Ayesha zeenath: బిగ్ షాక్.. బిగ్ బాస్ నుంచి ఆయేషా అవుట్.. అసలేం జరిగిందంటే?

Ayesha zeenath: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సస్పెన్స్, సర్‌ప్రైజ్‌లకు కొదవ లేకుండా సాగుతోంది. కామరన్స్ వర్సెస్ సెలబ్రెటీలు సాగిన ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో గేమ్ స్వరూపమే మారిపోయింది. వీరిలో దివ్వెల మాధురి, రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస్ సాయి, ఆయేషా జీనత్ లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో ఆయేషా జీనత్ ప్రత్యేకంగా నిలుస్తోంది. వైల్డ్ కార్డు ద్వారా వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిందట. అసలే జరిగింది?

బుల్లితెర ప్రేక్షకులకు ఆయేషా జీనత్ ఇప్పటికే బాగా పరిచయం. "ఊర్వశివో రాక్షసివో", "సావిత్రమ్మగారి అబ్బాయి" వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు, "కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్" షోలోనూ పాల్గొని యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆయేషా మంచి పేరు సంపాదించింది. "ఉప్పు పులి కారం" అనే వెబ్ సిరీస్‌తో పాటు "రాంబో" అనే తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆమెకు అసలైన ఫేమ్ ఇచ్చింది మాత్రం "తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6" షోనే. ఆ సీజన్‌లో వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది ఆయేషా. ఎప్పుడూ తన అల్లరి, ఉగ్ర స్వభావంతో హౌస్‌ను కుదిపేసింది. అప్పట్లో ఆమె మాజీ ప్రియుడు దేవ్ చేసిన సంచలన ఆరోపణలు కూడా పెద్ద వివాదంగా మారాయి.

Bigg Boss Telugu 9 Wild Card Contestant Ayesha zeenath Leaves the Show Due to Medical Emergency

అప్పట్లో బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ కూడా ఆయేషా కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నించారు. "నన్ను తప్పుగా చూపించొద్దు" అంటూ కమల్‌నే ఎదిరించిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండు నెలలపాటు హౌస్‌లో నిలిచిన ఆయేషా, అప్పట్లోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి, దుమ్ము రేపుతోంది. ఈ వారం నామినేషన్స్ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. కంటెస్టెంట్ ఎవరైనా సరే ఇచ్చి పడేస్తోంది. తాను ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిందంటే.. వార్ వన్ సైడ్ కావాల్సిందే అనేలా గేమ్ ఆడుతోంది.

అయితే ఆయేషా జీనత్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. షోలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయేషా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిందట. మొదట చిన్న అస్వస్థతగా భావించినా, పరిస్థితి కాస్త సీరియస్ కావడంతో బిగ్ బాస్ టీమ్ తక్షణ చర్య తీసుకుంది. వైద్యుల సలహా మేరకు ఆమెను హౌస్ నుండి బయటకు పంపించి చికిత్సకు తీసుకెళ్లినట్లు సమాచారం. హౌస్‌లోని కంటెస్టెంట్లు ఆమె వెళ్లిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. లైవ్ ఫీడ్‌లో పలువురు ఏడ్చినట్లు కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక అభిమానులు సోషల్ మీడియాలో #GetWellSoonAyesha, #AyeshaInBiggBoss9 హ్యాష్‌ట్యాగ్‌లతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బిగ్ బాస్ టీమ్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్లీ హౌస్‌లోకి తిరిగి వస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా, వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే పెద్ద హైప్ తెచ్చుకున్న ఆయేషా.. తాత్కాలిక ఎగ్జిట్‌తో మరోసారి చర్చల కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు మొత్తం దృష్టి ఆమె ఆరోగ్యంపై, తిరిగి ఎంట్రీ ఇస్తుందా లేదా అనే హాట్ టాపిక్ మారింది.

More from Filmibeat

Read more about: bigg boss bigg boss telugu ayesha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X