Bigg Boss 9 Telugu Week 11 Voting: మళ్లీ బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
Bigg Boss 9 Telugu Week 11 Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఇంకో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుండటంతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది. ఇక 11వ వారం నామినేషన్స్‌తో హౌస్ మొత్తం టెన్షన్‌తో నిండిపోయింది. అదే సమయంలో వరుసగా ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తుండటంతో బీబీ హౌస్..ఎమోషన్స్‌కు కేరాఫ్‌గా మారింది. ఇలా సీజన్ చివరి దశలోకి వెళ్లేకొద్దీ గేమ్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఓటింగ్‌లో సత్తా చాటేదెవరు? డేంజర్ జోన్ లో ఎవరు నిలిచారు? అనేది ఓ లూక్కేయండి.
బిగ్ బాస్ తెలుగు 9- 11వ వారం నామినేషన్స్ పూర్తిగా సినిమాటిక్ స్టైల్‌లో సాగాయి. కెప్టెన్ తనూజాకు స్పెషల్ పవర్ ఇవ్వడంతో ఆమె తనకు నచ్చిన వారికి టోకెన్లు ఇచ్చింది. చివరిలో దిష్టిబొమ్మ పగులగొట్టి నామినేషన్ చెప్పే విధానం చూస్తే.. 'ఈ గేమ్ షో పూర్తిగా స్క్రిప్టెడ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ వీక్ కలిసి రావడంతో హౌస్‌లో ఎమోషన్ డబుల్ అయ్యింది. కొందరి రియాక్షన్స్ నిజాయితీగా కనిపించగా, కొందరి యాక్టింగ్ స్పష్టంగా కనిపించిందని నెటిజన్స్ అభిప్రాయం. ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి హాట్ టార్గెట్ అయ్యింది.అయితే చివరి క్షణంలో కెప్టెన్ తనూజ రీతూను సేవ్ చేయడం ఈ వారం ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది.

ఫైనల్ గా బిగ్ బాస్ 11వ వారం నామినేషన్స్ లో ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇలా కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా. లిస్ట్ బయటకు రావడంతో అభిమానులు తమ ఫేవరెట్స్‌ను సేవ్ చేయడానికి బీబీ లవర్స్ ఆన్‌లైన్ ఓటింగ్‌లో బిజీగా పాల్గొంటున్నారు. సోమవారం నుండి ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే అభిమానులు భారీగా ఓటింగ్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారం ఓటింగ్ ప్యాటర్న్స్ భారీగా చర్చనీయమవుతున్నాయి. ఆన్‌లైన్ ట్రెండ్స్ ప్రకారం టాప్ 3 కంటెస్టెంట్స్ మొత్తం ఓట్లలో 75% ఆక్రమించారు. కళ్యాణ్ పడాల వరుసగా పలు వారాలుగా లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ వారం కూడా 32.72 శాతం ఓట్లతో దూసుకెళ్తున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ 26.65 శాతం ఓట్లతో రెండో స్థానంలో సేఫ్‌జోన్‌లోకి వచ్చారు. భరణి శంకర్ కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌తో 15.69 శాతం ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఇలా పై ముగ్గురు సేఫ్ జోన్ లో నిలిచారు.
ఇక మిగిలిన ముగ్గురు డెమోన్ పవన్ 9.47 శాతం, సంజనా 8.94 శాతం, దివ్య నిఖితా 6.53 శాతం ఓట్లు సాధించి డేంజర్ జోన్‌లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితి దివ్యకు ప్రతికూలంగా ఉండగా, సంజనా-పవన్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే కనిపిస్తోంది. అయితే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లు టెలీకాస్ట్ అవుతుండటంతో భావోద్వేగ ప్రభావం ఓటింగ్‌ను మార్చే అవకాశం ఉంది. ఎలిమినేషన్ జరుగుతుందా? సర్ప్రైజ్ ట్విస్ట్ వస్తుందా? రీతూ-డెమోన్ ట్రాక్ టర్న్ అవుతుందా? అన్న ప్రశ్నలు ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక శుక్రవారం రాత్రి 11:59 వరకు ఓటింగ్ కొనసాగుతుండటంతో చివరి నిమిషం వరకు ఓటింగ్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











