Bigg Boss Telugu 11th Week Voting: ఓటింగ్ సెన్సేషన్.. డేంజర్‌లో ముగ్గురు.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంట

Bigg Boss 9 Telugu Week 11 Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ తరుణంలో అసలు మజా మొదలైంది. ఎన్నడూ చూడని ట్విస్టులు, హై వోల్టేజ్ టాస్కులు, భావోద్వేగ క్షణాలు అన్నీ కలగలిపి ఈ సీజన్ ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. మరో నాలుగు వారాల్లో గ్రాండ్ ఫినాలే రానుండటంతో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో 11వ వారం నామినేషన్స్ హౌస్ మొత్తాన్ని టెన్షన్‌తో నింపేశాయి. సోషల్ మీడియాలో ఓటింగ్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి? ఎవరికి ఎక్కువ ఓట్లు? ఎవరికి డేంజర్ బెల్ మోగుతోంది? ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది? అనే అంశాలు అభిమానుల్లో టాక్ ఆఫ్ ది వీక్‌గా మారాయి.

అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'. ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాన్సెప్ట్‌తో భిన్నంగా మొదలైంది. ఆపై వైల్డ్ కార్డులతో గేమ్‌ను మరింత రసవత్తరంగా మార్చేశారు.ఒక ప్రతి వారం కొత్త ట్విస్ట్‌లు, రూల్స్, స్ట్రాటజీలు పరిచయం చేయడంతో సీజన్ ఐతే హుషారుగా సాగుతోంది. ఇప్పుడు సీజన్ క్లైమాక్స్ దశలోకి రావడంతో ప్రతి నామినేషన్, ప్రతి ఓటు కీలకంగా మారింది.

Bigg Boss Telugu 9 Week 11 Voting Trends Kalyan Leads Sanjana Pawan Divya in Danger Zone

ఇక 11వ వారం నామినేషన్స్ పూర్తిగా సినిమాటిక్‌గా జరిగాయి. కెప్టెన్ తనూజాకు స్పెషల్ పవర్‌ ఇచ్చారు. ఆమె టోకెన్లు పంచడం, చివర్లో దిష్టిబొమ్మ పగలగొట్టి నామినేషన్ ప్రకటించడం అన్నీ చూస్తే.. షో పూర్తిగా స్క్రిప్టెడేనా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి ప్రధాన టార్గెట్‌గా మారింది. అయితే చివరి నిమిషంలో కెప్టెన్ తనూజ ఆమెను సేవ్ చేయడం ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. చివరికి ఈ వారం నామినేట్ అయిన వారిలో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా ఉన్నారు.

ఓటింగ్ ప్రారంభమైన మొదటి రోజునుంచే అభిమానులు ఆన్‌లైన్ ఓటింగ్‌లో బిజీ అయ్యారు. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం కళ్యాణ్ పడాల మళ్లీ అద్భుతమైన ఓట్లు సాధిస్తూ టాప్‌లో కొనసాగుతున్నారు. 33.75% ఓట్లతో దూసుకెళ్తున్నారు. ఇమ్మాన్యుయేల్ 25.89% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. భరణి శంకర్ కూడా 14.6% ఓట్లతో మూడో స్థానంలో నిలిచి సేఫ్ జోన్‌లో స్థానం దక్కించుకున్నారు.

ఇక మిగిలిన ముగ్గురు డెమోన్ పవన్ 9.63 శాతం, సంజనా 9.09 శాతం, దివ్య నిఖితా 7.04 శాతం ఓట్లు సాధించి డేంజర్ జోన్‌లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఈ వారం దివ్య ఎలిమినేట్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంజనా, పవన్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే కనిపిస్తోంది. ఏదైనా ట్విస్ట్ ఇవ్వాలని బిగ్ బాస్ టీం భావిస్తే.. సంజనా లేదా పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక వేళ డిమోన్ ఎలిమినేట్ అయితే.. మాత్రం హౌస్ లో లవ్ ట్రాక్ కట్ అవుతుంది. రీతూ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది.

పైగా తాజా ఎపిసోడ్ రీతూ కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో డిమోన్ కాస్త సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి. ఒక వేళ ఎలిమినేషన్ జరిగితే.. కఖ్చితంగా సంజన, దివ్య ల మధ్యనే జరుగుతుందని తెలుస్తోంది. దివ్య కూడా నిన్న ఎపిసోడ్ లో మాట్లాడుతూ.. తాను ఎలిమినేట్ అయినా పర్వలేదు. బీబీ హౌస్ లోకి మా పెరేంట్స్ ను హౌస్ లోకి తీసుకవచ్చాను అది చాలు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఫ్యామిలీ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా? సర్ప్రైజ్ ట్విస్ట్ ఇస్తారా? అన్న ప్రశ్నలు ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ రోజు (శుక్రవారం) రాత్రి 11:59 వరకు ఓటింగ్ కొనసాగుతుండటంతో చివరి క్షణమైనా ఓటింగ్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X