Bigg Boss 12th Week Nominations: షాకింగ్ నామినేషన్స్.. భరణికి బిగ్ షాక్.. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే..

Bigg Boss 12th Week Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా కొనసాగుతోంది. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇంకో మూడు వారాల్లో ఈ సీజన్ ముగియనున్నది. ఈ నేపథ్యంలో హౌస్‌లో జరుగుతున్న ట్విస్టులు, కాంట్రవర్సీలు, కంటెస్టెంట్ల మధ్య సైకాలజికల్ వార్ ప్రేక్షకుల ఆసక్తిని పీక్‌కు తీసుకెళ్లాయి. సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్‌లో ఎవరైనా ఎలిమినేట్ అవుతారని ఊహిస్తారు. కానీ, ఈసారి బిగ్ బాస్ ఆ రూల్ ను మార్చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా హోస్ట్ నాగార్జున.. 'ఈ వారం నో ఎలిమినేషన్' అని ప్రకటించారు.ఈ నేపథ్యంలో 12వ వారంలో నామినేషన్స్ భారీ ట్విస్ట్‌తో జరిగాయి. ఎంతకీ ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున దివ్యను సేవ్ చేస్తూ 'నో ఎలిమినేషన్' అని ప్రకటించారు. ఓటింగ్ తక్కువగా వచ్చినప్పటికీ దివ్యను గేమ్‌లో కొనసాగించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. "ఎలిమినేషన్ లేకపోతే నామినేషన్లు ఎందుకు? ఓటింగ్ ఎందుకు నిర్వహించారు?" అనే ప్రశ్నిస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఇలాంటి ట్విస్టులు చాలా కామన్. గేమ్ డైనమిక్స్, TRP, కంటెంట్ పరంగా అవసరమైనప్పుడు కంటెస్టెంట్లను ఉంచడం లేదా వీక్ కంటెస్టెంట్లను బయటకు పంపడం ఈ షో నిర్వహకులకు అలవాటే.. 11వ వారంలో నో ఎలిమినేషన్ ఇచ్చి రిలాక్స్ చేసిన బిగ్ బాస్, 12వ వారంలో మాత్రం నామినేషన్ ప్రక్రియను విభిన్నంగా క్రియేట్ చేశారు.

Bigg Boss Telugu 9 Week 12 Nominations Private Votes Shocking Strategies amp amp Emotional Clashes Inside the House

ఈ వారం నామినేషన్స్‌లో అతిపెద్ద ట్విస్ట్.. రెండు దశల నామినేషన్ విధానం. ప్రతిసారి లాగా ఓపెన్ నామినేషన్ కాకుండా ఈసారి మొదటి దశను బిగ్ బాస్ ప్రైవేట్ నామినేషన్ గా నిర్వహించారు. హౌస్‌మేట్స్ ఒక్కొక్కరు డెన్‌లోకి వచ్చి, నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిపై వారి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి. అదే సమయంలో ఆ వ్యక్తి పేరును కార్డు మీద రాసి బాక్స్‌లో వేయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం కంటెస్టెంట్లు వారి అసంతృప్తిని ముందు ఆ వ్యక్తికి చెప్పకుండానే నేరుగా ప్రేక్షకుల ముందు ఉంచడం. ఇది హౌస్‌లోని సంబంధాలను బలహీనపరచి, వ్యక్తిగత భావోద్వేగాలను పెంచే స్ట్రాటజీగా కనిపించింది.

ప్రైవేట్ నామినేషన్‌లో మొదటగా ఇమాన్యుల్ అడుగుపెట్టారు. అతను డిమోన్ పవన్ ను నామినేట్ చేశాడు. పవన్ కంటెండర్‌గా వచ్చిన తర్వాత తన ఫైటింగ్ స్పిరిట్ కోల్పోయారనే అభిప్రాయం వెల్లడించాడు. "వేరే వాళ్ల కోసం ఆడుతున్నాడు, గివ్ అప్ చేశాడు" అనే కారణంతో నామినేట్ చేశారు. తదుపరి కళ్యాణ్ పడాల డెన్‌లోకి వెళ్లి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. తనకు సుమన్ మైండ్‌సెట్ అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. కెప్టెన్సీ టాస్క్‌లో తాను ఉండాలని చెప్పినప్పుడు పట్టించుకోలేదని, "గిఫ్ట్ ఇచ్చే వాళ్లను మాత్రమే పట్టించుకుంటున్నాడు" అని విమర్శించాడు.

తరువాత భరణి నామినేషన్ మాత్రం హౌస్‌లో పెద్ద షాక్ క్రియేట్ చేసింది. అతను తనుజను నామినేట్ చేశాడు. దివ్య-తనుజ గొడవను ప్రస్తావిస్తూ, తన పేరును అనవసరంగా లాగారని, అది చిన్నపిల్లల తగవులా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ఎన్నిసార్లు చెప్పినా వినలేదు" అని భరణి తన అసహనాన్ని బయటపెట్టాడు. ఆ తరువాత డిమోన్ పవన్ వచ్చి.. నేరుగా కళ్యా ణ్ ను నామినేట్ చేశాడు. గత ఏడు వారాలుగా తనకు కంటెంట్ అవకాశాలు ఇవ్వలేదని, తనను దూరం పెట్టాడని పవన్ పేర్కొన్నాడు. ఈ కారణంగా నామినేట్ చేశారు.

ఇక దివ్య నామినేషన్ మాత్రం హౌస్‌లో తుఫాన్ రేపింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె భరణిని నామినేట్ చేసింది. "నాకు అవసరం ఉన్నప్పుడు నా వైపు నిలబడలేదు, చాలా సార్లు మోసం చేశాడు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. భరణి ఆట తీరుతో తన మొరాలిటీ దెబ్బ తిన్నదని ఆమె తన భావోద్వేగానికి లోనైంది. ఈ నామినేషన్‌తో భరణి-దివ్య మధ్య ఉన్న అప్రకటిత ఉద్రిక్తత బయటపడింది.

ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ ఇన్‌పుట్స్ ప్రకారం.. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇమాన్యుల్.. డిమోన్ పవన్, సుమన్ ను కళ్యాణ్ , తనుజను భరణి,కళ్యాణ్ ను పవన్, భరణి ని దివ్య,సుమన్‌ను సంజన నామినేట్ చేశారు. అయితే కెప్టెన్ రీతు తప్ప మిగతా అందరూ నామినేషన్స్‌లో ఉండే అవకాశం ఉందనే బజ్ హౌస్‌లో వినిపిస్తోంది. ఇంకా రెండో దశ నామినేషన్స్ కూడా ఇదే రసవత్తర ధోరణిలో జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వారం ప్రారంభం నుంచే బిగ్ బాస్ గేమ్ టెంపరేచర్‌ను ఎక్కించే ప్రయత్నం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. సీజన్ చివరి దశలో కంటెస్టెంట్ల అసలు భావోద్వేగాలు బయటపడే విధంగా నామినేషన్ విధానాన్ని అమలు చేశారు. ఈ వారంలో ఎవరి ఆటతీరు ఆకట్టుకుంటుంది? ఎవరి మీద పబ్లిక్ కోపం చెలరేగుతుంది? అంటే చెప్పలేనంత ఆసక్తి పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X