Bigg Boss Telugu 9 Winner: బిగ్‌బాస్ తెలుగు ట్రోఫి డిసైడ్ అయిందా? ఆ కంటెస్టెంట్‌నే విజేతనా?

Bigg Boss Telugu 9 Winner: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, ఈ రియాలిటీ షో గురించే చర్చ. ఈ సీజన్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుంది? అన్నది ఉత్కంఠగా మారింది. తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ రియాలిటీకు కేవలం ఒక్క రోజులోనే ఎండ్ కార్డ్ పడబోతుంది. అయితే.. ఈ సీజన్ మొత్తం డ్రామా, ఎమోషన్స్, ట్విస్టులు, అనూహ్య పరిణామాలతో సాగిన విషయం తెలిసిందే. అలాంటి బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌పై జరుగుతున్న ప్రచారాలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో రేపటి గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులుగా తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, సంజన గల్రానీ, జబర్దస్త్ ఎమ్మాన్యువల్ ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరు విజేత అవుతారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులు ఇలా ప్రతి చోటు ఇదే చర్చ జరుగుతోంది.

Bigg Boss Telugu 9 Winner

ఇప్పటి వరకు సోషల్ మీడియా పోల్స్, అన్‌ఆఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే 'సోల్జర్' ఇమేజ్‌తో బాగా పాపులర్ అయిన కళ్యాణ్ పడాల టాప్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఓ సామ్యానుడి గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తన ఆట, మాట తీరుతో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. టాస్కుల్లో చూపించిన కమిట్‌మెంట్, ఎమోషనల్ కనెక్ట్ కారణంగా కళ్యాణ్ విన్నర్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. ఇక ముద్ద మందారం ఫేమ్, సీరియల్ ఫేమ్ తనూజ కూడా ఓటింగ్ రేసులో దూసుకపోతుంది. పవన్ తో పోటీ పడి రెండో స్థానంలో నిలిచింది తనూజ. ఇక మూడో స్థానంలో ఇమ్మాన్యువల్ ఉన్నారని చాలా మంది పేర్కొన్నారు. సంజన, డీమాన్ పవన్ తర్వాత స్థానాల్లో ఉన్నట్టు టాక్ నడిచింది.

కానీ, ఫైనల్ ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. చివరి రోజు ఓటింగ్‌లో భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం, ఓటింగ్‌లో కళ్యాణ్ ఇంకా టాప్‌లో ఉన్నా... బిగ్ బాస్ టీమ్ ఫైనల్ మేకింగ్‌లో తనూజ వైపే మొగ్గు చూపుతోందన్న టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నిన్నటి వరకు 'కళ్యాణ్ విన్నర్' అన్న ప్రచారం నడిచినా. ఇప్పుడు 'తనూజనే టైటిల్ విన్నర్'అనే మరో వాదన బలంగా వినిపిస్తోంది.

దానికి కారణాలుగా పలువురు పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మా టీవీ వర్గాల సపోర్ట్, ముద్దా మందారం సీరియల్ టీమ్ మద్దతు, సీరియల్ ఆర్టిస్టుల ఓపెన్ సపోర్ట్, అలాగే కన్నడ బ్యాన్ నుంచి వస్తున్న భారీ ఓటింగ్ తనూజకు కలిసి వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ నంబర్స్‌లో కళ్యాణ్ ముందున్నా, బిగ్ బాస్ టీమ్ మాత్రం తనూజను విన్నర్‌గా ప్రకటించాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఎలిమినేషన్ల విషయానికి వస్తే, డేంజర్ జోన్‌లో సంజన, డీమాన్ పవన్, ఇమ్మాన్యువల్ ఉన్నట్టు సమాచారం. ముందుగా సంజన ఎలిమినేట్ అవుతారని, ఆ తర్వాత డీమాన్ పవన్ బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్. ఇమ్మాన్యువల్‌కు సూట్‌కేస్ ఆఫర్ ఇవ్వనున్నారని, కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇమ్మాన్యువల్‌కు కూడా 'నేనే విన్నర్' అనే నమ్మకంతో ఉన్నాడనీ అభిమానులు చెబుతున్నారు.

మొత్తానికి.. బిగ్ బాస్ అంటేనే ఊహించని ట్విస్టులు. చివరి క్షణంలో కూడా పరిస్థితి మారిపోవచ్చు. నిన్నటి వరకు కళ్యాణ్ విన్నర్ అని ప్రచారం జరిగితే, ఈరోజు తనూజనే బిగ్ బాస్ 9 విన్నర్ అనే ప్రచారం జరుగుతోంది. నిజంగా ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుందన్నది గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీదే తేలనుంది. పవన్ విన్నర్ అవుతాడా? లేక తనూజ విన్నర్ అని బిగ్ బాస్ మరో షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడా? అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు ఫినాలే కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 9 ట్రోఫీ డిసైడ్ అయిందా? లేక చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగుతుందా? అన్నది చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X