Bigg Boss 9 Week 10th Nominations: బిగ్‌బాగ్‌లో నామినేషన్ రచ్చ.. 10వ వారం ఎంత మంది నామినేట్ అయ్యారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదవ వారం నామినేషన్లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రతి వారం ఒక కొత్త డ్రామా, కొత్త విభేదాలు చూసే ప్రేక్షకులకు ఈ వారం నామినేషన్లు మరింత హై ఓల్టెజ్ ఇచ్చాయి. గత వారం డబుల్ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాక్ అవ్వగా, ఈసారి ఎవరు నామినేట్ అవుతారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారన్న ఆసక్తి హౌస్ లోనూ, ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ బిగ్ బాస్ 9 తెలుగులో పదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఎలా సాగింది. ఈ నామినేషన్స్ పర్వంలో ఎవరు నామినేట్ అయ్యారు?
సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం అనగానే హీట్ ఎక్కుతుంది. అప్పటివరకు ఫ్రెండ్స్‌లా కనిపించే వారే, వెనకనుంచి వెన్నుపోటు పొడుస్తారు. చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేసే సన్నివేశాలు మామూలే కానీ, ఈసారి నామినేషన్ల తీరు మాత్రం భిన్నంగా సాగింది. ఈ వారం నామినేషన్ల కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కేవలం ఐదు నిమిషాల సమయం ఇచ్చి "మీరు నామినేట్ చేయాలనుకున్న ఒక్కరిని బలమైన కారణంతో నామినేట్ చేసి, బురద నీటిలో నిలబెట్టండి" అని సడన్ టాస్క్ ప్రకటించాడు. దీంతో హౌస్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

మొదటగా నామినేషన్ రంగంలోకి దిగింది ఇమ్మాన్యుయేల్. వచ్చి రాగానే భరణిపై విరుచుకుపడ్డాడు. భరణి ప్రతి విషయంలో భయంతో వెనక్కి తగ్గుతూ, ఫేక్ గేమ్ ఆడుతున్నాడని ఆరోపించాడు. రీ-ఎంట్రీ సమయంలో కొత్త భరణిని చూపిస్తానని చెప్పిన ఆయన, ఇప్పుడు పాత పద్ధతులకే పరిమితమైపోయారని వ్యాఖ్యానించాడు. భరణి వైఖరిపై ఇమ్మాన్యుయేల్ చేసిన ఈ కామెంట్లు హౌస్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఆ తర్వాత రీతు చౌదరి నామినేషన్ పర్వంలో దివ్యను టార్గెట్ చేసింది. దివ్య గ్రూప్ గేమ్ ఆడుతోందని, తన ఇష్టం ప్రకారం ఇతరులను కంట్రోల్ చేస్తోందని రీతు కామెంట్ చేసింది. దానికి దివ్య కూడా గట్టిగా స్పందిస్తూ "నేను గేమ్‌లో నిలబడటానికి ఆడుతున్నాను, ఎవరినీ బలవంతం చేయను, నేనెప్పుడూ గివ్ అప్ ఇవ్వను" అని ధైర్యంగా చెప్పింది. ఈ మాటలతో రీతు-దివ్య మధ్య వాగ్వాదం పెరిగి, హౌస్ వాతావరణం మరింత వేడెక్కింది.
ఇదిలా ఉండగా, మరోసారి భరణి, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇమ్మాన్యుయేల్ "నువ్వు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు?" అని ప్రశ్నించగా, భరణి "ఆ సమయంలో అదే కరెక్ట్ అనిపించింది" అని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ఇమ్మాన్యుయేల్‌ను సంతృప్తిపరచలేకపోయింది. హౌస్ లోని ఇతర కంటెస్టెంట్లు కూడా ఈ సంభాషణను గమనించి చర్చించుకోవడం ప్రారంభించారు.తరువాత గౌరవ్ గుప్తా నామినేషన్‌లో సంజనను టార్గెట్ చేశాడు. "ఎమోషనల్ డ్రామా ఎక్కువ, పర్ఫార్మెన్స్ జీరో" అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సంజన తీవ్రంగా స్పందిస్తూ "నువ్వు నా గేమ్ చూడ్డానికి వచ్చావా? నువ్వు నీ గేమ్ ఆడుకో!" అని బదులిచ్చింది. గౌరవ్ మాత్రం "నేను కెప్టెన్‌గా అన్ని విషయాలను గమనిస్తూనే ఉంటాను" అని సమాధానమిచ్చాడు. ఈ ఘర్షణ హౌస్‌లో కొత్త టెన్షన్ సృష్టించింది.
అలాగే పవన్ కూడా ఈ నామినేషన్ పర్వంలో నిఖిల్‌ను టార్గెట్ చేశాడు. దానికి నిఖిల్ స్పందిస్తూ "నాకు ఏం చేయాలో నాకు తెలుసు, నేను టాప్ 5లో నిలుస్తా" అని సవాల్ విసిరాడు. పవన్ వెంటనే "నాకు కావాల్సింది అదే.. నీలోని పవర్ బయటకు రావాలి" అంటూ రియాక్ట్ అయ్యాడు. దీంతో హౌస్ వాతావరణం తాత్కాలికంగా సాఫ్ట్‌గా మారింది కానీ, అసలైన ఉత్కంఠ మాత్రం కొనసాగింది.మొత్తానికి ఈ వారం నామినేషన్లలో భరణి, దివ్య, సంజన, నిఖిల్, రీతూ, గౌరవ్ గుప్త నామినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇలా 10 వారం నామినేషన్స్ లో మొత్తం 6 గురు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ప్రేక్షకుల ఓట్లపై ఆధారపడి ఉంది.
ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం ఈ వారం నామినేషన్లు బిగ్ బాస్ సీజన్ 9లో కీలక మలుపు తీసుకొచ్చాయి. భరణి, దివ్య, సంజన, నిఖిల్ ఈ నలుగురి మధ్య గట్టి పోటీ నెలకొంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య చర్చ ప్రారంభమైంది.ఎవరి గేమ్ బలంగా ఉందో, ఎవరు హౌస్‌లో కొనసాగగలరో అన్న ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల చేతుల్లో ఉంది. మొత్తానికి ఈ వారం నామినేషన్ల ఎపిసోడ్ పూర్తి ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి మాట, ప్రతి నామినేషన్ వెనుక ఎమోషన్ కనిపించింది. ఈ నామినేషన్‌లతో బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షో మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











