Bigg Boss 9th Week Voting: తారుమారవుతున్న ఓటింగ్.. తనుజ గ్రాఫ్ డౌన్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 9th Week Voting: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రసవత్తరంగా సాగుతోంది. ప్రతి వారం కొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ రియాలిటీ షో, 9వ వారం నాటికి మరింత ఉత్కంఠభరితంగా మారింది. సస్పెన్స్, డ్రామా, ఎమోషన్‌లతో సాగుతున్న ఈ వారం, బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్‌ల పేరుతో హౌస్‌లో కొత్త హీటు క్రియేట్ చేశారు. సీక్రెట్ టాస్క్ ల పేరుతో కంటెస్టెంట్ల మధ్య అగ్గిరాజేశారు. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 9వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు డేంజర్‌జోన్ లో నిలిచారు? అనే విషయంలోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్ 15 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు హౌస్‌లో రీతూ చౌదరి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్ పడాల, పవన్ డిమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యూయెల్, సంజన గల్రానీ, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరందరి మధ్య ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు, అలయన్సెస్, నామినేషన్స్ చుట్టూ హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా కొనసాగుతోంది.

నామినేషన్స్ ప్రక్రియ
9వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ హౌస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. తనూజ తన తండ్రిలా భావించే భరణిని నామినేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసిన కంటెస్టెంట్స్‌కి కూడా షాక్ ఇచ్చింది. ఈసారి ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీరిలో పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్‌ను విడిచిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు బయలుదేరే అవకాశముంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓటింగ్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ పడాల ప్రస్తుతం టాప్‌లో ఉన్నాడు. ఆయన 27.68 శాతం ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. గేమ్‌లో నిరంతరం యాక్టివ్‌గా ఉండడం, టాస్క్‌లలో పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల ప్రేక్షకులు ఆయనకు భారీ సపోర్ట్ ఇస్తున్నారు. రెండవ స్థానంలో తనూజ పుట్టస్వామి 20.95% ఓటింగ్‌తో నిలిచింది. ఆమె తన ప్లానింగ్, తెలివైన గేమ్‌ప్లే వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. ఇక 12.93 శాతం ఓట్లతో మూడవ స్థానంలో సంజన గల్రానీ నిలిచారు. ఆమె సైలెంట్‌గా ఆడుతున్నా, ప్రేక్షకుల వద్ద మంచి సపోర్ట్ ఉంది. ఇక భరణి చాలా స్పెషల్.. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత తన గేమ్ మొత్తం మార్చేశాడు. నో బాండింగ్ తో దూసుకపోతున్నారు. ఈ ఓటింగ్ లో 11.48 శాతం ఓట్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు.
ఇక సాయి శ్రీనివాస్ 10.82 శాతం ఓట్లు, సుమన్ శెట్టి 10.59 శాతం ఓట్లు, రాము రాథోడ్ 5.56 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ చూస్తే.. సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముఖ్యంగా సుమన్ శెట్టి ఈ వారం ఓటింగ్‌లో చివర వైపు ఉండటం షాక్ ఇచ్చింది. మొదట్లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఉన్న సుమన్, ఈ మధ్య గేమ్‌పై ఫోకస్ కోల్పోయి ఎమోషనల్‌గా మారడం వల్ల వెనుకబడినట్టు కనిపిస్తోంది. భరణి కూడా రీ ఎంట్రీ తర్వాత తన పాత స్పార్క్‌ను తిరిగిపొందుతున్నారు. ఇకరాము రాథోడ్ టాస్క్‌లలో అద్భుతంగా ఆడితే సేవ్ కావడం కష్టమేమీ కాదు.
సీక్రెట్ టాస్క్ లతో చిచ్చు
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లు హౌస్‌ను పూర్తిగా హీటెక్కించాయి. బిగ్ బాస్ మూడు టీమ్‌లను (బ్లూ, పింక్, ఆరెంజ్) ఏర్పాటు చేసి, సభ్యుల ఎంపికను కంటెస్టెంట్స్‌కే అప్పగించాడు. టాస్క్ మొదలైన వెంటనే ఊహించని ట్విస్ట్ ఇచ్చి, సుమన్ శెట్టి, దివ్యలను "రెబల్స్"గా ఎంపిక చేసి సీక్రెట్ టాస్క్‌లు అప్పగించాడు. దివ్య తన సీక్రెట్ టాస్క్‌ను సక్సెస్‌గా పూర్తి చేసి, పవన్ కళ్యాణ్‌ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించే పవర్ పొందింది. సుమన్‌తో చర్చించి పవన్‌ను ఎలిమినేట్ చేయగా, ఆయన నిరాశతో "నా బొంద.. శార్ధం!" అంటూ స్పందించాడు. తర్వాత రెబల్స్‌కి పాలు దాచమని బిగ్ బాస్ ఆదేశించగా, వారు ఎవరికీ తెలియకుండా టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఇక పవన్, రీతూ మాట్లాడకూడదనే నియమం ఉల్లంఘించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మొదటి కెప్టెన్సీ రౌండ్‌లో ఆరెంజ్ టీమ్ విజయం సాధించింది. బిగ్ బాస్ గ్రీన్ ఇమ్యూనిటీ బ్యాడ్జ్‌తో వారిని సత్కరించగా, టీమ్ సభ్యులు ఆ బ్యాడ్జ్‌ను ఇమ్మాన్యూయెల్‌కి అందజేశారు. సంజనాను ఎవరూ టీమ్‌లోకి తీసుకోకపోవడంతో ఆమెను సంచాలక్‌గా నియమించారు. పవన్ ఔట్ అయిన తర్వాత గేమ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది, ఇక 9వ వారం కెప్టెన్ ఎవరో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. అలాగే.. ఓటింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉండటంతో ఈ ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి క్షణం సస్పెన్స్‌తో నిండిపోయి, ప్రేక్షకులను టీవీకి కట్టిపడేస్తోంది. ఫైనల్‌గా ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










