ కు. అతని వాయిస్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే.. అతిశయోక్తి కాదు. అలాగే..ఈ సీజన్ లో లవర్ బాయ్ అనే పేరు కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ ప్రకారం అతడు టాప్ 5లో చోటు సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది.

వెనుకబడ్డ కంటెస్టెంట్స్..
ఇక రీతూ చౌదరి, సుమన్ శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినా స్ట్రాంగ్ ఫార్మామెన్స్ చూపించలేక పోతున్నారు. ముఖ్యంగా రీతూ స్ట్రాటజీతో గేమ్ ఆడినా .. నామినేషన్స్ తన విశ్వరూపం చూపించా.. దానిని ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఇక సుమన్ శెట్టి.. ఇతడికి కమెడియన్ ఇమేజ్ బాగుంది, కానీ టాస్కులు గెలిచే సామర్థ్యం తక్కువ. వీరిద్దరికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఇక్కడి వరకు రాగలిగారు. ఫినాలే కు ఇంకా రెండు వారాలా సమయం ఉంది కాబట్టి.. వీరి ఆట తీరు మార్పు వస్తే.. వీరు కూడా టాప్ 5 లో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.

డేంజర్ జోన్

సంజనా మొదటి వారాల్లో 'గుడ్డు వివాదం'ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా తర్వాత కన్సిస్టెన్సీ తగ్గింది. ఇక దివ్య ఫైట్స్ ఎక్కువ, స్ట్రాటజీ తక్కువ. ఇక సంజనా గల్రానీ, దివ్య నికితా ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం ఆన్ లైన్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే.. వీరిలో ఎవరో ఒకరు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుత ట్రెండ్స్, సోషల్ మీడియా పోల్స్,ఫ్యాన్ జోన్ ఓటింగ్ ప్రకారం తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, డీమోన్ పవన్ లు టాప్ 5 లో నిలిచే అవకాశం ఉండగా.. ఫీనాలే కు 3 వారాల సమయం ఉండటంతో ఈ స్థానాల్లో మార్పు కనిపించే అవకాశం ఉంది. ఇక టాప్ 5 లో ఉంటారో? ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు? అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X