Bigg Boss Telugu 14 Week Elimination: తీవ్రంగా గాయపడ్డ టాప్ కంటెస్టెంట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతడేనా?
Bigg Boss Telugu 14 Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లో టెన్షన్ రెట్టింపు అవుతోంది. ఈ వారం బిగ్ బాస్ పూర్తిగా గేమ్‌ను తారుమారు చేసేలా, ఎవ్వరూ ఊహించని తీరు లో నామినేషన్స్ రద్దు చేశారు. ప్రత్యక్ష యుద్ధం టాస్క్‌ను ప్రకటించాడు. ఈ టాస్క్‌లో ఎవరైతే టాప్ స్కోర్ సాధిస్తారో? వారు నేరుగా టాప్ 5లోకి సేఫ్‌గా వెళ్లిపోతారు. మిగతా కంటెస్టెంట్లు నేరుగా ఎలిమినేషన్‌లో ఉన్నట్లే. దీనితో బిగ్ బాస్ హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం 14 వారం ఓటింగ్ ఎలా ఉంది? ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారంటే?
ఇక గ్రాండ్ ఫినాలేకు చేరువవుతున్న కొద్దీ బిగ్‌బాస్ హౌస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నాడు చూడని భావోద్వేగాలు, వ్యూహాలు, షాకింగ్ నిర్ణయాలతో బిగ్ బాస్ హౌస్ లో హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. ఇక ఎపిసోడ్ లో సంజన, ఇమ్యూ బంధం తెగిపోయిందా? అన్నట్టుగా మారింది. సంజన ఎమోషనల్ గా 'గేమ్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్‌తో మాట్లాడతా' అంటూ, 'మమ్మీ అని పిలవట్లేదు'అని బాధపడింది. మరోవైపు తనూజా, 'భరణి గారితో ఇమ్మూ నాకోసం నిలబడ్డాడని నేనే చెప్పాను. అలాంటప్పుడు ఇప్పుడు పాయింట్స్ అడగలేను'అని కళ్యాణ్‌తో చెప్పింది. సంజన ఓటింగ్‌లో తనను తీయొద్దని ఇమ్మాన్యుయేల్‌ను అడిగినా, 'ఈ వారం అంతా తనూజా నాకు సపోర్ట్ చేసింది. ఆమెను తీయను అని మాటిచ్చాను'అంటూ ఇమ్మూ స్పష్టం చేశాడు.

భరణి తక్కువ స్కోర్ కారణంగా పోరు నుంచి తప్పుకుని, తన పాయింట్స్‌లో సగం తనూజాకు ఇవ్వడంతో గేమ్ స్వరూపం మారుతుంది. ఈ దశలో తనూజాకు 450, ఇమ్మూకి 320, సంజనాకు 320 పాయింట్స్ వచ్చాయి. తర్వాత 'కీ టూ సక్సెస్' టాస్క్‌లో సంజన ఓడిపోవడంతో ఇమ్మాన్యుయేల్‌తో గొడవకు దిగింది. నిర్ణయంపై అభ్యంతరం తెలిపినా, భరణి తన నిర్ణయాన్ని మార్చలేదు. దీంతో ఇమ్మూ 470, తనూజా 350, సంజన 320 పాయింట్స్‌కు చేరగా, చివరకు సంజన పోరు నుంచి బయటకు వెళ్లింది.
తర్వాత 'బ్యాలెన్స్ చెయ్ డ్యూడ్' టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ కాలు తీవ్ర గాయమైంది. అయినా పట్టు వదలకుండా.. పోరాడి గెలిచారు. ఈ దశలో ఇమ్మూ 520, తనూజా 450 పాయింట్స్ సాధించారు. సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరిగిన చివరి టాస్క్ 'రైజ్ ద బార్'లో తనూజా విజయం సాధించి టాప్ స్కోర్‌తో ముందంజ వేసింది. దీంతో చివరికి తనూజా 750 పాయింట్స్‌తో టాపర్‌గా నిలిచింది. కన్ఫెషన్ రూమ్‌లో బిగ్‌బాస్ ఆమెకు ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఇచ్చినా, అది ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని తెలిపారు. దీనిపై తనూజా 'ప్రజల నిర్ణయాన్నే గౌరవిస్తాను'అంటూ నామినేషన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
ఇదిలా ఉంటే.. ఇక 14వ వారం ఆన్ లైన్, సోషల్ మీడియా ఓటింగ్ లెక్కలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అన్‌ఆఫిషియల్ ట్రెండ్స్ ప్రకారం తనుజా పుట్టస్వామి 28.93 శాతం ఓట్లతో టాప్‌లో దూసుకెళ్తోంది. రెండో స్థానంలో 16.69 శాతం ఓట్లతో డిమోన్ పవన్ ఉన్నారు. టాస్కుల్లో అంతగా ప్రభావం చూపకపోయినా ఇమ్మానుయేల్ 15.73 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక సంజన కూడా ఓటింగ్ లో హోరాహోరీగా సాగుతోంది. 15.05 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ వారం భరణీ శంకర్‌కు ఓట్లు తగ్గడం పెద్ద షాక్‌గా మారింది. కేవలం 14.23 శాతం ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అతడు డేంజర్ జోన్‌లోకి నిలిచారు. ఇక 10.12 శాతం ఓట్లతో సుమన్ శెట్టి ఓటింగ్ లిస్ట్ చివరన నిలిచి, ఎలిమినేషన్‌కు ప్రధాన కాండిడేట్‌గా కనిపిస్తున్నారు. అయితే.. కొన్ని సోషల్ మీడియా విశ్లేషణలు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా జరగవచ్చనీ, ఇలా జరిగితే.. డిమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా ఇన్ పుట్స్ ప్రకారం.. సుమన్ శెట్టి లేదా డిమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











