Bigg Boss Telugu 14 Week Voting: షాకింగ్‌గా 14వ వారం ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. టాప్ 5లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో తుది దశకు చేరుకొన్నది. ఈ సీజన్ ముగియడానికి కేవలం రెండు వారాలు మాత్రమే ఉండటంతో టాప్ 5 ఎవరు ఉంటారనే విషయంపై అభిమానుల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఈ సీజన్‌లో చివరి నామినేషన్ ప్రక్రియ జరగడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ఫోకస్ ఎక్కువగానే ఉంది. గత 13 వారాలుగా ఇంటిలో తమ అస్థిత్వాన్ని చాటుకొన్న సెలబ్రిటీలను కాపాడుకోవడానికి వారి అభిమానులు రంగంలోకి దిగారు. దాంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే..

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో గత 13 వారాల్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్, 12వ వారంలో దివ్య నిఖిత, 13వ వారం రీతూ చౌదరీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 9 Week 14th Voting

ఇక 14వ వారంలో నామినేషన్ ప్రక్రియను కొనసాగించకుండానే కంటెస్టెంట్లను డైరెక్టుగా బిగ్‌బాస్ నామినేట్ చేశారు. టికెట్ టు ఫినాలే గెలుచుకొన్న కల్యాణ్ పడాలను మినహాయించి మిగితా ఆరుగురు కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దాంతో తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, సుమన్ శెట్టి నామినేషన్‌లోకి వచ్చారు. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు టాప్ 5 బెర్త్‌ను దక్కించుకొంటారనేది ఆసక్తికరంగా మారింది.

నామినేషన్ల ప్రక్రియ తర్వాత మొదలైన ఓటింగ్ ప్రక్రియ విషయానికి వస్తే.. ఈ వారం అత్యధికంగా ఓట్లు సంపాదిస్తున్న వారిలో తనూజ మొదటి స్థానంలో ఉన్నారు. పోలైన ఓట్లలో ఆమె 32 శాతానికి పైగా ఓట్లను సొంతం చేసుకొన్నారు. ఆమె తర్వాత హీరోయిన్ సంజన గల్రానీ రెండో స్థానంలో నిలిచారు.ఆమె సుమారుగా 16 శాతానికిపైగా ఓట్లను సంపాదించుకొన్నారు. ఇక మూడో స్థానంలో డీమాన్ పవన్ సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఆయనకు దాదాపు 15 శాతం ఓట్లు నమోదైనట్టు తెలుస్తున్నది.

ఇక సోషల్ మీడియాలో బలహీనంగా కనిపించే ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, సుమన్ శెట్టి ముగ్గురు చివరి స్థానాల్లో నిలిచారు. అయితే ఇమ్మాన్యుయేల్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్నందున ఆయనకు ఇతర మార్గాల ద్వారా ఓటింగ్ సంపాదించుకొనే అవకాశం ఉందనే వాదన వినిపిస్తున్నది. ఆయనక ప్రస్తుతం 14 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత సుమన్ శెట్టి 12 శాతం ఓట్లతో, భరణి శంకర్ 11 శాతం ఓట్లను సాధించి డేంజర్ జోన్‌లో ఉన్నట్టు స్పష్టమైంది. అయితే ఇంకా రెండు రోజులకుపైగా సమయం ఉండటంతో అనూహ్యంగా ఓటింగ్ ప్యాటర్న్ మారితే సర్‌ప్రైజ్ ఫలితాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సీజన్‌లో టాప్ 5 లో చోటు సంపాదించుకొనే వారిలో కల్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ పేర్లు వినిపిస్తున్నాయి. ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు చోటు చేసుకొంటే టాప్ 5 సెలబ్రిటీల స్థానాల్లో అనూహ్యమైన మార్పులు ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X